ETV Bharat / offbeat

అంబానీ భార్య బీరువాలో నంబర్ 1 చీర ఇదే - ఏ బ్రాండ్.. ధర ఎంతో తెలుసా?

నీతా అంబానీ ఫేవరేట్ చీర ఇదే - ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే!

Nita Ambani Favorite Saree Price
Nita Ambani Favorite Saree (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Interesting Facts about Nita Ambani Favorite Saree : సాధారణంగా మనకు నచ్చిన దుస్తులు కనిపిస్తే వాటిని కొని వార్డ్​రోబ్ లేదా బీరువాలో పెట్టేస్తాం. ఏదైనా శుభకార్యాలు, పండగలు, పార్టీల టైమ్​లో వాటిని ధరించి మురిసిపోతాం. అలాగే ఎవరైనా ఈ డ్రెస్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు? ధర ఎంత? అని అడిగితే అందుకు సంబంధించిన వివరాలన్నీ చెప్పేస్తాం. ఇలాగే ప్రపంచ కుబేరుడైన ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీకి కూడా అమితంగా నచ్చే చీర ఒకటుందట. దానికి వందల సంవత్సరాల కాలం నాటి చరిత్ర కూడా ఉందట! ఇక ఆ శారీ ధర కూడా లక్షల్లోనే ఉంటుందని చెబుతున్నారు డిజైనర్లు. అంతేకాదు, అంబానీ ప్యాలస్​లో ఈ తరహా చీరలు, డ్రస్సుల కలెక్షన్​తో ఓ ప్రత్యేకమైన వార్డ్​రోబే ఉందట! ఇంతకీ, ఈ మిసెస్ అంబానీ మనసు దోచిన ఆ శారీ ఏంటి? ధర ఎంత? దాని వెనుక ఉన్న కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ చాలా సింప్లిసిటీగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా తన డ్రస్సింగ్ సెన్స్​తో ఎంతోమందిని ఆకట్టుకుంటుంటారు. ఆయా సందర్భాన్ని బట్టి మిసెస్ అంబానీ ధరించే దుస్తులు కొన్నిసార్లు ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా నిలుస్తుంటాయి. నేటి తరం అమ్మాయిలకూ తన ఫ్యాషన్ సెన్స్​తో సరికొత్త ఫ్యాషన్ పాఠాలు నేర్పుతోన్న నీతా అంబానీ చీరల కలెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పట్టుతో పాటు ఫ్యాన్సీ, టస్సర్‌, ఎంబ్రాయిడరీ, పైథానీ, కలంకారీ, బనారసీ, నేత చీరలు, మీనాకారీ.. ఇలా ఆమె దగ్గర లేని వెరైటీ చీర లేదంటే అతిశయోక్తి కాదు. NMACCలో కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ కల్చరల్‌ ఈవెంట్‌ కోసం ఓ అందమైన శారీని ఎంచుకున్నారు నీతా అంబానీ. అన్నింట్లోనూ అదే తనకు చాలా ఇష్టమైన చీరట! అదే.. "పటోలా చీర".

పటోలా శారీలో మెరిసి..!

ఆ కల్చరల్ ఈవెంట్​లో మిసెస్ అంబానీ.. రెడ్ కలర్ పటోలా చీరను ధరించి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. ప్లెయిన్‌ రెడ్‌ కలర్‌ చీరకు పటోలా బోర్డర్‌తో హంగులద్ది.. పల్లూ మొత్తం పటోలా ప్రింట్‌తో హెవీగా డిజైన్‌ చేశారు డిజైనర్లు. గుజరాతీ శైలిలో పల్లూను వెనక నుంచి ముందుకు ధరించి ఆహా అనిపించారు నీతా. ఇక దీనికి జతగా ప్లెయిన్​ బ్లౌజ్ వెనుక రాధాకృష్ణులు బొమ్మలతో భారీగా ఎంబ్రాయిడరీ చేయించిన బ్లౌజ్​ ధరించారు. తన అటైర్‌కు మ్యాచింగ్‌గా బన్‌ హెయిర్‌స్టైల్‌తో మెరుపులు మెరిపించిన నీతా.. హెవీ ముత్యాల హారంతో తన లుక్‌ని కంప్లీట్ చేశారు. అప్పట్లో మిసెస్ అంబానీ ధరించిన ఈ శారీ వైరల్‌గా మారింది. ఇక దీని ధర విషయానికొస్తే.. రూ. 2 లక్షల వరకు ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇదొక్క శారీనే కాదు.. నీతా వార్డ్​రోబ్​లో పటోలా ప్రింట్స్‌తో డిజైన్‌ చేసిన జరీ బోర్డర్‌ చీరలు, పటోలా బోర్డర్‌తో కూడిన శారీలు, డిజిటల్‌ పటోలా శారీస్‌, పటోలా ప్రింటెడ్‌ పొత్లీ బ్యాగ్స్‌, పటోలా దుపట్టాలు.. ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. పటోలా చీరలు అంటే నీతా అంబానీకి ఎంతిష్టమంటే.. ఇటీవలే జరిగిన తన చిన్న కుమారుడు అనంత్‌-రాధికల వివాహ వేడుకలోనూ కొంతమంది అతిథులకు రిటర్న్‌ గిఫ్ట్‌గా ఈ చీరల్ని అందించారట ఆమె. గుజరాత్‌కు చెందిన కళాకారుల దగ్గర్నుంచి ఈ చీరలను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించారట ఈ ఫ్యాషన్‌ క్వీన్‌.

