How To Make Lahori Green Chicken : నాన్‌వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ కర్రీ, బిర్యానీ వంటివి ట్రై చేస్తుంటారు. అలాగే సండే వచ్చిందా.. చాలా మంది ఇంట్లో నుంచి చికెన్ ఘుమఘుమలు వస్తుంటాయి. అయితే, రెగ్యూలర్‌గా చికెన్ కర్రీ వండుకుంటే చాలా బోర్ అనిపిస్తుంది. ఎప్పుడూ ఇదే తినాలా అని నిరాశ చెందుతారు. అయితే ఇకపై అలాంటి ఫీలింగ్ అక్కర్లేదు. ఎందుకంటే మీ కోసం ఒక వెరైటీ చికెన్ రెసిపీని తీసుకొచ్చాం. అదే "లాహోరి గ్రీన్ చికెన్" కర్రీ. పేరు వినగానే చాలా పదార్థాలు కావాలని టెన్షన్ వద్దు. ఎందుకంటే ఈ కర్రీకి ఇంట్లో లభించే పదార్థాలు చాలు. ఇక ఈ కర్రీని వేడివేడి రైస్, చపాతీలు, పుల్కాల్లోకి తింటుంటే మజా వస్తుంది! మరి ఇంకెందుకు ఆలస్యం.. లాహోరి గ్రీన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేయండి!
లాహోరి గ్రీన్ చికెన్ కర్రీ రెడీ చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - అరకిలో
- నెయ్యి- 2 టేబుల్‌స్పూన్లు
- నూనె- 3 టేబుల్‌స్పూన్లు
- పెరుగు -పావు కప్పు
- పసుపు -టీస్పూన్
- అల్లం వెల్లులి పేస్ట్- 2 టేబుల్‌స్పూన్
- ధనియాలపొడి - టీస్పూన్
- జీలకర్ర పొడి- టీస్పూన్
- గరంమసాలా-టీస్పూన్
- కారం - 1 టీ స్పూన్
- కొత్తిమీర- కప్పు
- పుదీనా- కప్పు
- పచ్చిమిర్చిలు- 10
- ఫ్రెష్ క్రీమ్- అర కప్పు
- ఉప్పు-రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిర్చిలు వేసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నూనె, నెయ్యి పోసుకోవాలి. ఈ క్రరీలోకి ఆయిల్‌తో పాటు, నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది.
- తర్వాత పచ్చిమిర్చిలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలని వేసి బాగా కలపాలి.
- ఒక రెండు నిమిషాల తర్వాత రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
- అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు వేసుకుని మిక్స్ చేయాలి. స్టౌ మంట చిన్నగా పెట్టి చికెన్‌ని ఉడికించుకోవాలి.
- చికెన్ బాగా ఉడికిన తర్వాత పెరుగు, ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఒక రెండు నిమిషాలు అలా చికెన్‌ని వదిలేసిన తర్వాత.. సర్వ్ చేసుకుంటే ఘుమఘుమలాడే లాహోరి గ్రీన్ చికెన్ కర్రీ మీ ముందుంటుంది.
- నచ్చితే మీరు కూడా రెగ్యూలర్‌గా కాకుండా.. కాస్త కొత్తగా ఈ చికెన్ రెసిపీని ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
"అమృత్ సరి" చికెన్ రెసిపీ - ఈ పంజాబీ స్టైల్ కర్రీ తిన్నారంటే "భల్లే భల్లే" అనాల్సిందే!
సండే స్పెషల్ : జింజర్ పెప్పర్ చికెన్ రెసిపీ - ఆహా ఏమి రుచి అంటారంతే!