ETV Bharat / offbeat

తెలుగు వారికి ఎంతగానో నచ్చే సేమియా ఉప్మా - పొడి పొడిగా ఇలా చేసేయండి - పిల్లలు ఇష్టంగా తినేస్తారు! - Semiya Upma In Telugu - SEMIYA UPMA IN TELUGU

Vermicelli Upma Recipe : చాలా మందికి నచ్చిన అల్పాహారంలో సేమియా ఉప్మా ముందు వరసలో ఉంటుంది. కానీ.. దాన్ని ప్రిపేర్ చేయడం అందరికీ సరిగా రాదు. ఎక్కువ సార్లు మెత్తగా అవుతుంది. ఇలా కాకుండా చక్కగా పొడి పొడిగా కావాలంటే.. మేం చెప్పే ఈ టిప్స్ పాటించండి.

Semiya Upma In Telugu
Vermicelli Upma Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 12:39 PM IST

How To Make Semiya Upma in Telugu : ఇంట్లో బ్రేక్​ఫాస్ట్ ప్రిపేర్​ చేయడానికి ఇడ్లీ, దోశ పిండి లేకపోతే.. చాలా మంది ఉప్మా చేసేస్తారు. ఈ ఉప్మా రెసిపీలో కొంతమందికి సేమియా ఉప్మా అంటే చాలా ఇష్టం. పిల్లలు లంచ్​బాక్స్​లో కూడా ఎంతో ఇష్టంగా దీన్ని తినేస్తారు. కానీ.. ఈ రెసిపీ పొడి పొడిగా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు. ముద్ద ముద్దగా ఉంటే.. పక్కన పడేస్తారు. అందుకే.. సేమియా ఉప్మా పొడిపొడిగా ఉండడం చాలా ముఖ్యం. మరి, ఇలా టేస్టీగా ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సేమియా - గ్లాసు
  • క్యారెట్​- ఒకటి (సన్నగా కట్​చేసుకోవాలి)
  • పచ్చిబఠానీలు- అరకప్పు
  • ఉల్లిపాయ-1 (సన్నగా కట్​చేసుకోవాలి)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కరివేపాకు-ఒకటి
  • వేరుశనగలు- 2 టేబుల్​స్పూన్లు
  • నూనె-టేబుల్​స్పూన్
  • అల్లం తురుము-టీస్పూన్​
  • జీడిపప్పు-పావు కప్పు
  • పచ్చిమిర్చి-4
  • తాళింపు గింజలు- టేబుల్​స్పూన్​

సేమియా ఉప్మా తయారీ విధానం :

  • మొదట స్టౌపై పాన్​ పెట్టుకుని సన్నని మంట మీద సేమియాని వేయించండి. సేమియా గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు రోస్ట్​ చేసుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల సేమియా ఉప్మా మెత్తగా కాకుండా పొడిపొడిగా వస్తుంది.
  • ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి తాళింపు గింజలను వేయండి. తర్వాత వేరుశనగలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి దోరగా వేయించండి. అలాగే అల్లం తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, క్యారెట్​, ముక్కలు, కొద్దిగా ఉప్పు వేయండి. తర్వాత బాగా కలిపి మూత పెట్టి వీటిని కొద్దిసేపు మగ్గించండి.
  • తర్వాత ఇందులో ఏ గ్లాసుతో అయితే, సేమియా తీసుకుంటామో.. ఆ గ్లాసుతో ఒకటింపావు కప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. సేమియా మెత్తగా ఉడకకుండా పొడిపొడిగా వస్తుంది.
  • తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పాన్​పై మూత పెట్టాలి. నీరు బాగా మరిగిన తర్వాత సేమియా వేసి కలిపి మూతపెట్టాలి
  • ఒక నిమిషం తర్వాత మరొసారి కలిపి, కొద్దిగా కొత్తిమీర చల్లాలి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకుని సర్వ్​ చేసుకుంటే.. వేడివేడి సేమియా ఉప్మా రెడీ.
  • ఇలా సేమియా ఉప్మా చేశారంటే.. మీ ఇంట్లో సేమియా ఉప్మా తినని వారు కూడా కచ్చితంగా ఈ రెసిపీకి ఫ్యాన్​ అయిపోతారు.
  • నచ్చితే మీరు కూడా ఈ సింపుల్​ సేమియా ఉప్మాని ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

ఉప్మా అనగానే పిల్లలు విసుక్కుంటున్నారా? - చేసే పద్ధతి మార్చండి - లొట్టలేసుకుంటూ తింటారు!

ఉప్మా రుచిగా రావాలంటే ఏం చేయాలంటే?

రోజుకో బ్రేక్​ఫాస్ట్​.. సింపుల్​గా చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.