ETV Bharat / offbeat

ఫ్రెంచ్ ఫ్రైస్ బయట తింటున్నారా? - ఈ టిప్స్​తో ట్రై చేస్తే ఇంట్లోనే రెస్టరెంట్​ స్టైల్! - పైగా ఎంతో టేస్టీ!

- ఎక్కువ టైమ్​ అవసరం కూడా లేదు -చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు

author img

By ETV Bharat Features Team

Published : 2 hours ago

How to Make Homemade French Fries
How to Make Homemade French Fries (ETV Bharat)

How to Make Homemade French Fries: బంగాళదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్​ అనగానే చాలా మందికి నోరూరిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వీటికి కాస్త ఉప్పు-కారం, మసాలా దట్టించి తింటే.. ఆ టేస్టే వేరే లెవల్ ఉంటుంది​. అయితే, చాలా మంది వీటిని ఇంట్లో చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అని.. బయటే కొనుగోలు చేస్తారు. కానీ.. ఈ పద్ధతి పాటిస్తే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 3 బంగాళ దుంపలు (పెద్దవి)
  • అర చెక్క నిమ్మ రసం
  • రుచికి సరిపడా ఉప్పు
  • 3 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్
  • ఫ్రైకి సరిపడా నూనె
  • అర టీ స్పూన్ కారం
  • అర టీ స్పూన్ చాట్ మసాలా
  • అర టీ స్పూన్ ఆమ్ చూర్ పొడి
  • అర టీ స్పూన్ చక్కెర పొడి

తయారీ విధానం

  • ముందుగా బంగాళ దుంపలను శుభ్రంగా కడిగి చెక్కు తీయాలి. ఆ తర్వాత బంగాళ దుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మరీ సన్నగా, లావుగా కాకుండా మీడియం సైజులో పొడవుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు వీటిని ఓ గిన్నెలో వేసి మూడు సార్లు బాగా కడగాలి.
  • మరో వైపు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
  • నీళ్లు మరుగుతున్న సమయంలో కొద్దిగా ఉప్పు, నిమ్మ రసం పిండి నిమ్మతొక్కను దానిలోనే వేసుకోవాలి.
  • ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసిన ఆలూ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. (మధ్యమధ్యలో కింది నుంచి పైకి కలుపుతూ ఉండాలి. కింది బాగా ఉడికి పైనా బాగా ఉడకవు)
  • అనంతరం జల్లి గంటతో ఆలూ ముక్కలను నీటిలో నుంచి తీసి పక్కకు పెట్టుకుని 10 నిమిషాల పాటు చల్లారబెట్టుకోవాలి. (ఆలూ ముక్కలు పూర్తిగా చల్లారాలి. త్వరగా చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు)
  • ఆలూ ముక్కలు చల్లారిన తర్వాత కార్న్ ఫ్లోర్ వేసి నిధానంగా కలపాలి.
  • ఇప్పుడు ఫ్రై చేసేందుకు స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె బాగా వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలను వేసి నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత వీటిని తీసి బయట పెట్టుకుని.. మరి కొన్ని ఆలూ ముక్కలను వేసుకోవాలి.
  • మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి అంతకుముందు వేయించిన ఆలూ ముక్కలను మరోసారి వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మసాలా కోసం ఓ చిన్న గిన్నెలో కారం, రుచికి సరిపడా ఉప్పు, చాట్ మసాలా, ఆమ్ చూర్ పొడి, చక్కెర పొడిని వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఆలూ ముక్కలపై చల్లుకుంటే టేస్టీ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ!

ఎన్నిసార్లు చేసినా "ఇడ్లీలు" మెత్తగా రావట్లేదా ? - ఈ కొలతలు, టిప్స్​ పాటిస్తూ చేస్తే దూదిలాంటివి పక్కా!

కూరగాయలు లేనప్పుడు - 5 నిమిషాల్లోనే ఇలా "ఉల్లిగడ్డ కారం" చేసుకోండి! - వేడివేడి అన్నంలో తింటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.