ETV Bharat / offbeat

వింటర్​ స్పెషల్​ - రెస్టారెంట్​ స్టైల్​ "టమాటా సూప్​"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతం!

-చల్లటి గాలులకు వెచ్చదనాన్ని అందించే టమాటా సూప్​ -ఇంట్లో సింపుల్​గా చేయండిలా

Tomato Soup
How to Make Tomato Soup (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 4:49 PM IST

How to Make Tomato Soup : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మొదలైంది. ఈ క్రమంలోనే ఈవెనింగ్​ టైమ్​లో కాస్త కారంగా.. వేడివేడిగా ఏదైనా సూప్​లు తాగాలనిపిస్తుంటుంది. హాట్​హాట్​గా గొంతులోకి సూప్​ జారితుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం ఎంతో రుచికరంగా ఉండే రెస్టారెంట్ స్టైల్​ 'టమాటా సూప్​' ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చేయడం కూడా చాలా సులభం. ఒక్కసారి ఇలా చేసి పెడితే ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తాగేస్తారు. అలాగే ఈ సూప్​ తాగడం వల్ల జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి సింపుల్​గా టమాటా సూప్​ ఎలా చేయాలో మీరు ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • వెల్లుల్లి రెబ్బలు-4
  • టమాటలు-అర కేజీ
  • బటర్​ - 2 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు​ - 2 టేబుల్​స్పూన్లు
  • బిర్యానీ ఆకు
  • మిరియాలు-అరటీస్పూన్
  • క్యారెట్​ ముక్కలు-పావు కప్పు
  • బీట్​రూట్​ ముక్కలు-6
  • ఉప్పు-రుచికి సరిపడా
  • షుగర్​-టీస్పూన్​
  • మిరియాల పొడి-పావు చెంచా

బ్రెడ్​ క్రంప్స్​ కోసం..

  • మిల్క్​ బ్రెడ్​-2
  • నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై పాన్​ పెట్టి బటర్​ వేయండి. బటర్​ కరిగిన తర్వాత కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్​ ముక్కలు వేసి మగ్గించండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత బీట్​రూట్​ ముక్కలు వేసి బాగా కలపండి. (టమాటా సూప్​లో ఎలాంటి ఆర్టిఫిషీయల్​ కలర్స్ వాడకుండా మంచి రంగు రావడానికి కొన్ని బీట్​రూట్​ ముక్కలు వేయాలి)
  • కొద్దిసేపటి తర్వాత టమాటా ముక్కలు వేసుకుని బాగా కలపండి. (టమాటాలు బాగా పండినవి అయితే, సూప్​ చాలా రుచికరంగా ఉంటుంది)
  • ఇప్పుడు ఇందులో ఉప్పు, చక్కెర వేసి కలపండి.
  • తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి, టమాటాలు మెత్తగా ఉడికించుకోండి.
  • టమాటాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు టమాటా ప్యూరీ మిశ్రమాన్ని జల్లించి ఒక పాన్​లోకి తీసుకోండి.
  • టమాటా సూప్​లో రుచికి సరిపడా ఉప్పు చూసుకొని.. మిరియాల పొడి వేసి కలపండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి సూప్​ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి.
  • ఈ సమయంలో పైన వచ్చే తెల్లటి నురగను గరిటెతో తీసేయండి. అంతే ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేయండి.
  • తర్వాత మిల్క్​ బ్రెడ్ చిన్నగా కట్​ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి బ్రెడ్​ స్లైసెస్​ వేసుకోండి. బ్రెడ్​ ముక్కలు గోల్డెన్​ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత సూప్​లో వేసుకోండి.
  • అంతేనండి.. ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే రెస్టారెంట్​ స్టైల్​ టమాటా సూప్​ రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఇలా టమాటా సూప్ ఇంట్లో చేసేయండి..

అద్దిరిపోయే "రాగి సూప్"​​- ఇలా చేస్తే సూపర్ టేస్ట్! పైగా ఆరోగ్యం బోనస్​!​

చిరు జల్లుల వేళ వేడివేడిగా "క్యారెట్‌ జింజర్​ సూప్‌"- నిమిషాల్లో అద్దిరిపోయే టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.