ETV Bharat / offbeat

దసరా స్పెషల్​ "కజ్జికాయలు" - కొందరు చేసినవే ఎందుకు సూపర్ టేస్టీగా ఉంటాయో తెలుసా? - ఈ టిప్స్ ఫాలో అవుతారు! - How to Make Kajjikayalu at Home

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 10:27 AM IST

Kajjikayalu: పండగలకు పిండి వంటలు చేసుకోవడం కామన్​. అందులోనూ స్వీటు, హాటు అంటూ రకరకాలుగా చేసుకుంటాం. ఆ స్వీట్లలో కజ్జికాయలు తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే.. కజ్జికాయలు అందరూ చేస్తారు. కానీ రుచికరంగా మాత్రం కొంతమందే చేస్తారు. మరి, వాళ్లు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతారో ఇప్పుడు చూద్దాం.

How to Make Kajjikayalu at Home
How to Make Kajjikayalu at Home (ETV Bharat)

How to Make Kajjikayalu at Home: మరికొన్ని రోజుల్లో దసరా పండగ రాబోతోంది. ఆ తర్వాత దీపావళి. పెద్ద పండగలు వస్తున్నాయంటే కచ్చితంగా ప్రతి ఇంటా పిండి వంటలు చేస్తుంటారు. అందులో.. స్వీటు, హాటు అంటూ రకరకాలుగా తయారు చేస్తుంటారు. ఇక స్వీట్స్​ విషయానికి వస్తే కజ్జికాయలు చేస్తుంటారు. కజ్జికాయ‌లు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే కజ్జికాయలు అందరూ చేస్తారు కానీ.. రుచికరంగా మాత్రం కొంతమందే చేస్తారు. మరి, ఆ రుచికరమైన కజ్జికాయలు ఎలా చేయాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు:

  • మైదా పిండి - పావు కిలో
  • కరిగించిన నెయ్యి - 3 టేబుల్​ స్పూన్లు
  • పల్లీలు - 1 కప్పు
  • నువ్వులు - అర కప్పు
  • ఎండు కొబ్బరి పొడి - అర కప్పు
  • పుట్నాల పప్పు - 1 కప్పు
  • బెల్లం - 300 గ్రాములు
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా

బయటి జిలేబీ అన్​ హెల్దీ కావొచ్చు! - ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి - రుచి అమృతమే!

తయారీ విధానం:

  • ముందుగా ఓ బౌల్​ తీసుకుని అందులో మైదా పిండి, నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దలా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పల్లీలు వేసి దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టాలి.
  • అదే పాన్​లో నువ్వులు వేసి కాసిన్ని నీళ్లు చిలకరించి వేయించి పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి సెపరేట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, పుట్నాల పప్పు, బెల్లం తురుము వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఆ తర్వాత యాలకుల పొడి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ముందే కలుపుకున్న మైదా పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా చపాతీగా చేసుకోవాలి.
  • ఇప్పుడు కజ్జికాయలు చేసే మౌల్డ్​ తీసుకుని అందులో కొద్దిగా పొడి పిండి చల్లి.. ప్రిపేర్​ చేసుకున్న చపాతీ పెట్టి.. అందులో రెండు టీ స్పూన్ల పల్లీల మిశ్రమాన్ని వేసి మౌల్డ్​ అంచులకు లైట్​గా తడి అంటించి క్లోజ్​ చేసి గట్టిగా ప్రెస్​ చేయాలి. ఆ తర్వాత మిగిలిన పిండి తీసేసి మౌల్డ్​ ఓపెన్​ చేసి కజ్జికాయలను ప్లేట్​లో పెట్టుకోవాలి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా అలానే చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కజ్జికాయలను నెమ్మదిగా నూనెలో వేసి మంటను మీడియంలో పెట్టి లైట్​ గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంతవరకు వేయించుకోవాలి. లైట్​ బ్రౌన్​ కలర్​ వస్తే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గోల్డెన్​ బ్రౌన్​ కలర్​లోకి మారిపోతాయి. మంటను హై ఫ్లేమ్​లో పెట్టి చేస్తే అవి తొందరగా రంగు మారి చల్లారిన తర్వాత టేస్ట్​ మారిపోతాయి..

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి

పిండి, నెయ్యి అక్కర్లేదు - కేవలం పాలు, చక్కెరతో బ్రహ్మాండమైన "మిల్క్ గులాబ్ జామూన్" రెడీ!

శ్రావణమాసం స్పెషల్ : పక్కా కొలతలతో గుడిలో పెట్టే "పరమాన్నం" - నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.