ETV Bharat / offbeat

నోరూరించే "గుమ్మడికాయ పప్పు చారు"- ఇలా చేస్తే రుచి ఎప్పటికీ మర్చిపోలేరు! - GUMMADIKAYA PAPPU CHARU

-ఆరోగ్యానికి మేలు చేసే గుమ్మడితో పప్పు చారు -ఈజీగా చేసేయండిలా

Gummadikaya Pappu Charu Recipe
Gummadikaya Pappu Charu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Gummadikaya Pappu Charu Recipe : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడికాయతో ఏ రెసిపీ చేసినా టేస్ట్​ అద్దిరిపోతుంది. చాలా మంది గుమ్మడికాయతో హల్వా, కూర వంటి రకరకాల వంటలను ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే, ఈ సారి గుమ్మడికాయతో ఎంతో కమ్మగా పప్పు చారు చేసుకోండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా పప్పు చారు చేస్తే అన్నం రెండు ముద్దలు ఎక్కువే తింటారు. పైగా ఈ పప్పు చారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా గుమ్మడికాయ పప్పు చారు ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • కందిపప్పు- కప్పు
  • నీళ్లు - సరిపడా
  • గుమ్మడికాయ ముక్కలు- 2 కప్పులు
  • ఉల్లిపాయలు- 2
  • కారం- 2 టీస్పూన్లు
  • ధనియాల పొడి-టీస్పూన్
  • క్యారెట్-1
  • టమాటా-2
  • పసుపు- అరటీస్పూను
  • జీలకర్ర-టీస్పూను
  • కొత్తిమీర తరుగు
  • చింతపండు రసం - కప్పు
  • బెల్లంతురుము- 2 టేబుల్‌స్పూన్లు
  • పచ్చి కొబ్బరి తురుము- 2 టేబుల్‌స్పూన్లు

తాలింపు కోసం..

  • ఆవాలు- టీస్పూను
  • జీలకర్ర-టీస్పూను
  • కరివేపాకు- 2 రెబ్బలు
  • వెల్లుల్లి రెబ్బలు-4
  • ఎండుమిర్చి- 2
  • నూనె- 2 టేబుల్‌స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి ప్రెషర్​ కుక్కర్లోకి​ తీసుకోవాలి. అందులోకి రెండున్నర కప్పుల నీళ్లు, కొద్దిగా పసుపు యాడ్‌, జీలకర్ర వేసి సన్నని మంట మీద 3 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • తర్వాత ఉడికించుకున్న పప్పుని గరిటెతో మెదుపుకోవాలి.
  • అలాగే గుమ్మడికాయ చెక్కు తీసుకుని ముక్కలుగా కట్​ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్​ ముక్కలుగా కట్ చేయండి.
  • ఇప్పుడు స్టౌపై పప్పు చారు చేయడం కోసం గిన్నె పెట్టండి. ఇందులో నూనె వేసి వేడి చేయండి.
  • ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత గుమ్మడికాయ, క్యారెట్ ముక్కలు వేసి మగ్గించండి.
  • తర్వాత టమాటా ముక్కలు వేసి వేపండి.
  • టమాటాలు మెత్తబడిన తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు బెల్లం తరుగు వేసి కలపండి.
  • అనంతరం చింతపండు రసం పోసి మిక్స్ చేయండి. ఒక రెండు నిమిషాల తర్వాత ఉడికించుకున్న పప్పు వేసుకోండి.
  • అలాగే సరిపడా వాటర్​ పోసుకుని.. పప్పుని స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి 10-15 నిమిషాలు మరిగించుకోండి.
  • ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి కలపండి.
  • ఆపై తాలింపు కోసం మరో స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేపండి. ఇప్పుడు ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. తాలింపు దోరగా వేగిన తర్వాత మరుగుతున్న పప్పు చారులో వేసి కలపండి.
  • అలాగే కాస్త కొత్తిమీర తరుగు చల్లండి. ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది.
  • ఇలా చేస్తే ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే గుమ్మడికాయ పప్పు చారు మీ ముందుంటుంది.
  • ఈ పప్పు చారు వేడివేడి అన్నంలోకి టేస్ట్​ సూపర్​గా ఉంటుంది.
  • ఈ పప్పు చారు నచ్చితే మీరు ఓ సారి ట్రై చేయండి.

బరువు తగ్గించే "జొన్న గుమ్మడికాయ సూప్" - ప్రిపరేషన్ చాలా ఈజీ! - బీపీ, షుగర్​కూ చక్కటి మెడిసిన్!

క్రిస్పీ అండ్ టేస్టీ "గుమ్మడికాయ ఫ్రైస్" - సింపుల్​గా చేసుకోండిలా! - ఫ్రెంచ్ ఫ్రైస్​ కంటే ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.