ETV Bharat / offbeat

నిగనిగలాడే దొండకాయలతో అద్దిరిపోయే రోటి పచ్చడి - ఇవి కలపండి - అమోఘమైన టేస్ట్ చూస్తారు! - Dondakaya Pachadi Recipe in Telugu - DONDAKAYA PACHADI RECIPE IN TELUGU

Dondakaya Pachadi Recipe in Telugu: వేడి వేడి అన్నంలోకి కమ్మని రోటి పచ్చడి కలుపుకొంటే.. ఆ ఫీలింగే వేరు. అయితే.. చాలా మంది టమాటాలతోనే రోటి పచ్చడి చేస్తుంటారు. కానీ.. ఇలా దొండకాయతో ట్రై చేశారంటే వారెవ్వా అంటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ దొండకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Dondakaya Pachadi Recipe in Telugu
Dondakaya Pachadi Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 20, 2024, 3:38 PM IST

Dondakaya Pachadi Recipe in Telugu: దొండకాయ పచ్చడిని అనేక రకాలుగా చేసుకుంటుంటారు. సాధారణంగా చాలా మంది దొండకాయ, పచ్చిమిర్చీని మగ్గించి గ్రైండ్ చేస్తుంటారు. కానీ ఓ సారి మరో విధంగా ప్రయత్నిద్దాం. రుచి అమోఘంగా ఉంటుంది. ఈ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అట్టు, చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి, ఈ దొండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలా? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • 300 గ్రాముల దొండకాయలు
  • 15 పచ్చిమిరపకాయలు
  • ఒక టేబుల్ స్పూన్ మెంతులు
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఒక రెబ్బ కరివేపాకు
  • గోళీ సైజంతా చింతపండు
  • కొద్దిగా కొత్తిమీర
  • నూనె

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె పోసుకోవాలి.
  • నూనె వేడయ్యాక మెంతులు వేసి కాసేపు వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేగితేనే టేస్ట్ ఉంటుంది. లేకపోతే చేదుగా ఉంటుంది.
  • మెంతులు వేయించాక ఆవాలు వేసుకుని కాసేపు చిటపటమనిపించాలి.
  • ఆ తర్వాత మినపప్పు, శెనగపప్పు వేసి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పొట్టు మినపప్పు వాడితే బాగుంటుంది.
  • ఇవన్నీ వేగాక స్టౌ ఆఫ్ చేసి జీలకర్ర, కరివేపాకు వేసి 30 సెకన్ల పాటు ఫ్రై చేయాలి.
  • అనంతరం ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • మరోసారి స్టౌ ఆన్ చేసి అదే గిన్నెలో నూనె పోసి వేడిచేసుకోవాలి. మీ దగ్గర ఐరన్ లేదా కాస్ట్ ఐరన్ గిన్నె ఉంటే వాడడం బెటర్.
  • ఆ తర్వాత దొండకాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో మగ్గించుకోవాలి.
  • అనంతరం ఇందులోనే చింతపండు వేసి 30 సెకన్లు పాటు ఫ్రై చేసి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లారబెట్టి మిక్సీలో వేసుకోవాలి. దీంతో పాటు ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీటిని పోయకూడదు.

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు..

  • పావు కప్పు నూనె
  • అర టీ స్పూన్ ఆవాలు
  • అర టీ స్పూన్ మినపప్పు
  • ఒక టీ స్పూన్ శెనగపప్పు
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • రెండు ఎండు మిర్చి
  • రెండు చిటికెల ఇంగువా
  • ఒక రెబ్బ కరివేపాకు

తాళింపు విధానం..

  • ముందుగా కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి. కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది.
  • ఆ తర్వాత ఇందులో ఆవాలు, మినపప్పు, శెనగపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువా కరివేపాకు వేసి దోరగా వేయించుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందుగా చేసుకున్న పచ్చడిలో ఉప్పు, తాళింపు మిశ్రమం, కొత్తిమీర ఇందులో వేసి కలిపితే సూపర్ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ!

నోరూరించే స్పైసీ గోంగూర పనీర్ కర్రీ - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ వేరే లెవల్​! - How to Make Gongura Paneer Curry

తెల్ల ఇడ్లీతో షుగర్ సమస్యా! - చక్కటి ఆరోగ్యాన్ని అందించే రాగి ఇడ్లీ - ఇలా ప్రిపేర్ చేసుకోండి! - Instant Ragi Idli Recipe in Telugu

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.