Best Tips to Prevent Ants from Kitchen : వానాకాలంలో ఇంట్లో కీటకాలతోపాటు, చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ పదార్థాన్ని పెట్టినా నిమిషాల్లో అక్కడికి క్యూ కట్టేస్తుంటాయి. దీంతో చాలా మంది ఈ సమస్యను తగ్గించుకునేందుకు రకరకాల స్ప్రేలు యూజ్ చేస్తుంటారు. కానీ.. ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే.. ఈ నేచురల్ టిప్స్‌తో ఈజీగా చీమల(Ants) సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైట్ వెనిగర్ : ఒక స్ప్రే బాటిల్లో సమాన పరిమాణంలో వైట్ వెనిగర్, వాటర్ తీసుకోవాలి. ఆపై చీమల సమస్య ఉన్న చోట కొద్దిగా ఆ ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాలి. అంతే.. వైట్ వెనిగర్ వాసనకు చీమలు అక్కడ నుంచి పరార్ అవుతాయంటున్నారు.
దాల్చిన చెక్క లేదా లవంగాలు : ఇవీ చీమల సమస్యను నివారించడంలో చాలా చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. చీమల సమస్య ఉన్న చోట కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా లవంగాలు(Cloves) ఉంచండి. లేదంటే.. దాల్చిన చెక్క నూనెలో కాటన్ బాల్‌ను నానబెట్టి చీమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉంచండి. ఫలితంగా మంచి సువాసన వెదజల్లడమే కాకుండా చీమల సమస్య ఇట్టే తగ్గిపోతుందంటున్నారు. 2019లో 'journal of Emerging investigators'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. దాల్చిన చెక్క నూనె చీమలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని కనుగొన్నారు. అమెరికాలోని వర్జీనియాలో హెన్లీ మిడిల్ స్కూల్‌కు చెందిన 'డాక్టర్ జోసెఫ్ టి' ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.
నిమ్మరసం : ఇది మంచి నేచురల్ చీమల నిరోధకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే చీమలు నిమ్మరసం ఘాటు వాసన, అది సృష్టించే ఆమ్ల వాతావరణాన్ని ఇష్టపడవు. అంతేకాదు.. చీమలు అనుసరించే ఆహార మార్గాల సామర్థ్యాన్ని నిమ్మలోని గుణాలు దెబ్బతీస్తాయి. ఇందుకోసం.. మీరు ఒక చిన్నగిన్నెలో సమపాళ్లలో తాజా నిమ్మరసం, వాటర్ తీసుకొని చీమల సమస్య ఉన్న చోట చిన్న క్లాత్‌తో తుడవండి. లేదంటే.. ఆయా ప్రాంతాలలో నిమ్మ తొక్కలను ఉంచినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఉప్పు లేదా మిరియాల పొడి : మీ వంటింట్లో ఉండే ఉప్పు లేదా మిరియాల పొడి చీమల సమస్యను నివారించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. కిచెన్‌లో చీమల సమస్య ఉన్న చోట వాటిని చల్లుకోవాలి. లేదా చీమలు కిచెన్‌లోకి ప్రవేశించే చోట ఉప్పు లేదా మిరియాల పొడితో అడ్డంకిగా గీత గీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చీమలు రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు.
దోసకాయ పీల్స్ : ఇవి చీమల బెడదను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో చేదు దోసకాయ రకానికి చెందిన తొక్కలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయంటున్నారు. ఎందుకంటే.. చీమలు వాటి రుచి, వాసనను ఇష్టపడవు. ఇందుకోసం.. కిచెన్‌లోకి చీమలు ప్రవేశించే చోట దోసకాయ తొక్కలను ఉంచండి. అయితే, వాటి ప్రభావం తగ్గకుండా ఉండడానికి ప్రతి రెండు రోజులకోసారి వాటిని ఛేంజ్ చేస్తుండాలి. పైన చెప్పిన టిప్స్‌తో సహజసిద్ధంగా చీమల బెడదను ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఇంట్లో బొద్దింకల స్ప్రే వాడితే మనకు డేంజర్ - ఈ నేచురల్ టిప్స్ పాటిస్తే ఒక్కటి కూడా ఉండదు!
ఎన్ని చేసినా ఇంటి నుంచి బల్లులు పోవడం లేదా - ఈ టిప్స్ పాటిస్తే వాటిని తరిమికొట్టడం వెరీ ఈజీ!