How to Make Rakhi at Home : రాఖీలు అందరూ మార్కెట్లో కొనుగోలు చేస్తుంటారు. కానీ.. మీ స్వహస్తాలతో తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మీ సోదరులు సరికొత్త అనుభూతికి లోనవుతారు. "తయారు చేయడం మాకు రాదు" అంటారా? నో టెన్షన్. మీ కోసం అద్దిరిపోయే రాఖీ ఐడియాస్‌ను తీసుకొచ్చాం. వీటిని తయారు చేయడానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మరి లేట్ చేయకుండా వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
కాటన్ బడ్స్ రాఖీ:
కావాల్సినవి:
- కాటన్ బడ్స్
- డ్రాయింగ్ పేపర్
- ఫ్యాబ్రిక్ గ్లూ
- గోల్డెన్ బాల్ చైన్
- గోల్డెన్ థ్రెడ్
తయారీ విధానం:
- ముందుగా కాటన్ బడ్స్ ఎన్ని కావాలో అన్ని తీసుకుని వాటి రెండు వైపులా బడ్స్‌కు కలర్ వేసుకోవాలి. ఇక్కడ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన రెండు లేదా మూడు కలర్స్‌ను కాటన్ బడ్స్‌కు వేసుకోవాలి. ఆ తర్వాత వాటి చివర్లను కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు డ్రాయింగ్ పేపర్‌ను తీసుకుని మీకు నచ్చిన సైజ్‌లో రౌండ్‌గా రెండు కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక డ్రాయింగ్ పేపర్ తీసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఏదైనా ఒక కలర్ బడ్స్‌ను రౌండ్‌గా పెట్టాలి.
- ఆ తర్వాత మళ్లీ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మరో కలర్ బడ్స్ పెట్టాలి. ఆ తర్వాత చివరగా మరో కలర్ బడ్స్ పెట్టాలి. ఇలా మీకు నచ్చినన్ని కలర్స్ పెట్టుకుంటూ నచ్చిన సైజ్‌లో రాఖీ చేసుకోవచ్చు.
- ఆ తర్వాత మొదటి కలర్ బడ్స్‌కి రెండో కలర్ బడ్స్‌కి మధ్యలో గ్లూ పెట్టి గోల్డెన్ బాల్ చెయిన్ పెట్టుకోవాలి.
- ఇప్పుడు రౌండ్సైజ్లో ఉన్న మరో డ్రాయింగ్ పేపర్ తీసుకుని మధ్యలో గ్లూ పెట్టి గోల్డెన్ థ్రెడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని చుట్టూ గ్లూ పెట్టి కాటన్ బడ్స్ ఉన్న పేపర్‌ను తీసుకొచ్చి దానికి అతికించాలి. అంతే ఎంతో అందంగా ఉండే రాఖీ రెడీ..
సిల్క్ థ్రెడ్ రాఖీ:
కావలసినవి:
- సిల్క్ థ్రెడ్
- రౌండ్ కార్డ్ బోర్డ్
- పెరల్స్ చైన్
- పెరల్స్ బీడ్స్
- స్టోన్ చైన్
- ఫ్యాబ్రిక్ గ్లూ
తయారీ విధానం:
- ముందుగా రౌండ్ కార్డ్‌బోర్డ్‌ను మీకు నచ్చిన సైజ్‌లో కట్ చేసుకోవాలి. దానికి మధ్యలో హోల్ పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఏదైనా కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని దానిని చిన్న స్కేల్ చుట్టూ 20 సార్లు చుట్టుకోవాలి.
- అలా చుట్టుకున్న తర్వాత ఓ సైడ్ కట్ చేసుకుని.. ఒక చివర దారాలను గ్లూ సాయంతో కలుపుకోవాలి. మరో చివర కూడా దారాలను గ్లూ ఉపయోగించి కలుపుకోవాలి.
- ఇప్పుడు కార్డ్బోర్డ్ తీసుకుని ఒక దగ్గర గ్లూ పెట్టి.. ముందే తయారు చేసుకున్న దారంలోని ఓ కొనను గ్లూ కు స్టిక్ చేయాలి. ఆ తర్వాత దానిని హోల్లో నుంచి తీసుకుని కార్డ్బోర్డ్ మొత్తం దారం చుట్టుకోవాలి.
