Guntur Style Gongura Ullipaya Pacchadi: గోంగూర పచ్చడి.. ఈ పేరు వింటేనే చాలా మందికి నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇక వేడి వేడి అన్నంలోకి నెయ్యి, గోంగూర పచ్చడి వేసుకుని తింటే మెతుకు కూడా మిగల్చరు. అంత బాగుంటుంది రుచి. ఇక గోంగూర పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తారు. ఏ రకంగా చేసినా టేస్ట్ మాత్రం అదుర్స్. అయితే ఎప్పుడూ మీకు వచ్చినట్లు కాకుండా ఈసారి కొత్తగా.. మేము చెప్పే విధంగా.. అదీ గుంటూర్ స్టైల్లో ఉల్లిపాయ వేసి చేయండి. మీరు చేసే వాటికన్నా టేస్ట్ అద్దిరిపోతుంది. పుల్లపుల్లగా.. కారంకారంగా ఉన్న దీన్ని.. అన్నంలో కలుపుకుని తినడమే కాదు నాకేస్తారు కూడా. అంతేకాదండోయో.. ఇది చేయడమూ వెరీ వెరీ ఈజీ.. వంట రాని వాళ్లు కూడా చేసేయొచ్చు. ఏంటి ప్రాసెస్ చెబుతుంటేనే నోరూరుతోందా? అయితే లేట్ చేయకుండా వెంటనే ఈ పచ్చడి చేసే విధానం? దానికి కావాల్సిన పదార్థాలపై ఓ లుక్కేయండి మరి.
గోంగూర ఉల్లిపాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
- ఎర్ర గోంగూర ఆకులు - 50 గ్రాములు
- నూనె - తగినంత
- ఆవాలు - 1 టీ స్పూన్
- మెంతులు - 1 టీ స్పూన్
- ఎండు మిర్చి - 10
- పచ్చిమిర్చి -7
- చింతపండు రసం - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
తాళింపు కోసం:
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీస్పూన్
- పొట్టు మినపప్పు - 1 టీస్పూన్
- ఎండు మిర్చి - 2
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 6
- కరివేపాకు - 2 రెమ్మలు
నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అదుర్స్!
తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు వేసి మంచి సువాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.
- ఇప్పుడు అందులో ఎండుమిర్చి వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీజార్లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఎర్ర గోంగూర ఆకులు మాత్రమే వేసి మీడియం ఫ్లేమ్ మీద ఆకులు మెత్తగా మగ్గేంతవరకు కుక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి చింతపండు రసం పోసి.. గోంగూరలోని జిగురు పోయేంతవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరికొద్దిసేపు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీజార్ తీసుకుని అందులోకి ఉడికించిన గోంగూర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు, పొట్టు మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకుని కలిపిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి, గోంగూర పేస్ట్ వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలిపి దింపేసుకుంటే సరి. ఎంతో రుచికరమైన గుంటూరు గోంగూర ఉల్లిపాయ పచ్చడి రెడీ.
ఇవీ చదవండి:
సూపర్ టేస్టీ "బీరకాయ కొత్తిమీర పచ్చడి" - వేడివేడి అన్నంతో తింటే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!
పది నిమిషాల్లో పసందైన సొరకాయ పచ్చడి - పచ్చి మిర్చితో నెవ్వర్ బిఫోర్ టేస్ట్!
మీరు ఎప్పుడూ తినని "కోడిగుడ్డు చట్నీ" - మీ నోటికి ఎన్నడూ తగలని టేస్ట్! - ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి