ETV Bharat / offbeat

గుంటూర్​ స్పెషల్​ "కోవా మాల్పూరి" - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్​- పైగా రుచి అద్భుతం!

-పండగ వేళ సరికొత్త స్వీట్​ మాల్పూరి -ఈ కొలతలతో తయారు చేస్తే పర్ఫెక్ట్​ టేస్ట్​

Guntur Special Malpuri recipe
Guntur Special Malpuri recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Guntur Special Malpuri Recipe : మిఠాయిలంటే అందరికీ ఇష్టమే. స్వీట్​ బాక్స్​ ముందు పెడితే చాలు.. ఒకటికి రెండు స్వీట్లు తిని మనసు తృప్తి పరుచుకుంటారు. ఇక పండుగలు, శుభకార్యాలు టైమ్​లో ఇంట్లో తప్పకుండా ఏదోక స్వీట్​ తయారు చేస్తుంటారు మహిళలు. అయితే, ఇప్పుడు మనం గుంటూర్​లో ఎంతో ఫేమస్​ అయినా "స్పెషల్​ కోవా మాల్పూరి" ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చేయడం కష్టమనుకుంటారు చాలా మంది. కానీ, ఈ స్టోరీలో చెప్పిన కొన్ని టిప్స్​ పాటిస్తూ.. చేస్తే కోవా మాల్పూరి పర్ఫెక్ట్​గా వస్తుంది. ఈ తీయని కోవా మాల్పూరిలను ఇంట్లో వాళ్లందరూ ఒకటికి రెండు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇక లేట్​ చేయకుండా గుంటూర్ స్పెషల్​ కోవా మాల్పూరి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

పూరీల కోసం..

  • గోధుమ పిండి-2 కప్పులు
  • మైదా పిండి- అరకప్పు
  • నీళ్లు -రెండున్నర కప్పులు

కోవా కోసం..

  • పాలు -250 ml
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • పాల పౌడర్​-ఒకటిన్నర కప్పు

పాకం కోసం..

  • పంచదార- 2 కప్పులు
  • నీళ్లు -కప్పు
  • యాలకులపొడి- అరటీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా ముకుడులో నెయ్యి వేసి కరిగించండి. ఇప్పుడు పాలు పోసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి.
  • పాలలో కొద్దికొద్దిగా పాల పౌడర్​ వేసుకుంటూ.. బాగా మిక్స్​ చేయండి. (పాల పిండి ఒకేసారి కాకుండా.. 2 లేదా 3 చెంచాల చొప్పున వేసుకుంటూ కలపాలి.)
  • కోవా రెడీ అయిన తర్వాత ముకుడులోంచి తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు పాకం కోసం.. స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో పంచదార, నీళ్లు పోసి కరిగించండి.
  • చక్కెర కరిగి పాకం రెడీ అయిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి. ఇందులో పావు కప్పు పాకం పక్కన ఉంచుకోండి. తర్వాత యాలకులపొడి వేసి బాగా కలపండి.
  • ఇప్పుడు పూరీల కోసం మిక్సింగ్​ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి వేసుకుని మిక్స్ చేయండి.
  • పిండిని నీళ్లతో ఒకేసారి కాకుండా.. కొద్దికొద్దిగా పోస్తూ బాగా మిక్స్​ చేయండి.
  • పిండిలో చివరిగా తీసిన పంచదార పాకం వేసి మిక్స్​ చేయండి. పూరీల పిండి దోశల పిండిలా ఉండాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి పూరీలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేయండి.
  • నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు గరిటెతో పిండిని ఒకేచోట పోయండి.
  • ఒక నిమిషం తర్వాత పూరీని గరిటెతో తిప్పి రెండు వైపులా బాగా కాల్చుకోండి. ఈ పూరీని చక్కెర పాకంలో వేసి ఒక నిమిషం తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
  • పూరీలలోని పాకం పోయిన తర్వాత.. ఇప్పుడు ఈ పూరీల మధ్యలోకి కోవా స్టఫ్​ చేసుకోండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన గుంటూర్​ మాల్పూరి మీ ఇంట్లోనే తయారైపోతుంది.
  • నచ్చితే ఈ పండగకు ఈ మాల్పూరి తప్పక ట్రై చేయండి.

బియ్యంతో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ - ఈ దీపావళికి ఓసారి ట్రై చేయండిలా! - టేస్ట్​కి ఇంట్లో వారందరూ ఫిదా!

దీపావళి స్పెషల్ స్వీట్ "సజ్జప్ప" - ఒకసారి చేస్తే 2 నెలలు ఉంటుంది - పైగా టేస్ట్​ అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.