IMDB 2024 Most Popular Indian Movies : 2024లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చి ఘన విజయాన్ని దక్కించుకున్నాయి. అందులో కొన్ని చిత్రాలు అయితే ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీగా వసూళ్లను కూడా అందుకున్నాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగియనుండటం వల్ల ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య రిలీజైన సినిమాల్లో ఐఎండీబీ రేటింగ్ ఆధారంగా ఈ జాబితాను విడుదల చేసింది. వరల్డ్ వైడ్‌గా ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణలను ఆధారంగా ఈ లిస్ట్‌ను రెడీ చేసినట్లు సదరు సంస్థ తెలిపింది.
ఈ జాబితాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ' (Prabhas Kalki 2898 AD) అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. అయితే ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రభాస్ కల్కి 2898 ఏడీ
2. శ్రద్ధా కపూర్ స్త్రీ 2
3. విజయ్ సేతుపతి మహరాజ్
4. అజయ్ దేవగణ్ షైతాన్
5. హృతిక్ రోషన్ ఫైటర్
6. మలయాళ చిత్రం మంజుమ్మల్ బాయ్స్
7. కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్య 3
8. కిల్
9. అజయ్ దేవగణ్ సింగమ్ అగైన్
10. లాపతా లేడీస్
Presenting the Most Popular Indian Movies of 2024 that captured your hearts and kept you coming back for more! 💛
— IMDb India (@IMDb_in) December 11, 2024
📍Of all the movies released in India between January 1 and November 25, 2024, that have an average IMDb user rating of 5 or higher, these 10 titles were… pic.twitter.com/aP8nYcQuvO
గూగుల్ సెర్చ్‌లోనూ ప్రభాస్ సినిమాల జోరు (2024 Google Search Trends Movies)
2024లో గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో ఎక్కువగా వెతికిన సినిమాల జాబితాను సదరు సంస్థ తాజాగా రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కువమంది వెతికిన సినిమాల జాబితాలో ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడీ, సలార్ రెండు చిత్రాల కోసం ప్రేక్షకులు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ వెల్లడించింది. కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ది రాజాసాబ్', 'ఫౌజీ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
'జాతి రత్నాలు' డైరెక్టర్‌తో విశ్వక్ మూవీ - 'ఫంకీ'గా టైటిల్ అప్డేట్!
రూ. 10 కోట్ల బడ్జెట్, 6 రోజుల షూట్!: 'గేమ్ ఛేంజర్' నానా హైరానా సాంగ్ విశేషాలివే