ETV Bharat / offbeat

ఉప్మా రవ్వతో నిమిషాల్లోనే వడలు! - టేస్ట్​ అద్దిరిపోతుంది - ప్రాసెస్ చాలా ఈజీ! - Rava Garelu Recipe

How to Make Rava Vadalu : చాలా మంది వడలు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. కానీ, వీటిని ఉప్మాలాగా క్షణాల్లో చేయలేం. ముందురోజు​ మినప్పప్పు నానబెట్టి, నైట్ గ్రైండ్‌ చేస్తేనే కానీ పిండి సిద్ధం కాదు. అందువల్ల.. సడన్​గా వడలు తినాలనిపించిన వాళ్లు కోరికను వాయిదా వేసుకోవడం తప్ప, ఏమీ చేయలేరు. అయితే.. ఇన్‌స్టంట్‌గా రవ్వతో సూపర్​ వడలు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

Rava Garelu
How to Make Rava Garelu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 4:44 PM IST

Rava Vadalu Recipe : చాలా మంది ఉదయాన్నే టిఫెన్​లో వడలు తినడాన్ని ఎంతో ఇష్టపడుతుంటారు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా ఉండే వడలు.. పల్లీ చట్నీ, సాంబార్​తో సూపర్​గా ఉంటాయి. అయితే.. వీటిని తయారు చేయాలంటే.. ముందురోజు​ మినప్పప్పు నానబెట్టి, నైట్ గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే.. పొద్దునకు పిండి సిద్ధమవుతుంది. కానీ.. సడన్​గా వడలు తినాలనిపిస్తే.. కోరికను వాయిదా వేసుకోవడం తప్ప, ఏమీ చేయలేరు.

అయితే.. ఈ పరిస్థితిని మార్చేసి వెంటనే వడలు చేసుకోవచ్చు. పిండి నానబెట్టడం వంటి ప్రాసెస్ లేకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వడలు ఎలా తయారు చేసుకోవచ్చు. అదెలా అంటే.. ఇందులో మినప పప్పు ఉండదు. ఉప్మా రవ్వతోనే వడలు తయారవుతాయి. పప్పు రుబ్బకుండా వడలు తయారు చేసుకోవడం మాత్రమే కాదు.. వీటిని చాలా సులభం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉదయం టిఫెన్​లోకి మాత్రమే కాకుండా.. సాయంత్రం స్నాక్​లాగా కూడా వీటిని ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం? రుచికరమైన రవ్వ గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానంపై ఓ లుక్కేయండి..!

రవ్వ గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

  • ఉప్మా రవ్వ - 2 కప్పులు
  • పెరుగు-కప్పు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • పుదీనా తరుగు - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నూనె- వేయించడానికి సరిపడా
  • వంట సోడా -చిటికెడు
  • పచ్చిమిర్చిలు-4
  • జీలకర్ర-టీస్పూన్​
  • అల్లం తరుగు-టీస్పూన్​
  • ఉల్లిపాయలు-1

రవ్వ గారెలు తయారు చేయు విధానం..

  • ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు రవ్వను ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో పెరుగు వేసుకుని మిక్స్​ చేయాలి.
  • ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అలాగే జీలకర్ర, అల్లం తురుము వేసుకుని మిక్స్​ చేయాలి.
  • పిండి మరీ జారుగా కాకుండా నీటిని కలుపుతూ గారెల పిండిలా మిక్స్​​ చేసుకోవాలి.
  • చివర్లో కొద్దిగా వంటసోడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి.. వడలు వేయించడానికి సరిపడా అయిల్​ వేయండి.
  • తర్వాత చేతిలోకి పిండి తీసుకుని.. వడల షేప్​లో తయారు చేసుకుని ఆయిల్​లో వేయండి.
  • రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దించేసుకోవాలి.
  • ఇంతే.. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఎంతో రుచిగా ఉండే గారెలు మీ ముందుంటాయి.
  • నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ గారెలను ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

గారెలు, వడలు నూనెపట్టి ఉంటున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే చుక్క ఆయిల్ కనిపించదు - ఇంకా ఫుల్ టేస్టీ!

ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.