9 శతాబ్దాల చరిత్ర!

దేశవ్యాప్తంగా ఒక్కో స్టేట్ ఒక్కో ఫ్యాషన్​కు పెట్టింది పేరు. అలాగే గుజరాత్‌ పటోలా ఫ్యాషన్‌కు పట్టుగొమ్మ అని చెప్పుకోవచ్చు. సంవత్సరాలు కాదు, దశాబ్దాలు కాదు.. సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చీరల్ని డబుల్‌ ఇక్కత్‌ నేత చీరలుగానూ పేర్కొంటారు. గుజరాత్‌లోని పటాన్‌ ప్రాంతంలో ఈ శారీస్ తయారవడం వల్ల వీటికి పటోలా చీరలుగా పేరొచ్చింది. ఈ చీరలను స్వచ్ఛమైన సిల్క్‌ దారాలతో నేస్తారు. ముందుగా దారాలకు సహజసిద్ధమైన రంగులద్ది.. వాటితో విభిన్న డిజైన్లు, ప్యాటర్న్స్‌ వచ్చేలా వీటిని నేస్తారు.

ఇక వీటిపై తీర్చిదిద్దే ప్రత్యేకమైన మోటిఫ్స్‌ని ‘ఫుల్వాడీ’, నారీకుంజ్‌’, ‘రాస్‌’, ‘చౌక్డీ’, ‘లహెరియా’.. వంటి పేర్లతో పిలుస్తారు. అయితే, చూడ్డానికి సింపుల్‌గా కనిపించే ఈ చీరల్ని నేయడం మాత్రం చాలా క్లిష్టమైన ప్రక్రియని డిజైనర్లు అంటున్నారు. ఒక చీర తయారీకి సుమారు 6 నెలల టైమ్ పడుతుందని, ఇందుకోసం 10-12 మంది కళాకారులు కష్టపడాల్సి ఉంటుందంటున్నారు. నార్మల్ పటోలా చీరలతో పోల్చితే.. డిజిటల్‌ తరహాలో రూపొందుతోన్న శారీలు, ఇతర దుస్తులకు ప్రస్తుత రోజుల్లో ఆదరణ ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

పటోలా చీరలు చూడ్డానికి సింపుల్‌గా ఉన్నా.. హుందాగా, గ్రాండ్‌గా కనిపించేలా చేస్తాయంటున్నారు. పెళ్లి, పండగలు, భారీ ఎత్తున చేసుకునే వేడుకలకు ఇవి మంచి ఎంపిక అంటున్నారు డిజైనర్లు. ఇక ఆయా డిజైన్లను బట్టి వాటి ధర సుమారు రూ. 10 వేల నుంచి రూ. 7 లక్షల వరకు ఉంటుందట! అయితే, వీటిని మామూలు శారీస్ మాదిరిగా ఉతికి ఆరేయడం కాకుండా.. డ్రైవాష్‌ చేయిస్తే ఎక్కువ కాలం మన్నుతాయని చెబుతున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

నీతా అంబానీ మేకప్‌ ఆర్టిస్ట్‌ సాలరీ ఎంతో తెలుసా? షాక్​ అవ్వడం పక్కా!

కొత్త ప్రైవేట్ జెట్​ కొన్న అంబానీ- ఇది విమానం కాదు.. కదిలే ఇంద్ర భవనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.