Benefits of Mosquito Repellent Apps: కాలమేదైనా జనాల్ని తీవ్రంగా వేధించే సమస్యల్లో దోమల బెడద ఒకటి. కాస్త గట్టిగా గాలొస్తేనే కొట్టుకుపోయే దోమలు.. తేడా వస్తే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా రూపంలో మనుషుల ప్రాణాలనే తీసేస్తుంటాయి. అందుకే.. వీటి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రెపెల్లెంట్స్, కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్, మస్కిటో రాకెట్ అంటూ రకరకాల వాటిని ఉపయోగిస్తుంటారు. ఇవే కాకుండా సహాజ పద్ధతుల్లో దోమలను నివారించేందుకు మొక్కలు పెంచడం, పలు చిట్కాలు ఫాలో అవ్వడం వంటివన్నీ చేస్తుంటారు. కానీ ఏదీ సరిగా వర్క్‌వుట్ అవ్వదు. పైగా కెమికల్ల్ కలిగిన కాయిల్స్, క్రీమ్స్ ఉపయోగించడం వల్ల దోమలు చనిపోతాయేమో గానీ.. మన ఆరోగ్యం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే సహజ పద్ధతులు ఫాలో అవుతూనే కొన్ని రకాల మొబైల్ యాప్స్ ఉపయోగించడం వల్ల దోమలను తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ యాప్స్ ఏంటి? ఎలా పనిచేస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యాప్ ఎలా పనిచేస్తుంది: దోమలను తరిమికొట్టడానికి ఈ యాప్స్ అల్ట్రాసోనిక్ సౌండ్ ఫ్రీక్వెన్సీని ఉత్పత్తి చేస్తాయి. ఈ శబ్దం మనకు వినిపించదు కానీ దోమలకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో దోమలు ఆ ప్రాంతం నుంచి పారిపోతాయి.
యాప్స్ ఇవే:
యాంటీ మస్కిటో రెపెల్లెంట్ యాప్: ఈ యాప్‌ను ఫోన్‌లోని ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆన్ చేస్తే చాలు. దాని నుంచి విడుదలయ్యే హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్‌కు దోమలు ఆ చుట్టుపక్కలకు రావని నిపుణులు చెబుతున్నారు.
మస్కిటో రిపల్లెంట్ (iOS, ఆండ్రాయిడ్): ఈ యాప్ అధిక-ఫ్రీక్వెన్సీ ధ్వనిని విడుదల చేస్తుంది. ఇది మనకు వినిపించదు కానీ.. దోమలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీంతో అవి పారిపోతాయని అంటున్నారు.
యాంటీ మస్కిటో (iOS, ఆండ్రాయిడ్): ఈ యాప్ కూడా దోమలను తరిమికొట్టడానికి అధిక-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ను విడుదల చేస్తుంది.
మస్కిటో Away (iOS, Android): ఈ యాప్ దోమలను తరిమికొట్టడానికి సౌండ్స్ అండ్ వైబ్రేషన్ ద్వారా పనిచేస్తుంది.
రిపల్ మస్కిటోస్(ఆండ్రాయిడ్): ఈ యాప్ అధిక-ఫ్రీక్వెన్సీ సౌండ్‌ని రిలీజ్ చేస్తుంది. అలాగే దోమ కాటును ఎలా నిరోధించాలనే దానిపై చిట్కాలను కూడా సూచిస్తుంది.
మస్కిటో రిపెల్లర్ (iOS): ఈ యాప్ దోమలను తరిమికొట్టడానికి ప్రత్యేకమైన సౌండ్ ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తుంది. అలాగే దోమలను ట్రాక్ చేసే ఫీచర్‌ను కూడా అందిస్తుంది.
ఇవే కాకుండా మస్కిటో కిల్లర్, మస్కిటో సౌండ్, ఫ్రీక్వెన్సీ జనరేటర్ తదితర యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి కూడా దోమలను తరిమికొట్టవచ్చు.
యాప్స్ సమర్థత ఎంత? : ప్రస్తుతం ఈ యాప్స్‌కి మిలియన్ల సంఖ్యలో డౌన్‌లోడ్స్ ఉన్నాయి. మరి, ఈ యాప్స్ నిజంగానే దోమలను తరిమికొట్టగలవా అంటే.. మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. కొంతమంది బాగానే పనిచేస్తున్నాయని చెబితే.. వీటితో యూజ్ లేదని చెప్పేవారూ ఉన్నారు. ఓసారి యూజ్ చేసి స్వయంగా తెలుసుకుంటే బెస్ట్ అనేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే.. దోమలను తరిమికొట్టేందుకు ఎన్నో చిట్కాలు ఫాలో అవుతాం. ఓసారి ఈ యాప్స్ ట్రై చేస్తే పోయేది ఏమీ లేదుకదా అంటున్నారు. ఉపయోగం లేకపోతే తీసేస్తే సరిపోతుందంటున్నారు. మరి, మీరూ ఓసారి ట్రై చేస్తారా?
వర్షాకాలంలో దోమలకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్ వద్దు - ఇలా చేస్తే ఒక్క దోమ కూడా కుట్టదు!