- ఆ తర్వాత ఆ హోల్ మధ్యలో దానికి సరిపడా ముత్యాన్ని పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ముత్యం చుట్టూ గ్లూ పూసి స్టోన్ చైన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టోన్ చైన్ చుట్టూ గ్లూ అప్లై చేసి పెరల్స్ చైన్ పెట్టుకోవాలి.
- ఇప్పుడు మళ్లీ సిల్క్ థ్రెడ్‌ను 20 సార్లు స్కేల్‌కు రాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ దారానికి కొన్ని ముత్యాలను ఎక్కించుకోవాలి.
- ఆ తర్వాత ముందే సిద్ధం చేసుకున్న కార్డ్బోర్డ్ వెనుక భాగాన గ్లూ అప్లై చేసి దానిని ముత్యాలు ఉన్న దారం మధ్యలో పెట్టుకోవాలి.
- ఇప్పుడు కార్డ్బోర్డ్ కన్నా తక్కువ సైజ్‌లో డ్రాయింగ్ పేపర్ తీసుకుని దానికి గ్లూ అప్లై చేసి ఆ ముత్యానికి వెనుక భాగంలో పేస్ట్ చేయాలి. తర్వాత దారానికి ఎక్కించిన ముత్యాలు బయటికి రాకుండా ఉండటానికి వాటి చివర్లు ముడి వేసుకంటే సరి. అంతే రాఖీ రెడీ అయిపోతుంది.
అగ్గిపుల్లలతో రాఖీ:
కావాల్సినవి:
- అగ్గిపుల్లలు
- కలర్
- రౌండ్ కార్డ్బోర్డ్
- ఫెవికాల్
- కలర్ స్టోన్
- బాల్ చైన్స్
- స్టోన్ చైన్
- సిల్క్ థ్రెడ్
- తెల్లటి ముత్యాలు
తయారీ విధానం:
- ముందుగా అగ్గిపుల్లల చివర్లకు నచ్చిన రంగులు వేసి ఆ పుల్లలను సగానికి కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు రౌండ్ సైజ్‌లో ఉన్న కార్డ్బోర్డ్ తీసుకుని చుట్టూ ఫెవికాల్ పూసి అగ్గిపుల్లలను రౌండ్‌గా పెట్టుకోవాలి.
- ఆ తర్వాత మరో చిన్న సైజ్ కార్డ్బోర్డ్ తీసుకుని మధ్యలో ఫెవికాల్ పూసి పెద్దది కలర్ స్టోన్ పెట్టాలి. ఆ తర్వాత దాని చుట్టూ బాల్ చైన్స్, స్టోన్ చైన్ పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టోన్స్ ఉన్న కార్డ్‌బోర్డ్‌ను అగ్గిపుల్లలు ఉన్న కార్డ్బోర్డ్ మధ్యలో ఫెవికాల్ రాసి పెట్టాలి.
- ఆ తర్వాత ఏదైనా కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని దానిని చిన్న స్కేల్ చుట్టూ 20 సార్లు చుట్టుకోవాలి. ఆ తర్వాత ఒక సైడు కట్ చేసి వాటికి తెల్లటి ముత్యాలను ఎక్కించుకోవాలి.
- ఆ తర్వాత అగ్గిపుల్లలు ఉన్న కార్డ్బోర్డ్ వెనుక భాగంలో ఫెవికాల్ రాసి దారాన్ని దానికి అతికించాలి.
- ఆ తర్వాత చిన్న సైజ్‌లో ఉన్న డ్రాయింగ్ పేపర్ తీసుకుని దానికి ఫెవికాల్ అప్లై చేసి దానిని.. అగ్గిపుల్లల కార్డ్బోర్డ్ వెనుక భాగంలో దారం ఉన్న ప్లేస్‌లో అతికించాలి. అంతే చూడటానికి అందంగా ఉండే రాఖీ రెడీ అవుతుంది.
- ఇవీ చదవండి:
రాఖీ పండక్కి గిఫ్ట్ కొనాలా..? కేవలం 100 రూపాయల్లో బెస్ట్ ఐడియాస్!
రాఖీ పౌర్ణమి స్పెషల్ స్వీట్: నోట్లో వేస్తే కరిగిపోయే అంజీర్ కలాకండ్ - ఇలా ప్రిపేర్ చేయండి