ETV Bharat / offbeat

నాన్​వెజ్​తో పోటీ పడే "మీల్ మేకర్ మసాలా కర్రీ"- ఇలా చేస్తే మటన్​ను మించిన టేస్ట్​ పక్కా! - Meal Maker Masala Curry in Telugu

Meal Maker Masala Curry in Telugu: మీల్​మేకర్​తో చేసే వంటకాలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. మీకు కూడా వాటితో చేసిన వంటలు అంటే ఇష్టమా? అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కొత్తగా మీల్ మేకర్ మసాలా రెసిపీ ట్రై చేయండి. ఈ కర్రీ రుచి​.. మటన్ కంటే కూడా సూపర్​గా ఉంటుంది.

Meal Maker Masala Curry in Telugu
Meal Maker Masala Curry in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 22, 2024, 11:34 AM IST

Meal Maker Masala Curry in Telugu: మీల్ మేకర్​తో చేసే ఏ వంటకమైనా సరే నిమిషాల్లో రెడీ అవుతుంది. అంతే కాదు టేస్ట్​ కూడా సూపర్​గా ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక వెజ్​ ప్రియులైతే వీటితో వెరైటీ వంటకాలు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ ఒకటే రకం కాకుండా.. ఈసారి కాస్త కొత్తగా​ మీల్ మేకర్ మసాలా కర్రీని ట్రై చేయండి. ఈ కర్రీని చాలా ఈజీగా ఫాస్ట్​గా చేసుకోవచ్చు. దీనిని అన్నం, చపాతీ, బిర్యానీ ఇలా ఎందులోకి తిన్నా సరే.. చాలా రుచి​గా ఉంటుంది. చాలా ప్రోటీన్లతో నిండిన ఆహారం కావడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదట. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • ఒక కప్పు మీల్ మేకర్
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఒక ఇంచు దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • రెండు యాలకలు
  • ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 రెబ్బల కరివేపాకు
  • 2 పచ్చిమిరపకాయ ముక్కలు
  • పావు టీ స్పూన్ పసుపు
  • ఒకటిన్నర టీ స్పూన్ కారం
  • రుచికి సరిపడా ఉప్పు
  • నూనె
  • వెన్న (ఆప్షనల్)

మసాలా కోసం కావాల్సిన పదార్థాలు

  • రెండు ఇంచుల దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • 2 యాలకులు
  • ఒక టీ స్పూన్ గసగసాలు
  • ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు
  • ఒక టీ స్పూన్ ధనియాలు
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • 3 ఇంచుల ఎండు కొబ్బరి
  • ఒక టమాట ముక్కలు
  • 2 టేబుల్ స్పూన్ల పెరుగు
  • ఒక టీ స్పూన్ కసూరి మెతి(ఆప్షనల్)
  • ఒక టేబుల్ స్పూన్ పుదీనా
  • కొద్దిగా కొత్తిమీర
  • తయారీ విధానం
  • ముందుగా మసాలా కోసం మిక్సీ జార్​లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, గసగసాలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోకి టమాట ముక్కలు, పెరుగు వేసి మరోసారి గ్రైండ్ చేసుకుంటే మసాలా రెడీ అయిపోతుంది.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి మూతపెట్టి మరిగించాలి.
  • నీరు మరిగాక స్టౌ ఆఫ్ చేసి ఇందులోకి ఒక కప్పు మీల్ మేకర్ వేసుకుని మెత్తపడేవరకు 2 నిమిషాలు ఉంచాలి.
  • అనంతరం వాటిని గట్టిగా పిండి నీరు లేకుండా చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె, వెన్న పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత జీలకర్ర, లవంగాలు, యాలకలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి.
  • అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా మారేవరకు వేగనివ్వండి
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి.
  • ఇందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి లైట్​గా వేగనివ్వండి
  • అనంతరం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి.. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకోవాలి.
  • ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న మీల్ మేకర్​ను వేసుకోవాలి.
  • ఇందులోనే కసూరి మెతి, పుదీనా వేసుకుని బాగా కలపి.. గ్రేవీ కోసం నీళ్లు పోసుకోవాలి.
  • ఇప్పుడు దీనిని ఒకసారి కలిపి మూత పెట్టుకుని సుమారు 5 నిమిషాల పాటు ఉడికించాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీరను గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మసాలా మీల్ మేకర్ కర్రీ రెడీ!

వేడివేడి అన్నంలోకి నల్ల కారం పొడి - కాస్త నెయ్యి తగిలిస్తే ఆహా అనాల్సిందే! - ఇలా ప్రిపేర్ చేయండి - How to Make Nalla Karam in Telugu

నిగనిగలాడే దొండకాయలతో అద్దిరిపోయే రోటి పచ్చడి - ఇవి కలపండి - అమోఘమైన టేస్ట్ చూస్తారు! - Dondakaya Pachadi Recipe in Telugu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.