ETV Bharat / offbeat

ప్రయోగం ఫలిస్తే మధుమేహ ఇన్సులిన్‌కు స్వస్తి - పండ్లు, ఆకులే షుగర్‌ వ్యాధికి మందు! - diabetes insulin can be stopped

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 11:57 AM IST

Updated : Aug 26, 2024, 12:11 PM IST

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది నిజంగా శుభవార్తే! ఇన్సులిన్‌ వాడకం అనేది ఎంతో వ్యయంతో కూడినదిపైగా డోసు ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. అలాంటి వారి బాధలను దూరం చేసేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం విభిన్న తరహా ప్రయోగాన్ని విజయం వంతం చేసింది. ఇంజక్షన్‌ రూపంలో ఇన్సులిన్‌ తీసుకునే విధానానికి స్వస్తి చెప్పి నోటి ద్వారా మొక్కలు, పండ్లు తీసుకునే ఔషధాన్ని రూపొందించి వాడకానికి ప్రభుత్వ అనమతి, పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు.

మధుమేహ ఇన్సులిన్‌
మధుమేహ ఇన్సులిన్‌ (ETV Bharat)

Medicine for diabetes: నిత్యం జనం ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు సులువైన పద్ధతిలో వైద్యం అందుబాటులోకి వస్తే అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు. అది కూడా ఎలాంటి ప్రతికూల ఫలితాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) ఇవ్వని వైద్యమైతే ఇంకా సంతోషం. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎమ్మెస్సీలో బయోటెక్నాలజీ చదువుతున్న కొందరు విద్యార్థినులు అలాంటి ప్రయత్నమే చేశారు. కొన్ని రకాల రోగాలకు ఇప్పుడు వాడుతున్న మందులకు బదులు ప్రత్యామ్నాయ మందులను తయారు చేసి పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. వాటి వాడకానికి ప్రభుత్వ అనుమతి కోసం కూడా పంపించారు. అనుమతి లభిస్తే కొన్ని రకాల రోగాలకు వైద్యం సులువవుతుంది.

డయాబెటీస్ రోగులు డ్రై ఫ్రూట్స్ తింటున్నారా?

మొక్కల ఇన్సులిన్‌కు పరిశోధన : మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కొందరు రోజూ ఇంజక్షన్‌ రూపంలో ఇన్సులిన్‌ తీసుకోవడం మనం చూస్తుంటాం. ఇది వ్యయ ప్రయాసతో కూడినది కావడంతో పాటు డోసు ఎక్కువైతే ప్రమాదమే. కొన్ని రకాల మొక్కలను ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండా పండించి వాటిలో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఎక్కించడం ద్వారా వాటిలో ఇన్సులిన్‌ వృద్ధి చేయవచ్చని బయోటెక్నాలజీ విద్యార్థినులు బాల రోహిత సుందరం, లేఖన ఆకుల గుర్తించారు. ఆయా కూరగాయలు, పండ్లు నోటి ద్వారా తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ అందుతుంది. ఆ మొక్కలు పెంచేందుకు కాలస్‌ కల్చర్‌ అనే పరికరాన్ని కూడా విద్యార్థినులు తయారు చేశారు.

మొక్కల పెంపకానికి తయారు చేసిన కాలస్‌ కల్చర్‌ పరికరం
మొక్కల పెంపకానికి తయారు చేసిన కాలస్‌ కల్చర్‌ పరికరం (ETV Bharat)

అండాశయంలో బుడగల నివారణ :మహిళలకు అండాశయంలో ఏర్పడే బుడగలు (పొలిసిస్టిక్‌ ఓవరియన్‌ సిండ్రోమ్‌) వంటి వాటి నివారణ సాధ్యమని ఇదే కళాశాలకు చెందిన మైథిలి ఆకెళ్ల, లేఖన ఆకుల, బాల రోహిత సుందరం భావించారు. ఈ సమస్యలకు ప్రధాన కారణం హార్మోన్ల హెచ్చు తగ్గులే కారణంగా భావించి వాటిని స్థిరీకరించే గుణం రావి ఆకులో ఉందని గుర్తించారు. దీంతో రావి ఆకును పచ్చడిలా చేసి అందులో నుంచి వచ్చే నీటి (పసర) ద్వారా ఈ సమస్య పరిష్కరించవచ్చనది వీరి ఆలోచన. దీనికోసం కూడా వీరు పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

బయోటెక్నాలజీ విద్యార్ధులు లేఖన, మైథిలి, బాల రోహిత
బయోటెక్నాలజీ విద్యార్ధులు లేఖన, మైథిలి, బాల రోహిత (ETV Bharat)

మధుమేహాన్ని తరిమికొట్టే మందులివే!

ఐబిఎస్‌సి.కి దరఖాస్తులు : నోటి ద్వారా ఇన్సులిన్‌, అండాశయంలో బుడగల నివారణ ప్రయోగాలపై సమగ్ర నివేదిక, తదుపరి కార్యచరణకు అనుమతి ఇవ్వాలని ఆంధ్ర విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో సేఫ్టీ కమిటీ(ఐ.బి.ఎస్‌.సి)కి దరఖాస్తు చేసింది. ఆ కమిటీ అనుమతిస్తే తొలుత ఎలుకలపై ప్రయోగం చేస్తారు. అక్కడ మంచి ఫలితం వస్తే ఆచరణలోకి తీసుకువస్తారు. ఇటు పేటెంట్‌ అనుమతులు.. అటు ఐ.బి.ఎస్‌.సి. నుంచి సానుకూల స్పందన వస్తే రెండు రకాల వ్యాధుల నుంచి ప్రజలకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది.

బయోటెక్నాలజీ విద్యార్ధులు లేఖన, మైథిలి, బాల రోహితలు తమ ఆలోచన కళాశాలలోని టీక్యాబ్స్‌-ఇ ల్యాబ్‌ నిర్వాహకులు డాక్టర్‌ రవి కిరణ్‌ యేడిదతో విద్యార్థినులు పంచుకున్నారు. డాక్టర్‌ రవికిరణ్‌ విద్యార్ధుల ప్రయోగాలను పర్యవేక్షించారు. ఆయన ఆంధ్ర వర్శిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం సహకారంతో పేటెంట్లకు దరఖాస్తు చేశారు.

చదవండి: పండు చిన్నదే ప్రయోజనాలు అనేకం

కడుపులో నొప్పిగా ఉందా?

Last Updated : Aug 26, 2024, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.