ETV Bharat / offbeat

ఆకు కూరలు ఎలా వండుతున్నారు? - ఇలాగైతే చాలా కోల్పోతారంటున్న నిపుణులు! - GREEN VEGETABLES COOKING TIPS

- పంట పద్ధతిలో పలు సూచనలు చేస్తున్న నిపుణులు - పాటించకపోతే పోషకాలన్నీ గాల్లోనే!

GREEN VEGETABLES COOKING TIPS
GREEN VEGETABLES COOKING TIPS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 7:32 PM IST

GREEN VEGETABLES COOKING TIPS : మనకు చక్కటి ఆరోగ్యం కావాలంటే.. తినే తిండి మంచిదై ఉండాలి. అలాంటి తిండిలో మొదటి స్థానంలో ఉండేవి ఆకు కూరలు. కంటి చూపు మొదలు.. అధిక బరువు, రోగనిరోధక శక్తి, చర్మ సమస్యల దాకా ఎన్నింటికో ఇవి సరైన మందుగా చెబుతుంటారు నిపుణులు. వీటితో బోలెడు ప్రయోజనాలు సమకూరుతాయని అంటారు. వైద్యుల సూచనల మేరకు జనం కూడా వీటిని ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే.. వీటిని తినడం ఒకెత్తయితే.. వండడం మరో ఎత్తు అంటున్నారు నిపుణులు. సరైన పద్ధతిలో కుక్ చేస్తేనే.. వాటి నుంచి సంపూర్ణ ప్రయోజనం దక్కుతుందని అంటున్నారు. లేదంటే పోషకాలన్నీ ఎగిరిపోతాయని చెబుతున్నారు. మరి.. ఇంతకీ వారు చేస్తున్న సూచనలేంటో ఇప్పుడు చూద్దాం.

మనం నిత్యం వండుకునే తోటకూర, గోంగూర, బచ్చలి కూర, పాలకూర, మెంతి, కొత్తిమీర.. వంటి వాటితోపాటు బ్రకోలి, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ వంటి ఆకుపచ్చ కాయగూరలను కూడా సరైన పద్ధతిలో కుక్ చేయాలని సూచిస్తున్నారు. వీటిని వండుతున్నప్పుడు కుకింగ్ బౌల్​లో ఒక టీస్పూన్‌ నూనె లేదా నెయ్యి వేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాటిల్లోని పోషకాలు తరిగిపోకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇలా చేయడం వల్ల అందులోని పోషకాలన్నింటినీ శరీరం త్వరగా గ్రహిస్తుందట.

నీళ్లలో వేయండి..

ఆకు కూరలు, ఆకుపచ్చటి కూరగాయలు వండే ముందు.. శుభ్రం చేసిన తర్వాత కాసేపు వేడి నీటిలో నానబెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పద్ధతి వల్ల కూరలు త్వరగా ఉడుకుతాయని, ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేకపోవడంతో పోషకాలు ఆవిరయ్యే అవకాశం తక్కువని అంటున్నారు. కూరలు నానబెట్టిన వేడి నీళ్లను అదే కూరలో వాడుకుంటే సంపూర్ణ పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు. ఈ ప్రాసెస్​లో నీళ్లకు బదులుగా నిమ్మరసం, వెనిగర్‌ మిశ్రమాన్ని కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. దీనివల్ల కూర చిక్కగా, రుచికరంగా వస్తుందని చెబుతున్నారు.

మరికొన్ని టిప్స్ పాటించండి..

  • కాయగూరల్లో పోషకాలు మొత్తం ఒడిసిపట్టాలంటే.. స్టీమింగ్‌ పద్ధతి చాలా మంచిదని అంటున్నారు. దీనివల్ల వాటిలోని పోషకాలు పదిలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
  • ఆకుపచ్చ కూరలు వండేటప్పుడు.. ఆలివ్‌ నూనె, మిరియాల పొడి, వెనిగర్‌, అల్లం పేస్ట్‌, వంటివి వేస్తే.. రుచి మరింత పెరుగుతుందని, పోషకాలూ చక్కగా శరీరానికి అందుతాయని అంటున్నారు.
  • కొందరు కాయగూరల్ని, ఆకు కూరల్ని కూడా డ్రై పద్ధతిలో ఫ్రై చేస్తుంటారు. ఇలా అస్సలే చేయొద్దని సూచిస్తున్నారు. ఇలా వండితే.. అందులో పోషకాలు చాలా వరకు వెళ్లిపోతాయని అంటున్నారు. కాబట్టి.. వీటిని కుక్​ చేసేటప్పుడు కొన్ని నీళ్లు వాడుతూ.. కాస్త జారుడు పద్ధతిలో వండుకుంటేనే మంచిదని చెబుతున్నారు.
  • ఆకుపచ్చ కూరల్ని తరిగే విషయంలోనూ తెలియకుండా మిస్టేక్స్ చేస్తుంటారని నిపుణులు చెబతున్నారు. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయొద్దని, కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచాలని సూచిస్తున్నారు. దీనివల్ల పోషకాలు నిల్వ ఉండే అవకాశం పెరుగుతుందట.
  • చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. వండిన ఏ కూరనైనా రెండోసారి వేడి చేయకూడదని సూచిస్తున్నారు. ఆకుపచ్చటి కూరలకు కూడా ఇది వర్తిస్తుందని అంటున్నారు.
  • ఈ పద్ధతులు పాటిస్తే.. కూరల్లోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.