Hyderabad to Arunachalam Tour Package : అరుణాచలం.. తమిళనాడులోని ప్రసిద్ధమైన శైవక్షేత్రాలలో ముందు వరుసలో కనిపిస్తుంది. అక్కడి వారు ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలైగా పిలుచుకుంటారు. లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఒక్కసారి ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.
అందుకే.. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిత్యం ఎంతో మంది ఆ శివుడి అనుగ్రహం పొందడానికి తరలి వెళ్తుంటారు. మీరు కూడా అరుణాచలం వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే, మీకో గుడ్‌న్యూస్. హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం. ఈ ట్రిప్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్ 15వ తేదీ రోజు అందుబాటులో ఉంది. ఈ నెలలో టూర్ మిస్ అయితే మళ్లీ వచ్చే అక్టోబర్‌లో టూర్‌కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్లో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయి.
హైదరాబాద్ - అరుణాచలం పర్యటన ఇలా ఉంటుంది :
- మొదటి రోజు టూర్ హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
- రెండో రోజు మార్నింగ్ 6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి ఉదయం 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. అక్కడి నుంచి తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
- మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం రీచ్ అవుతారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. నైట్ అరుణాచలంలోనే బస చేస్తారు.
- మూడవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత.. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్‌ను దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
- నాలుగవ రోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పూర్తవుతుంది.
టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :
- తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది. ఈ టూర్లో టికెట్ ధర పెద్దలకు రూ.8,000 పిల్లలకు రూ.6,400గా నిర్ణయించారు.
- టూర్ ప్యాకేజీలో బస్ జర్నీ, అకామడేషన్ కవర్ అవుతాయి. ఆలయాల్లో దర్శనం టికెట్లు, భోజనానికి పర్యాటకులు సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది.
- టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి :
ఐఆర్సీటీసీ "గ్లోరీ ఆఫ్ గుజరాత్ విత్ మౌంట్ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!
"నాగార్జున సాగర్" టూర్ - కేవలం రూ.800లకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ!