ETV Bharat / offbeat

భర్తలు తమ సంపాదన మొత్తం తెచ్చి భార్య చేతిలోనే పెట్టాలి! - ఎక్కడో తెలుసా? - Husband Give Salary To Wife - HUSBAND GIVE SALARY TO WIFE

Husband Give Salary To Wife : మన కుటుంబ వ్యవస్థలో ఆర్థిక వ్యవహారాలు మెజారిటీగా భర్తలే చూస్తారు. కానీ అక్కడ మాత్రం రివర్స్! భర్త తెచ్చిన సంపాదన మొత్తం భార్య చేతిలోనే పెడుతారట! తరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది! ఆ వివరాలు మీకు తెలుసా?

Husband Give Salary To Wife
Husband Give Salary To Wife (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 9, 2024, 2:29 PM IST

Husband Give Salary To Wife : మన దేశంలో భర్త చేతుల మీదుగానే కుటుంబం నడుస్తుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ అతనే చక్కదిద్దుదాడు. భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేసినప్పటికీ.. చాలా కుటుంబాల్లో భర్తే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ.. జపాన్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. భర్తకు జీతం రాగానే రూపాయి ఖర్చు పెట్టకుండా డబ్బు మొత్తం తెచ్చి భార్య చేతిలో పెట్టాల్సిందేనట!

అక్కడ భర్త ఇచ్చిన డబ్బుపై పూర్తి అధికారమంతా భార్యదేనట. నగదు నిర్వహణ నుంచి ఇంటి ఖర్చుల వరకు ఆమెదే పూర్తి బాధ్యత. ఇంకా విచిత్రం ఏంటంటే కొంత మొత్తాన్ని భర్తకే తిరిగి పాకెట్​ మనీగా ఇస్తారట. ఈ సంప్రదాయాన్ని అక్కడ కొజుకైగా పిలుస్తారట. జపాన్ జనాభాలో సుమారు 74శాతం మంది దంపతులు ఇప్పటికీ ఈ విధానాన్నే అనుసరిస్తున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. అదే కాకుండా మహిళలు పొదుపు విషయంలో ఇతర దేశాలవారికి స్ఫూర్తిగా నిలుస్తారని అంటున్నాయి.

జపాన్​లో దాదాపు ప్రతి ఇంట్లో సంపాదనంతా తెచ్చి భార్య చేతిలో పెట్టే భర్తలే ఉంటారట! ఇలా భర్త తెచ్చిన సంపాదనను ఖర్చులు, పొదుపులు అనే రెండు వర్గాలుగా విభజించుకుంటారట అక్కడి మహిళలు. ఇంటికి కావాల్సిన రేషన్‌, నిత్యావసరాలు, ఇతర ఖర్చులు, పిల్లల స్కూల్‌ ఫీజులు ఇలాంటి ఖర్చుల కోసం కేటాయించి డబ్బును వినియోగిస్తుంటారట జపాన్​ మహిళలు!

అయినా.. మహిళలకు తెలిసినంతగా ఇంటి ఖర్చుల విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి. అందుకేనేమో మహిళల్ని హోమ్‌ మినిస్టర్లు అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే, ఇంటి అవసరాల కోసం డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినంతగా.. పొదుపు-మదుపులపై ఇల్లాలికి అవగాహన ఉండదని చాలామంది భావిస్తుంటారు. కానీ, జపాన్‌ మహిళలు అలా కాదట. అటు ఖర్చులతోపాటు పొదుపు, మదుపులోనూ నిష్ణాతులేనట! భర్త సంపాదనను ఇంటి అవసరాల కోసం సరిగ్గా ఖర్చు చేయడమే కాకుండా మిగిలిన డబ్బును పొదుపు చేయడంలోనూ ముందుంటారట జపాన్​ మహిళలు!

పొదుపు మాత్రమే కాదు మదుపూ తెలుసు
కేవలం పొదుపు చేయడమే కాకుండా లాభాలొచ్చే సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ.. మరి కొంత నగదును ప్రత్యేకమైన 'మనీ పర్సు'లో దాచుకుంటారట! ఈ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో తమను ఆదుకుంటుందని అక్కడి వారి నమ్మకం. అంతేకాదు ఒకవేళ ఎప్పుడైనా తమ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చినా.. లేదంటే తమ భర్త నుంచి విడిపోవాల్సి వచ్చినా.. ఇలాంటి విపత్కర పరిస్థితులు సద్దుమణిగే దాకా ఈ డబ్బు వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని జపాన్‌ మహిళలు భావిస్తుంటారట.

ఇంట్రస్టింగ్ : ఈ కాకులు మాట్లాడతాయి! - పాటలూ పాడతాయట!! - Interesting Facts About Crow

ఇంట్రస్టింగ్ ​: కింద కూర్చుని భోజనం చేస్తే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Benefits Of Eating Sitting On Floor

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.