ETV Bharat / offbeat

ఇరానీ చాయ్​తో పోటీపడే కమ్మటి "స్పెషల్​ మసాలా టీ" - సింపుల్​గా ఇంట్లోనే చేసుకోండిలా! - HOW TO MAKE MASALA CHAI

దాదాపు ఇంట్లో అందరూ టీ పెడతారు. కానీ, హోటల్​ స్టైల్లో.. కమ్మగా, చిక్కగా చాయ్​ పెట్టడం మాత్రం మెజార్టీ జనాలకు రాదు. అయితే, సూపర్​ టేస్టీగా చాయ్​ ఎలా ప్రిపేర్​ చేయాలో ఇప్పుడు చూద్దాం.

Tasty Tea
How to Make Tasty Tea (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 8, 2024, 3:00 PM IST

How to Make Masala Chai : 'పదా టీ తాగుదాం..' అంటే చాలు మనలో చాలా మందికి ప్రాణం లేచి వస్తుంది. ఎన్ని పనులున్నా సరే వాటిని ఆపేసి టీ తాగడానికి వెళ్తుంటాం. కమ్మటి చిక్కటి చాయ్ గ్లాసులోంచి.. ఒక్క గుటక గొంతులోకి పడితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇక ఉదయాన్నే కొందరికి కప్పు టీ తాగకపోతే ఆ రోజే ప్రారంభం కాదు. నలుగురు ఫ్రెండ్స్​ కలిసినా, ఇంట్లోకి బంధువులు వచ్చినా తప్పక కమ్మటి "టీ" ఉండాల్సిందే. అంతలా టీ మన జీవితంలో ఒక భాగమైపోయింది.

అయితే, చాయ్​ను చిక్కగా, కమ్మగా పెట్టడం అందరికీ రాదు. పాలలో చక్కెర, పంచదార వేసి మరిగించి.. టీ గ్లాసులో పోసేస్తుంటారు. ఇలా పెడితే టీ స్ట్రాంగ్​గా, టేస్టీగా ఉండదు. ఇలా కాకుండా.. అచ్చం టీ షాపుల్లోలాగా కమ్మగా, చిక్కగా, ఎంతో రుచిగా పెట్టే చాయ్​ను ఇంట్లోనే ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం. మరి ఇక లేట్​ చేయకుండా స్టోరీ మొత్తం చదివి మీరు కూడా ఇంట్లో ఈ చాయ్ ట్రై​ చేయండి.

కావాల్సిన పదార్థాలు

  • పాలు- పావు లీటర్​
  • అల్లం తురుము- 2 టేబుల్ ​స్పూన్లు
  • టీ పొడి- 3 టేబుల్​ స్పూన్లు
  • లవంగాలు- 4
  • యాలకులు- 5
  • గులాబీ రేకులు- 2 టేబుల్​ స్పూన్లు
  • దాల్చిన చెక్క- చిన్నముక్క
  • చక్కెర- సరిపడా

తయారీ విధానం

  • ముందుగా స్టౌపై టీ కాచే గిన్నె​ పెట్టి పాలను ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత పాలను పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే గిన్నెలో గ్లాసు నీళ్లను పోసి మూత పెట్టి బాగా మరిగించుకోండి.
  • తర్వాత ఇందులోనే అల్లం తురుము, కచ్చాపచ్చాగా చేసిన యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాసేపు మరిగించుకోవాలి.
  • మీకు టీ మసాలా రుచిలో ఉండడం​ నచ్చకపోతే.. లవంగాలు, దాల్చిన చెక్కను వేసుకోకుండా చేసుకోవచ్చు.
  • తర్వాత డికాషన్​లో టీ పొడి, రుచికి సరిపడా షుగర్ వేసుకుని రెండు నిమిషాలు మరిగించుకోవాలి.
  • డికాషన్ బాగా మరిగిన తర్వాత ఇందులో పక్కకు పెట్టుకున్న గోరువెచ్చని పాలను పోసుకోండి.
  • అలాగే గులాబీ రేకులు కూడా వేసుకోవాలి. (టీ లోకి గులాబీ రేకులు వేసుకోవడం వల్ల చాయ్​ ఎంతో రుచిగా ఉంటుంది. బయట కొందరు టీ షాపుల వాళ్లు చాయ్​లో గులాబీ రేకులు తప్పకుండా వేస్తారు. అందుకే ఆ టీకి అంత రుచి!)
  • ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి, టీని గరిటెతో కలుపుతూ 5 నిమిషాలు మరిగించుకోండి.
  • తర్వాత వేడివేడి టీని వడబోసి.. గ్లాసుల్లో సర్వ్ చేసుకోండి. అంతే ఇలా రెడీ చేసుకుంటే ఎంతో కమ్మటి, చిక్కటి చాయ్​ రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి చాయ్​ ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎప్పుడూ ఇలానే టీ పెట్టమని తప్పకుండా అడుగుతారు.

ఇవి కూడా చదవండి :

స్టౌ మీద చాయ్ పొంగడం చిరాగ్గా ఉంటోందా? - ఈ "Tea ఫౌంటెయిన్" ఉంటే ఆ సమస్యే రాదు!

బీపీతో ఇబ్బంది పడుతున్నవారు - ఈ హెర్బల్​ టీ తాగితే మంచిదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.