ETV Bharat / offbeat

ఎగ్​ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి! - how to prepare egg dosa in telugu - HOW TO PREPARE EGG DOSA IN TELUGU

బ్రేక్​ఫాస్ట్​లో ఎక్కువ మంది ఇష్టపడే టిఫెన్స్​లో దోశ తప్పనిసరిగా ఉంటుంది. అయితే, చాలా మంది మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ వంటివి తింటుంటారు. కానీ.. ఇంట్లోనే సూపర్​ టేస్ట్​తో ఎగ్​ దోశ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇంకెందుకు ఆలస్యం ఎగ్​ దోశ ఎలా చేయాలో తెలుసుకుని హాయిగా చేసుకొని తినండి.

how to prepare egg dosa in telugu
how to prepare egg dosa in telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 4:10 PM IST

How To Prepare Egg Dosa In Telugu : మనకు ప్రొటీన్ అందించే చౌకైన ఆహారాల్లో గుడ్డు ఒకటి. తక్కువ ధరలో మంచి పోషకాలను గుడ్డు అందిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే.. మనలో చాలా మందికి గుడ్డుతో కర్రీ వండుకోవడం, ఉడకబెట్టుకోవడం లేదా ఆమ్లెట్‌ వేసుకోవడం మాత్రమే చేస్తుంటారు. కానీ కొందరికి గుడ్డును ఉడకబెట్టుకుని నేరుగా తినడం అంటే నచ్చదు. అలాంటి వారికోసం ఈజీగా చేసుకుని మంచి రెసిపీ ఎగ్​ దోశ. ఈ నేపథ్యంలోనే ఎగ్​ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు మినపప్పు
  • 2 కప్పులు బియ్యం (ఇడ్లీ రైస్)
  • ఒక టేబుల్ స్పూన్​ శెనగపప్పు
  • ఒక టీ స్పూన్ మెంతులు
  • ఒక టేబుల్ స్పూన్​ బొంబాయి రవ్వ
  • ఒక టేబుల్ స్పూన్ చక్కెర
  • ఉప్పు రుచికి సరిపడా
  • 2 టీ స్పూన్ల కారం
  • ఒక టీ స్పూన్​ ధనియాల పొడి
  • పావు టీ స్పూన్ జీరకర్ర పొడి
  • ఒక టీ స్పూన్ పెరిపెరి పౌడర్​
  • ఆఫ్ టీ స్పూన్ చాట్​ మసాలా
  • వెన్న
  • ఉల్లిపాయలు
  • పచ్చిమిర్చీ
  • కొత్తిమీర
  • గుడ్లు
  • నూనె

దోశ పిండి తయారీ విధానం..

  • ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, బియ్యం, మెంతులు, శెనగపప్పు వేసి నీటితో బాగా కడగాలి. (మిక్సీ జార్​లో అయితే ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి. గ్రైండర్​లో అయితే ఒక కప్పుకు మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి)
  • ఆ తర్వాత నిండుగా నీటిని పోసి ఈ పప్పు, బియ్యాన్ని సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం ఈ మిశ్రమాన్ని తగినంత నీటిని పోసుకుంటూ పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఈ పిండి మొత్తాన్ని ఓ గిన్నెలో తీసుకని బాగా కలపాలి. ఆ తర్వాత సుమారు 10 గంటలు పక్కకు పెట్టాలి.
  • ఆ తర్వాత ఇందులోనే బొంబాయి రవ్వ, నీరు, ఉప్పు, చక్కెర వేసి పిండిని కలపాలి.

ఎగ్​ దోశ తయారీ విధానం..

  • మరోవైపు చిన్న కప్పు తీసుకుని కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్​ మసాలా, పెరి పెరి పౌడర్​ను వేసి బాగా కలుపి పక్కకు పెట్టుకోవాలి.
  • స్టౌ ఆన్​ చేసి పెనంను వేడి చేసుకుని కొద్దిగా ఆయిల్ పోసి క్లీన్​గా చేసుకోవాలి.
  • పెనం​ బాగా వేడయ్యాక పిండితో దోశను వేసుకోవాలి.
  • మంటను లో ఫ్లేమ్​లో పెట్టుకుని దోశపై వెన్న, పచ్చిమిర్చీ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ముందుగా రెడీ చేసుకున్న కారం వేసుకోవాలి.
  • ఆ తర్వాత దీనిపైనే గుడ్డును కొట్టి పోసుకోని దోశ మొత్తం స్ప్రెడ్​ చేయాలి.
  • అనంతరం దోశ చుట్టూ కొద్దిగా నూనెను పోసుకుని వేడయ్యాక.. మరో పక్కకు తిప్పుకుని దించేసుకోవాలి.
  • అంతే.. క్రిస్పీగా ఎంతో టేస్టీగా నోరూరించే ఎగ్​ దోశ రెడీ! ఆ తర్వాత దీనిని మీకు ఇష్టమైన చట్నీతో హ్యాపీగా తినొచ్చు.

నోరూరించే సేమ్యా హల్వా - తిన్నారంటే మాయమైపోతారు! - semiya halwa recipe in telugu

ఇంట్లోనే దాబా స్టైల్​ "పాలక్​ పనీర్"​- చపాతీలతో తింటే అదుర్స్​! ఇలా చేసేయండి! - how to make palak paneer at home

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.