ETV Bharat / offbeat

చూస్తేనే తినాలనిపించే "ఉసిరికాయ తొక్కు పచ్చడి" - అన్నం, టిఫెన్స్​లోకి అద్దిరిపోతుంది! - HOW TO MAKE INSTANT AMLA PACHADI

-ఉసిరికాయలతో అద్దిరిపోయే తొక్కు పచ్చడి -ఇలా చేస్తే ఎంతో టేస్ట్​ పైగా నాలుగు రోజులు నిల్వ

How to Make Usirikaya Pachadi Instantly
How to Make Usirikaya Pachadi Instantly (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 11:19 AM IST

How to Make Usirikaya Pachadi Instantly: ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ఉసిరికాయలు ఒకటి. ప్రస్తుతం ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. ఇక ఉసిరికాయలతో.. మనలో చాలా మంది నిల్వ పచ్చళ్లు తయారు చేస్తుంటారు. కొద్దిమంది పప్పు వండుకుంటే మరికొద్దిమంది పులిహోర చేసుకుని తృప్తిగా ఆరగిస్తుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు.. ఉసిరికాయలతో అద్దిరిపోయే తొక్కు పచ్చడి ప్రిపేర్​ చేసుకోవచ్చు. దీనిని చూస్తేనే నోరూరుతుంది. ఇక వేడి వేడి అన్నంలో కూసింత నెయ్యి వేసుకుని కొద్దిగా పచ్చడి కలిపి తింటే కలిగే మజానే వేరు. ఇది తయారు చేయడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. మరి ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • ఉసిరికాయలు - పావు కేజీ
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • మెంతులు - 1 టీ స్పూన్​
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - పావు టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 12
  • పచ్చి మిర్చి - 5
  • పసుపు - అర టీ స్పూన్​
  • ఇంగువు - చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:

  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్​
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఎండు మిర్చి - 3
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి నీళ్ల తడి లేకుండా తుడిచి గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్​ చేయాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఆయిల్​ పోసుకోవాలి. ఆ తర్వాత అందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు సరిగా వేగకపోతే పచ్చడి చేదు అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మెంతులను మంచిగా కలర్​ మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • మెంతులు ఫ్రై అయిన తర్వాత ఎండు మిర్చి, పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసి వేసి వేయించుకోవాలి. అయితే ఇక్కడ మీరు తినే కారానికి అనుగుణంగా మిరపకాయలు వేసుకోవాలి. అయితే ఈ పచ్చడి కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది.
  • మిర్చి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్​ను లో ఫ్లేమ్​లో పెట్టి పసుపు, ఇంగువ వేసి నూనెలో మంచిగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కట్​ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మంటను సిమ్​లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఓ 10 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి.
  • ఉసిరికాయ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి వేసి నీళ్లు పోయకుండా కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. నీళ్లు పోసుకుంటే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉండదు. నీళ్లు పోయకపోతే ఓ నాలుగు రోజుల పాటు పచ్చడి తాజాగా ఉంటుంది. కావాలంటే మీరు ఈ పచ్చడిని రోట్లో కూడా రుబ్బుకోవచ్చు.
  • ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
  • ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. అనంతరం కరివేపాకు వేసి చిటపటలాడించాలి.
  • పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మిక్సీ పట్టిన ఉసిరికాయ పచ్చడిని వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ.
  • వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే వేరే లెవల్​ ఉంటుంది. కేవలం అన్నంలోకి మాత్రమే కాదు ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా.. ఇలా ఏ టిఫెన్​లోకైనా సూపర్​గా సెట్​ అవుతుంది.

సీజనల్​ స్పెషల్​ - ఘాటైన రుచితో "ఉసిరికాయ రసం" - ఇలా చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు​!

పర్ఫెక్ట్​ లంచ్​ బాక్స్​ రెసిపీ "ఆమ్లా రైస్​" - ఇలా చేశారంటే మెతుకు మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.