ETV Bharat / offbeat

కాకరకాయ చేదని తినట్లేదా? - ఈ కొలతలతో పచ్చడి చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! - KAKARAKAYA NILVA PACHADI IN TELUGU

-చేదు లేకుండా కాకరకాయను రుచిగా రోజు తినేయచ్చు - నెలల పాటు నిల్వ ఉండే పచ్చడిని చేసుకోండిలా

Kakarakaya Nilva Pachadi in Telugu
Kakarakaya Nilva Pachadi in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 26, 2024, 10:36 AM IST

Kakarakaya Nilva Pachadi in Telugu: కాకరకాయ అనగానే చేదు అంటూ చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కానీ ఈ కొలతలతో పచ్చడి చేస్తే మాత్రం చేదు లేకుండా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలి? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • అర కిలో కాకరకాయలు
  • 80 గ్రాముల చింతపండు
  • ఒక టీ స్పూన్ బెల్లం
  • ముప్పావు టీ స్పూన్ మెంతులు
  • ఒక టేబుల్ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • 2 కప్పుల నువ్వుల నూనె
  • 30 దంచిన వెల్లులి పాయలు
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • పావు టీ స్పూన్ ఇంగువా
  • 3 ఎండు మిరపకాయలు
  • కొద్దిగా కరివేపాకు
  • అర కప్పు ఉప్పు
  • ఒక కప్పు కారం
  • ఒక టీ స్పూన్ పసుపు

తయారీ విధానం

  • ముందుగా కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మొదలు, చివర కోసి కొద్దిగా లావుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇలా కట్ చేసిన తర్వాత అర గంట పాటు గాలికి ఆరబెట్టుకోవాలి.
  • మరోవైపు ఓ గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి మంచినీటిని పోయాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి దీనిని పెట్టుకుని ఉడికించుకోవాలి. కాసేపయ్యాక ఇందులోనే బెల్లం వేసి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి.
  • చింతపండు మెత్తగా మారి ఉడుకుతున్న సమయంలో దీనిని పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి.
  • మరో గిన్నెను తీసుకుని అందులో మెంతులు వేసుకుని రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకుని నిమిషం పాటు వేయించుకోవాలి. వీటిని చల్లారబెట్టుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం ఉడకబెట్టిన చింతపండు మిశ్రమాన్ని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మరోసారి స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక ముందుగా కట్ చేసి ఆరబెట్టిన కాకరకాయ ముక్కలను వేసి హై ఫ్లేమ్​లో పెట్టి ఫ్రై చేసుకోవాలి.
  • కాకరకాయలు రంగు మారేంత వరకు ఉంచుకుని ఆ తర్వాత జల్లి గంటెతో తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఇదే నూనెలో 10 దంచిన వెల్లులి పాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువా, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • ఇందులోనే గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జును వేసి కాసేపు వేయించుకోని స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. (ఇలా చేయడం వల్ల చింతపండులోని తడి పోయి చాలా రోజులు నిల్వ ఉంటుంది)
  • మరో గిన్నెలో గ్రైండ్ చేసుకున్న మెంతి పొడి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి.
  • ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి ముక్కలకు కారం బాగా పట్టేలా కలపాలి.
  • ఆ తర్వాత 20 దంచిన వెల్లుల్లి పాయలు, చల్లారబెట్టుకున్న తాళింపును వేసి బాగా కలిపితే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ!
  • దీనిని పెట్టిన రోజు నుంచే తినవచ్చు. కానీ మంచి రుచిగా రావాలంటే మాత్రం రెండు రోజుల తర్వాత తింటే అద్భుతంగా ఉంటుంది. రెండు రోజుల తర్వాత అవసరమైతే ఉప్పు వేసుకుని తింటే అద్దిరిపోతుంది.

నోరూరించే ఆంధ్రా స్టైల్ "గోంగూర నిల్వ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే ఏడాది పాటు ఉంటుంది!

గుంటూరు స్పెషల్ 'నిమ్మకాయ కారం' - చిటికెలో చేసేయండిలా! - ఒక్కసారి తిన్నారంటే నా సామిరంగా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.