How to Detect Landslides Before They Occur : భూ ప్రకంపలను, తుఫాన్లను ముందే హెచ్చరించే వీలునప్పుడు ఉపరితలంపైన కనిపించే కొండచరియలు విరిగిపడటం, వరద ప్రవాహ ముప్పును ముందే పసిగట్టలేమా? వయనాడ్‌లో కొండచరియల వల్ల జరిగిన బీభత్సంతో అందరిలో మొదలైన ప్రశ్న. అంటే ఇప్పటికిప్పుడు ముందే గుర్తించడం కష్టమే అయినా అందివస్తున్న సాంకేతికను ఉపయోగించుకొని వాటివల్ల సంభవించే ప్రాణనష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. పుర్ణచందర్రావు. ఈ నేతృత్వంలోనే ముందస్తు హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి చేశారు. కేరళలో ప్రమాదాలు పొంచి ఉన్న ప్రాంతాల్లో ఎన్జీఆర్ఐ అభివృద్ధి చేసి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుతో భవిష్యత్తులో జరిగే నష్ట నివారణను అడ్డుకోవచ్చని అంటున్నారు. ఇటీవల వయనాడ్‌లో కొండచరియల విషాదం నేపథ్యంలో ముప్పు నివారణకు మార్గలపై ఆయనతో ఈటీవీ భారత్ ముఖాముఖి
అప్పుడే గుర్తించడం కష్టమే : కొండచరియలు విరిగిపడటం ముందుగా గుర్తించడం సవాలే. కాకపోతే ఎక్కడ విరిగిపడే అవకాశం ఉందో నష్టశాతాన్ని బట్టి వాటిని జోన్లుగా విభజించాలి. అధిక వర్షాపాతం. నిటారుగా వాలు ఉన్న చోట ప్రమాదం జరిగే అవకాశాం మెండుగా ఉంటుంది. వీటిని రెడ్ జోన్లుగా మార్క్ చేసి హెచ్చరికలు జారీ చేస్తారు. ఇది సాధారణ పద్ధతి. కొండ ప్రాంతాల్లో శాటిలైట్ చిత్రాలను గమనిస్తూ ఏదైనా ప్రాంతంలో పెద్ద మార్పులు కన్పిస్తే దాని ఆధారంగా కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తారు. ప్రస్తుతం ఈ రెండు మార్గాలను వినియోగిస్తున్నారు.
వయనాడ్ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్ - Satellite Images Of Wayanad
భూకంపాలను గుర్తించే సిస్మోమీటర్ ఆధారంగా కొండచరియలు విరిగిపడటం, వరదలను గుర్తించే ముందస్తు హెచ్చరికల వ్యవస్థను రూపొందిచారు. ఆర్మీ అభ్యర్థన మేరకు చైనా సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న మన దేశ సైనికులకు కొండచరియలతో ప్రమాదాలు ఉండటంతో ఒకటి, ఎన్టీపీసీ కోసం ప్రస్తుతం మరో ప్రాజెక్టు చేస్తున్నాం. అక్కడ సెన్సర్లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని ఎన్జీఆర్ఐ నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ రెండు ప్రాజెక్టులను సలహాదారుగా ఉన్నాను. కేరళలోనూ ఇలాంటివి ఏర్పాటు చేయవచ్చు.
సెన్సార్లతో ముందస్తు హెచ్చరికలు : పర్యాటక సందడి ఎక్కువగా ఉండే హిమాలయాల్లోని బద్రీనాథ్, కేదార్నాథ్, జోషిమఠ్‌లో సెన్సర్లతో ముందస్తుగా ముప్పును గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేశారు. అని డాక్టర్ ఎన్. పుర్ణచందర్ అన్నారు.కొండచరియలు హఠాత్తుగా విరిగిపడుతుంటాయి. అంత సమయం ఉండదు. ఎడ తెరపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. కేరళలో చూస్తే మొదటి, మూడో కొండచరియలు విరిగిపడటానికి మధ్యలో అరగంట సమయం ఉంది. మూడోదాని వల్లే ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. సెన్సర్ల ఏర్పాటు ద్వారా ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉండిఉంటే ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశముండేది.
కేరళ సర్కారుకు లేఖ : ముప్పు ఉన్న ప్రాంతాల్లో సెన్సర్లు ఏర్పాటు చేసి వాటిని ఎన్‌జీఆర్‌ఐలోని కేంద్రానికి అనుసంధానం చేస్తాం. ఇది పూర్తిగా కృత్రిమమేధ, మెషిన్ లెర్నింగ్‌తో పనిచేసేలా అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. అక్కడ నుంచి వచ్చే శబ్దాలు, ప్రకంపనలు బట్టి వరదలా? కొండచరియలా? భూకంపమా? వాహనాల సౌండా అనేది ఏఐ ద్వారా విశ్లేషించుకుని ముప్పు పొంచి ఉన్నప్పుడు హెచ్చరిక అందజేస్తుంది. దీన్ని ఏర్పాటు చేసుకోవాలని కేరళ సర్కారుకు లేఖ రాయబోతున్నాను.
పర్యాటకం కోసం రహదారుల విస్తరణకు కొండలను తవ్వడం, నివాసాలు పెరగడం వంటివి కొంత ముప్పునకు కారణం. ఇళ్ల కోసం అడవులను కొట్టేస్తున్నారు. చెట్లు ఉంటే వాటి వేర్లు మట్టిని పట్టి ఉంటాయి. ఈ తరహా చెట్లనే పెంచాలడం మంచిది. కానీ ఇటీవల ఇతర చెట్ల పెంపకంతో వాటికి మట్టితో పట్టులేక కొండచరియలు జారి పోవడానికి మరో కారణమవుతున్నాయి.
'ఆర్మీ సేవలకు బిగ్ సెల్యూట్' - వయనాడ్ చిన్నారి లేఖ వైరల్ - Wayanad Landslides