How To Make Semiya Upma in Telugu : ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయడానికి ఇడ్లీ, దోశ పిండి లేకపోతే.. చాలా మంది ఉప్మా చేసేస్తారు. ఈ ఉప్మా రెసిపీల్లో రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా కంటే.. ఎక్కువ మంది సేమియా ఉప్మాని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, అందరికీ సేమియా ఉప్మా పర్ఫెక్ట్గా పొడిపొడిగా చేయడం రాదు. ఇంట్లో ఎప్పుడూ చేసినా నీళ్లు ఎక్కువైపోయి ముద్దగా మారిపోతుంటుంది. ఇలా కాకుండా సేమియా ఉప్మా పొడిపొడిగా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తూ చేయాలి. ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా సేమియా ఉప్మా చేస్తే పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. మరి, ఇంకెందుకు ఆలస్యం? నోరూరించే సూపర్ టేస్టీ సేమియా ఉప్మా తయారీ విధానంపై ఓ లుక్కేయండి..!
కావాల్సిన పదార్థాలు :
- సేమియా - గ్లాసు
- పచ్చిబఠానీలు- అరకప్పు
- ఉల్లిపాయ-1 (సన్నగా కట్‌చేసుకోవాలి)
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆవాలు- అర టీస్పూన్
- జీలకర్ర-అర టీస్పూన్
- కరివేపాకు-ఒకటి
- వేరుశనగలు- 3 టేబుల్‌స్పూన్లు
- నూనె-3 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి-4
- క్యాప్సికమ్ ముక్కలు-3 టేబుల్‌స్పూన్లు
- ఫ్రోజొన్ బఠానీ- 2 టేబుల్‌స్పూన్లు
- పసుపు-చిటికెడు
సేమియా ఉప్మా తయారీ విధానం :
- మొదట స్టౌపై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సేమియా వేసుకుని సన్నని మంటమీద కాస్త ఎర్ర రంగు వచ్చేవరకు వేయించండి.
- ఇలా సేమియాను ఫ్రై చేసేటప్పుడే మరోపక్కన రెండు గ్లాసుల వేడి నీళ్లను రెడీ చేసుకోండి. ఈ వేడి నీళ్లను సేమియాలో పోసి కొద్దిగా ఉడికించుకోండి.
- ఉడికిన సేమియాను స్ట్రెయినర్ సహాయంతో వడకట్టండి.
- ఇప్పుడు పాన్ స్టౌమీద పెట్టండి. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి వేరుశనగలను వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించండి.
- ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రోజొన్ బఠానీ, క్యాప్సికమ్, కరివేపాకు వేసి కలపండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించండి.
- బఠానీలు ఉడికిన తర్వాత అందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయండి.
- అలాగే ఉడికించుకున్న సేమియా, పల్లీలు వేసి బాగా కలపండి.
- తర్వాత స్టౌ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.
- ఎంతో రుచికరంగా ఉండే సేమియా ఉప్మా అద్భుతంగా పొడి పొడిగా రెడీ అవుతుంది.
- నచ్చితే మీరు కూడా ఈ స్టైల్లో సేమియా ఉప్మా ప్రిపేర్ చేయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు.
ఇవి కూడా చదవండి :
ఉప్మా అనగానే పిల్లలు విసుక్కుంటున్నారా? - చేసే పద్ధతి మార్చండి - లొట్టలేసుకుంటూ తింటారు!