ETV Bharat / offbeat

ఉల్లిపాయతో అద్దిరిపోయే పరోటా గురూ! - ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్​ లిస్టులో చేరిపోద్ది! - ONION PARATHA RECIPE IN TELUGU

- కేవలం 10 నిమిషాల్లోనే నోరూరించే పరోటా సిద్ధం

Onion Paratha Recipe in Telugu
Onion Paratha Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 18, 2024, 5:24 PM IST

Onion Paratha Recipe in Telugu: వంటకు ఎక్కువ సమయం లేనప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా పరోటాలను చేసుకుంటుంటారు కొందరు. అయితే, పరోటా అనగానే చాలా మందికి ఆలు పరోటానే గుర్తుకు వస్తోంది. కానీ, ఉల్లిపాయ స్టఫింగ్​తో చేసే ఈ పరోటా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని బ్రేక్​ఫాస్ట్​, లంచ్ బాక్స్ ఇలా దేంట్లోకైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం నోరూరించే ఉల్లి పరోటా ఎలా చేసుకోవాలి? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • ఒకటిన్నర కప్పుల గోధుమ పిండి
  • 2 టీ స్పూన్ల నెయ్యి/ నూనె
  • రుచికి సరిపడా ఉప్పు
  • రెండు ఉల్లిపాయలు
  • 2 పచ్చి మిరపకాయలు
  • ఒక ఇంచు అల్లం ముక్క
  • అర టీ స్పూన్ వాము
  • అర టీ స్పూన్ కారం
  • 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
  • అర టీ స్పూన్ ధనియాల పొడి
  • అర టీ స్పూన్ గరం మసాలా
  • 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు
  • నూనె

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలిపి కొద్దిగా నూనె అప్లై చేసి సుమారు 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు చిన్న రోటీలో పచ్చి మిరపకాయలు, అల్లం ముక్కను తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  • మరోవైపు మిక్సీ జార్​లో పుట్నాల పప్పు వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. (ఇది లేకపోతే శనగపిండిని కాస్త వేయించుకుని వేసుకోవచ్చు)
  • ఆ తర్వాత ఓ గిన్నెలో దుంచుకున్న పచ్చి మిర్చి-అల్లం మిశ్రమం, ఉల్లిపాయను ముక్కలు, వాము, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, గరం మసాలా, పుట్నాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి బాగా కలిపి చిన్న ముద్దను తీసుకుని పొడి పిండిలో ముంచి తీసుకోవాలి.
  • ఆ పిండి ముద్దను చిన్న పూరీలా రోల్ చేసుకుని అందులో రెడీ చేసి పెట్టుకున్న 3 టీ స్పూన్ల పరోటా స్టఫ్​ను పెట్టి బయటకు రాకుండా అంచులు మూసివేయాలి.
  • ఆ తర్వాత ఇంకొంచెం పొడి పిండిని వేసి రెండు వైపులా తిప్పుకుంటూ పరోటాలా రోల్ చేసుకోవాలి.
  • మరోవైపు స్టౌ ఆన్ చేసుకుని పెనం పెట్టి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత పెనంపై పరోటాను వేసి మీడియం ఫ్లేమ్​లో రెండు వైపులా దోరగా కాల్చాలి.
  • ఇప్పుడు నెయ్యి లేదా నూనె పోసి రెండు వైపులా బాగా కాలిస్తే వేడి వేడి ఉల్లిపాయ పరోటా రెడీ!

ఎండు మిర్చితో కారం పొడి రొటీన్ - పచ్చి మిర్చితో ప్రిపేర్ చేసి చూడండి! - అద్దిరిపోయే రుచి మీ సొంతం

చేసిన కాసేపటికే చపాతీలు గట్టిపడుతున్నాయా? - ఇలా చేశారంటే ఎన్ని గంటలైనా సూపర్ సాఫ్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.