ETV Bharat / offbeat

"బీరకాయ సూప్​"తో బరువు, షుగర్​ తగ్గుతాయట! - ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి! - HOW TO MAKE RIDGE GOURD RICE SOUP

- చాలా మందిని వేధిస్తోన్న అధిక బరువు సమస్య - ఈ సూప్​ను ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

How to Make Ridge Gourd Rice Soup
How to Make Ridge Gourd Rice Soup (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 11:45 AM IST

How to Make Ridge Gourd Rice Soup: నేటి రోజుల్లో చాలా మంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో డైటింగ్ ఒకటి. అయితే ఇలా డైటింగ్​ పేరు చెప్పి తినే తిండిని సగానికి తగ్గిస్తుంటారు. కానీ ఇలా నోరు కట్టేసుకోవడం వల్ల బరువు తగ్గడమేమో గానీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు. అందుకే డైటింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టమంటున్నారు. అందులో భాగంగానే క్యాలరీలు తక్కువగా, పోషకాలు అధికంగా ఉన్న "బీరకాయ రైస్‌ సూప్‌" తీసుకోమని సలహా ఇస్తున్నారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బీరకాయలు (మీడియం సైజు) - 2
  • బాస్మతీ బియ్యం - 2 కప్పులు
  • నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
  • పోపు దినుసులు - టీస్పూన్
  • ఎండుమిర్చి - 3
  • వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు
  • ఉల్లిపాయ - ఒకటి
  • బంగాళాదుంప - ఒకటి
  • ఎర్ర గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు
  • పసుపు - ముప్పావు టీస్పూన్
  • నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్‌
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు
  • నిమ్మకాయ - ఒకటి
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా బీరకాయ, బంగాళదుంపను పొటు తీసి చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.ఉల్లిపాయను కూడా సన్నగా తరగాలి. అలాగే బాస్మతీ బియ్యాన్ని కడిగి నానబెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. అది వేడెక్కాక పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఎండు మిర్చి వేసి మరికాసేపు వేయించాలి.
  • ఆ తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్​ చేసిన బంగాళాదుంప, గుమ్మడికాయ, బీరకాయ ముక్కలు, పసుపు, నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఇవి కాస్త మగ్గిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని కూడా వేసేయాలి. మరోసారి బాగా కలుపుకొని.. ఇందులో 2 లీటర్ల నీళ్లు పోసి కలపాలి. స్టౌ సిమ్‌లో పెట్టి బియ్యంతో పాటు కూరగాయలు బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
  • అన్నం, కూరగాయలు మెత్తగా ఉడికిన తర్వాత చివరన కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరోసారి కలిపి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీగా ఆరోగ్యాన్నిచ్చే బీరకాయ రైస్​ సూప్​ రెడీ!

ఆరోగ్య ప్రయోజనాలివే:

  • రుచికరమైన ఈ బీరకాయ రైస్‌ సూప్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గే వారికి ఇది మంచి ఆహారమంటున్నారు నిపుణులు.
  • బీరకాయల్లో ఉండే అధిక ఫైబర్‌ జీర్ణశక్తిని పెంచుతుందని.. పలు రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని అంటున్నారు.
  • బీరకాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్తపడవచ్చుంటున్నారు.
  • విటమిన్‌-సి, మెగ్నీషియం, ఐరన్‌, థయమిన్‌.. వంటి పోషకాలతో నిండి ఉండే బీరకాయలతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని.. వ్యాధులతో పోరాడేందుకు సహాయపడుతుందని అంటున్నారు.
  • రక్తహీనతతో బాధపడే మహిళలు బీరకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
  • బీరకాయ కేవలం ఆరోగ్యానికే కాదు.. అందానికీ మంచిదంటున్నారు. ఇందులో ఉండే విటమిన్‌ ‘సి’, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు చర్మానికి పోషణ అందించి మెరుపునిస్తాయని వివరిస్తున్నారు.

టేస్టీ అండ్​ హెల్దీ "బీట్​రూట్​ సూప్‌"- ఇలా చేస్తే నిమిషాల్లోనే కమ్మటి రుచి!

వింటర్ స్పెషల్ : రెస్టారెంట్ స్టైల్ "చికెన్ కార్న్ సూప్" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.