Health Benefits Of Popcorn : చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా పాప్‌కార్న్ తింటుంటారు. ఇక చాలామందికి సినిమా, మాల్స్‌కి వెళ్తే తప్పకుండా చేతిలో పాప్‌కార్న్ ఉండాల్సిందే. అయితే.. సరదాగా మనం తినే పాప్‌కార్న్ ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ అంటున్నారు నిపుణులు! పాప్‌కార్న్‌లో ఉండే పోషకాలు, వీటిని తినడం వల్ల కలిగే లాభాల గురించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ 'డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
మనం టైమ్‌పాస్ కోసం తినే పాప్‌కార్న్‌లో (national library of medicine report) క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ అసలే ఉండదు. అలాగే దీనిలో ఫైబర్‌తో పాటు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలుంటాయి. చిన్నపిల్లలకు ఒక హెల్దీ స్నాక్‌గా పాప్‌కార్న్‌ని అందించవచ్చని డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్ సూచిస్తున్నారు. పాప్‌కార్న్ తినడం వల్ల పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాలన్నీ అందుతాయని చెబుతున్నారు.
"హెల్దీ స్నాక్‌లలో పాప్‌కార్న్ ఉండేలా చూసుకోవచ్చు. కానీ, పాప్కార్న్లలో చీజ్ పాప్‌కార్న్, సాల్టేడ్ పాప్‌కార్న్ కాకుండా ప్లేన్ పాప్‌కార్న్ తింటేనే ఎక్కువ లాభాలను పొందవచ్చు. పాప్‌కార్న్‌లో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని కొంచెం ఎక్కువగా తిన్నా కూడా కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీనిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా తీసుకోవచ్చు. అయితే, బయట దొరికే పాప్కార్న్లలో చాలా వరకు ఉప్పు, చీజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇంట్లో ప్లేన్ పాప్‌కార్న్ చేసుకుని తింటే హెల్త్‌కి ఎంతో మంచిది." -డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్
పాప్‌కార్న్‌ని కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా.. అందులోని పోషకాలు అందడానికి కూడా అప్పుడప్పుడూ తింటుండాలి. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల పాప్‌కార్న్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుక్కుని ఇంట్లో చేసుకుని తింటే మంచిది. సాయంత్రం స్నాక్‌గా కూడా దీనిని తినొచ్చు.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది :
వీటిలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్‌పై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి, వీటిని మధుమేహం ఉన్నవారు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్ చెబుతున్నారు. పాప్‌కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు దీనిని తినడం వల్ల వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
త్వరగా శక్తిని పొందవచ్చు!
పాప్‌కార్న్ ప్రాసెస్ చేయని ఆహారం. 100 శాతం సహజసిద్ధంగా తయారైన తృణధాన్యంగా చెప్పవచ్చు. ఇంట్లో పనులు చేసి అలసిపోయినప్పుడు దీనిని తినడం వల్ల త్వరగా శక్తిని పొందవచ్చు. అలాగే పండ్లరసాల కంటే ఎక్కువగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ను తీసుకోవడం బోర్‌గా అనిపిస్తే.. పాప్‌కార్న్ తినొచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
ఇష్టంగా పాప్‌కార్న్ తింటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటే - వారం రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గడం గ్యారెంటీ!