ETV Bharat / offbeat

టేస్టీ అండ్​ హెల్దీ "అరటికాయ పొరటు" - ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ!

- కొత్త రెసిపీలు చేసేవారికి బెస్ట్​ ఆప్షన్​

Arati Poratu Recipe
Arati Poratu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Arati Poratu Recipe : ఏడాది పొడవునా లభ్యమవుతూ, అందరికీ అందుబాటులో ఉండే వాటిలో అరటికాయ కూడా ఒకటి. సాధారణంగా మనలో చాలా మంది అరటికాయతో పులుసు, వేపుడు, కర్రీ వంటి రెసిపీలను ట్రై చేస్తుంటాం. అలాగే చిప్స్​, అరటికాయ బజ్జీ స్నాక్స్ చేసుకుని ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంటాం. అయితే, అరటికాయలతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి కాస్త కొత్తగా అరటి పొరటు ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి ఈ రెసిపీ టేస్ట్​ అద్దిరిపోతుంది. అరటి పొరటు చేయడానికి ఎక్కువ టైమ్​ పట్టదు. ఇలా చేస్తే నిమిషాల్లోనే తయారైపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా.. కమ్మటి అరటిపొరటు ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • కూర అరటికాయలు-2
  • పచ్చికొబ్బరి తురుము- అర కప్పు
  • నూనె-సరిపడా
  • ఆవాలు- అర టీస్పూన్‌
  • ఇంగువ- చిటికెడు
  • మినప్పప్పు-ఒక టీస్పూన్‌
  • శనగపప్పు- ఒక టీస్పూన్‌
  • పసుపు- పావు టీస్పూన్‌
  • ఎండుమిర్చి- 2
  • పచ్చిమిర్చి-1
  • అల్లం-చిన్న ముక్క (తురుముకోవాలి)
  • ఉల్లిపాయ- 1
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం- టీస్పూన్‌
  • కొత్తిమీర తరుగు- కొద్దిగా
  • నిమ్మరసం- రెండు టీస్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకుని కుక్కర్‌లో ఒక కూత వచ్చేవరకు ఉడకబెట్టాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి.. కుక్కర్లో ఉన్న ప్రెషర్​ మొత్తం పోయిన తర్వాత బయటకు తీసి చల్లార్చాలి. ఆపై తొక్క తీసేసి సన్నగా తురుముకోవాలి.
  • అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్​ చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి.
  • ఆ తర్వాత ఎండుమిర్చి, అల్లం తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి.
  • ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత అరటి కాయ తురుము వేసి మిక్స్​ చేయాలి. ఆపై కారం, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపండి.
  • మసాలా మిశ్రమం కర్రీకి బాగా పట్టేలా కలపండి. అవసరమైతే కొన్ని నీళ్లను చల్లుకోండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసుకుని 5 నిమిషాలు మగ్గించుకోండి.
  • ఆ తర్వాత కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర తరుగు చల్లి కలిపి.. స్టౌ ఆఫ్ చేయండి.
  • ఇంతే.. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పొరటు మీ ముందుంటుంది.
  • ఈ రెసిపీనీ చాలా సింపుల్​గా ప్రిపేర్ చేయడంతోపాటు.. అద్దిరిపోయే టేస్ట్​ ను ఆస్వాదించొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా లాగిస్తారు.
  • మీకు నచ్చితే.. ఓసారి తప్పకుండా ఈ అరటికాయ పొరటు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

డయాబెటిస్ ఉన్నవాళ్లు అరటికాయ తినొచ్చా? నిపుణుల మాటేంటి?

'అరటికాయ క్యారెట్‌ గారెలు' సింపుల్​ రెసిపీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.