ETV Bharat / offbeat

దసరా స్పెషల్​ - వెజ్​ లవర్స్​ కోసం అద్దిరిపోయే "పనీర్​ మొఘలాయ్​ దమ్​ బిర్యానీ" - ఇలా ట్రై చేయండి!

-రొటీన్​ పనీర్​ బిర్యానీని మించిన టేస్ట్ -ఈ టిప్స్​ పాటిస్తే చేయడం వెరీ ఈజీ

Paneer Mughlai Dum Biryani
Paneer Mughlai Dum Biryani (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2024, 9:40 AM IST

How to Make Paneer Mughlai Dum Biryani: దసరా పండగ అంటేనే ఘుమఘుమలాడే నాన్​వెజ్​ రెసిపీలు ఉండాలి. అయితే నాన్​వెజ్​ తినేవారికి ఇవి ఓకే. మరి తినని వారి కోసం కూడా స్పెషల్​ ఉండాలిగా! అందుకే దసరా పండగ నాడు వెజ్​ లవర్స్​ కోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. అదే "పనీర్​ మొఘలాయ్​ దమ్​ బిర్యానీ". ఈ పేరు విని ఎప్పుడూ తినే పనీర్​ బిర్యానీ అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే పేరు ఒకటే కావొచ్చు కానీ.. రుచి మాత్రం వేరే లెవల్​. ఎప్పుడూ ఈ రుచితో తిని ఉండరు కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం దసరా వేళ అద్దిరిపోయే రుచితో ఈ బిర్యానీ చేసుకోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

మసాలా పొడి కోసం:

  • యాలకులు - 2
  • లవంగాలు -2
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • షాజీరా - 1 టీ స్పూన్​
  • సోంపు - అర టేబుల్​ స్పూన్​
  • నల్ల యాలక - 1

పనీర్​ గ్రేవీ కోసం:

  • నెయ్యి - 4 టేబుల్​ స్పూన్లు
  • దాల్చిన చెక్క - అర అంగుళం
  • జాపత్రి -1
  • నల్ల యాలక - 1
  • యాలకులు - 2
  • బిర్యానీ ఆకు - 1
  • షాజీరా - 1 టీ స్పూన్​
  • ఉల్లిపాయలు - 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​ స్పూన్​
  • నీరు - సరిపడా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పెరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి పేస్ట్​ - తగినంత
  • పనీర్​ ముక్కలు - పావు కిలో

బిర్యానీ కోసం:

  • నీరు - 2 లీటర్లు
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • నల్ల యాలకులు - 2
  • షాజీరా - అర టేబుల్​ స్పూన్​
  • లవంగాలు - 5
  • యాలకులు - 4
  • బిర్యానీ ఆకు - 1
  • పచ్చిమిర్చి చీలికలు - 3
  • ఉప్పు - రెండున్నర టేబుల్​ స్పూన్లు
  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • బాస్మతీ బియ్యం - రెండు కప్పులు
  • నెయ్యి - 4 టేబుల్​ స్పూన్లు
  • పచ్చిపాలు - అర కప్పు

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్​ చేసుకోవాలి. 8 పచ్చిమిర్చి తీసుకుని మెత్తని పేస్ట్​లాగా గ్రైండ్​ చేసుకోవాలి. అలాగే బాస్మతీ బియ్యం కడిగి ఓ గంట సేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మంటను సిమ్​లో పెట్టి యాలకలు, లవంగాలు, దాల్చినచెక్క, షాజీరా, సోంపు, నల్ల యాలకులు వేసి దోరగా వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి. ఈ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్​లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి మందంగా ఉన్న బిర్యానీ గిన్నె పెట్టి నెయ్యి పోసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, జాపత్రి, నల్ల యాలక, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి వేసి పావు కప్పు నీరు పోసి మసాలాలు మాడకుండా నెయ్యి పైకి తేలేంతవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్​ వేసుకుని వేయించుకోవాలి.
  • అనంతరం పనీర్​ ముక్కలు వేసి బాగా కలిపి అరకప్పు నీళ్లు పోసి మంటను హై ఫ్లేమ్​ మీద పెట్టి ఓ 3 నిమిషాలు ఫ్లై చేసుకోవాలి.
  • ఆ తర్వాత మంటను సిమ్​లో పెట్టి పనీర్​ ముక్కల మధ్యలో ఓ చిన్న గిన్నె పెట్టి ఓ బాగా కాలిన బొగ్గు, రెండు యాలకులు, చెంచా నెయ్యి వేసి స్మోక్​ బయటికి పోకుండా మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఆ గిన్నెను పక్కన పెట్టి పనీర్​ గ్రేవీని కూడా దింపి పక్కకు పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టవ్​ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో దాల్చిన చెక్క, నల్ల యాలకులు, షాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు వేసి మరో 5 నిమిషాలు హై ఫ్లేమ్​ మీద మరిగించుకోవాలి.
  • అనంతరం ఉప్పు చూసి కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోవాలి. ఓ 5 నిమిషాల తర్వాత నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి హై ఫ్లేమ్​ మీద 80 శాతం ఉడికించుకోవాలి.
  • బాస్మతీ రైస్​ అనుకున్న మేర ఉడికిన తర్వాత జల్లెడ సాయంతో నీరు లేకుండా కొద్దికొద్దిగా తీసుకుంటూ ముందే ప్రిపేర్​ చేసుకున్న పనీర్​ గ్రేవీ మిశ్రమంపై లేయర్​లా పల్చగా చల్లుకోవాలి. అలా బియ్యం మొత్తాన్ని లేయర్​లా వేసుకోవాలి.
  • అలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత నెయ్యి పోసుకోవాలి. ఆ తర్వాత పచ్చి పాలను అన్నం మొత్తం కవర్​ అయ్యేలా పోసుకోవాలి.
  • ఇప్పుడు ధమ్​ బయటికి పోకుండా మూత పెట్టి ఆ బిర్యానీ గిన్నెను స్టవ్​ మీద పెట్టి మంటను హై ఫ్లేమ్​ మీద ఉంచి 5 నిమిషాలు, లో ఫ్లేమ్​ మీద ఉంచి మరో 8 నిమిషాలు కుక్​ చేసుకోవాలి.
  • లో ఫ్లేమ్​లో ఉడికించిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ 30 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత సర్వ్​ చేసుకుని తింటే సూపర్​ అనాల్సిందే. దీన్ని విడిగా తిన్నా.. రైతాతో కలిపి తిన్నా సూపర్​ టేస్ట్​ గ్యారెంటీ!

మటర్ పనీర్ గ్రేవీని సింపుల్​గా చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!

ఎప్పుడూ రొటీన్ బిర్యానీయేనా? - ఈసారి అద్దిరిపోయే మొఘలాయ్ స్టైల్​లో చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.