ETV Bharat / offbeat

"గుంట పొంగనాలు + పచ్చిమిర్చి పచ్చడి" డెడ్లీ కాంబినేషన్ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది! - GUNTA PONGANALU RECIPE

డెడ్లీ కాంబినేషన్​లో సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - ఒక్కసారి తిన్నారంటే ఎవరైనా ఫిదా!

How to Make Gunta Ponganalu
Gunta Ponganalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 8:20 PM IST

How to Make Gunta Ponganalu in Telugu : చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పెసరట్లేనా.. అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు బోరింగ్​గా ఫీల్ అవుతుంటారు. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "గుంట పొంగనాలు విత్​ పచ్చిమిర్చి చట్నీ". ఈ కాంబినేషన్​లో గుంట పొంగనాలను తిన్నారంటే పిల్లలే కాదు ఎవరైనా మళ్లీ మళ్లీ కావాలనాల్సిందే. అంత రుచికరంగా ఉంటుంది గుంట పొంగనాలు విత్ పచ్చిమిచ్చి పచ్చడి కాంబినేషన్​! ఇంతకీ, వీటి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినపపప్పు - 1 గ్లాసు
  • బియ్యం - 3 గ్లాసులు
  • శనగపప్పు - 5 చెంచాలు
  • మెంతులు - 1 చెంచా
  • ఉల్లిపాయలు - 2
  • కరివేపాకు - కొద్దిగా

పచ్చడి కోసం :

  • పచ్చిమిర్చి - 25
  • టమాటాలు - 2
  • ఉల్లిపాయ - 1
  • జీలకర్ర - 1 చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు - 8(పొట్టు తీసినవి)
  • చింతపండు - చిన్న నిమ్మకాయ సైజంత
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 2 చెంచాలు

సూపర్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన బియ్యం, మినపపప్పు, 2 చెంచాల శనగపప్పు, మెంతులన్నింటినీ కలిపి ఒక గిన్నెలో సుమారు 4 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత రెండు, మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆపై మిక్సీ జార్​లో కొద్దికొద్దిగా వేసుకుంటూ కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని రాత్రంతా పులియబెట్టుకోవాలి.
  • అనంతరం నెక్ట్ డే పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడానికి మూడు గంటల ముందు మూడు చెంచాల శనగపప్పును ఒక చిన్న బౌల్​లో నానబెట్టుకోవాలి. ఆపై పొంగనాలు వేసుకునేటప్పుడు ఆ పప్పును పిండిలో కలుపుకొని వాటిని వేసుకుంటే చాలా రుచికరంగా వస్తాయి.
  • ఇప్పుడు రాత్రి మొత్తం పులియబెట్టుకున్న పిండిని తీసుకొని ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత పిండిలో కలుపుకోవడానికి ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. అలాగే కరివేపాకును సన్నగా తరిగి పెట్టుకోవాలి.
  • అనంతరం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు సన్నని తరుగు, నానబెట్టుకున్న శనగపప్పును పిండిలో వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.

దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్​ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి!

  • అయితే, పొంగనాలు వేసుకోవడానికి ముందుగా పచ్చిమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మొదటగా ఉల్లిపాయ, టమాటాలను తరిగిపెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆపై మిక్సీ జార్​లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఒక ఇప్పుడు పొంగనాలు వేసుకోవాలి. అందుకోసం స్టౌపై గుంట పొంగనాల పాత్ర పెట్టుకొని అన్నీ గుంటలలో అర చెంచా చొప్పున ఆయిల్ పోసుకోవాలి.
  • అనంతరం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని మరోసారి కలుపుకొని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఒక్కో గుంటలో పిండిని నింపుకోవాలి.
  • తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఒక వైపు బాగా కాలాక మరోవైపునకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆపై ఈ పొంగనాలను వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్​లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది ఆ టేస్ట్ నా సామిరంగా అనాల్సిందే. అంత అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది!
  • మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ సూపర్ టేస్టీ "గుంట పొంగనాలు + స్పైసీ పచ్చిమిర్చి చట్నీ" డెడ్లీ కాంబినేషన్​ను ఇంట్లో ఓసారి ట్రై చేయండి!

సేమియా ఉప్మా ముద్ద ముద్దగా అవుతోందా? - ఇలా చేస్తే పొడిపొడిగా చాలా రుచికరంగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.