ETV Bharat / offbeat

చిక్కుడు కాయ ఫ్రై - ఇలా చేస్తే ఓ పట్టు పట్టేస్తారు!

- అందరూ ఇష్టంగా తినే చిక్కుడుకాయ వేపుడు - అన్నం, చపాతీల్లోకి సూపర్​ కాంబినేషన్

How to Make Chikkudukaya Fry
How to Make Chikkudukaya Fry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How to Make Chikkudukaya Fry : చాలా మందికి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. కర్రీ ఎంత బాగున్నా కూడా ఒక్క గరిటె కూడా ప్లేట్లో వేసుకుని టేస్ట్​ చేయరు. మరికొంతమంది చపాతీల్లో మాత్రమే తింటుంటారు. అయితే.. చిక్కుడుకాయ కర్రీ మీ ఇంట్లో వాళ్లందరి ఫేవరెట్​ రెసిపీల్లో చేరిపోవాలంటే ఈ స్టోరీలో చెప్పిన విధంగా 'చిక్కుడుకాయ వేపుడు' ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఇక ఆలస్యం చేయకుండా చిక్కుడుకాయ ఫ్రై కమ్మగా ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం.

చిక్కుడు కాయ వేపుడుకు కావాల్సిన పదార్థాలు..

  • చిక్కుడుకాయ -పావు కేజీ
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • కరివేపాకు-2 రెమ్మలు
  • పచ్చిమిర్చి-2
  • ఉల్లిపాయ-1
  • ఎండుమిర్చి-8
  • పచ్చి కొబ్బరి ముక్కలు-పావుకప్పు
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • జీలకర్ర-టీస్పూన్
  • ఆవాలు-అరటీస్పూన్​
  • శనగపప్పు-టీస్పూన్​
  • మినప్పప్పు-టీస్పూన్​
  • కరివేపాకు-2
  • కొత్తిమీర తరుగు-కొద్దిగా
  • పసుపు -పావు టీస్పూన్

తయారీ విధానం :

  • ముందుగా చిక్కుడుకాయల్ని బాగా కడిగి, కట్​ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి అరకప్పు నీళ్లు పోయండి.
  • ఇందులో కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపండి.
  • తర్వాత మూత పెట్టి చిక్కుడుకాయ ముక్కల్ని నీరు ఇగిరి పోయేంత వరకు ఉడికించుకుని స్టౌ ఆఫ్​ చేసుకోండి.
  • అనంతరం ఒక మిక్సీ గిన్నెలో.. అరటీస్పూన్​ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో నూనె పోసి వేడి చేయండి. ఆపై ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేయండి.
  • తాలింపు దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేపండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేయండి.
  • ఆపై పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసి మిక్స్​ చేయండి.
  • గిన్నెపై మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోండి.
  • అనంతరం గ్రైండ్​ చేసుకున్న ఎండు మిర్చి పొడి వేసి కలపండి. ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది.
  • ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ వేపుడు మీ ముందుంటుంది.
  • ఈ రెసిపీ నచ్చితే ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి:

టేస్టీ "కొత్తిమీర పులావ్​" - ఇలా చేసి పెడితే పిల్లల లంచ్​బాక్స్​లు ఇట్టే ఖాళీ అయిపోతాయ్​!

ఇంట్లోనే రెస్టారెంట్​ స్టైల్​ "పనీర్​ 65" - ఈవెనింగ్​ టైమ్​కి బెస్ట్​ స్నాక్​ - టేస్ట్​ అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.