How to Pick a Good Apple: రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లతో సహా అందరూ చెబుతుంటారు. అయితే.. మీరు కొనుగోలు చేసే యాపిల్ మంచిదైతేనే ఆరోగ్యం! లేదంటే.. డబ్బులు వృథాకావడంతోపాటు అనారోగ్యం బోనస్‌గా వస్తుంది. ఇలాంటి యాపిల్స్‌పై ఉండే బ్యాక్టీరియా కారణంగా ఒక్కోసారి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి యాపిల్ పండ్లను కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. మంచి యాపిల్స్‌ను ఎలా గుర్తించాలో మీకు తెలుసా? నో అంటే మాత్రం.. ఈ చిట్కాలు పాటించి తెలుసుకోండి.
రంగు..
సాధారణంగా యాపిల్స్ లేత పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోనే ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. హెల్దీగా ఉన్న యాపిల్ మన దృష్టిని ఆకర్షిస్తుందని చెబుతున్నారు. ఇంకా.. ఆ పండు తియ్యగా, రుచికరంగా ఉంటుందని అంటున్నారు. ఈ విషయమై 2009లో Journal of the American Society for Horticultural Science లో ఓ అధ్యయనం పబ్లిష్ అయ్యింది. "Apple Skin Color is a Good Predictor of Quality" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో University of California ప్రొఫెసర్ Dr. Carlos H. Crisosto పాల్గొన్నారు. లేత ఎరుపు-ఆకు పచ్చ రంగు, పసుపు-ఎరుపు.. ఇలా మిక్డ్స్ కలర్స్‌లో ఉండే యాపిల్ పండ్లు తియ్యగా, చాలా రుచిగా ఉంటాయని వివరించారు. పూర్తిగా ఆకు పచ్చ రంగులో ఉండే యాపిల్స్ పుల్లగా ఉంటాయని.. జ్యూసులకు అయితే మాత్రం పసుపు రంగు యాపిల్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పారు.
బరువు
కొన్ని యాపిల్స్ పట్టుకుంటే చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. ఇలాంటివి తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. చిన్నగా, మీడియం సైజులో ఉండే పండ్లను సెలక్ట్ చేసుకోవాలని, అదే సమయంలో అవి సైజుకు తగినట్టుగా బరువు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తేలికైన యాపిల్స్ రోజుల తరబడి నిల్వ ఉన్నవి కావొచ్చని అంటున్నారు. "జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. సైజుకు తగిన బరువున్న ఆపిల్స్ అధిక నాణ్యత కలిగి ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు.
వాసన
చాలా తియ్యగా, రుచికరంగా ఉండే యాపిల్ పండ్ల నుంచి సువాసన ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టచ్ చేసి చూడాలి..
మచ్చలు, చారలు పడిన యాపిల్ పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అవి అప్పటికే లోపల దెబ్బతినిపోయి ఉంటాయని సూచిస్తున్నారు. కాబట్టి మచ్చలు, చారలు లేకుండా పూర్తిగా మంచిగా ఉండే పండ్లనే తీసుకోవాలని, ఇందుకోసం మీరే స్వయంగా చేతిలోకి తీసుకొని పండ్లను చెక్ చేయాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.