ETV Bharat / offbeat

పచ్చిమిర్చి ఎప్పుడూ సైడ్ క్యారెక్టరేనా?​ - ఇలా మెయిన్​ లీడ్​గా తీసుకున్నారంటే పచ్చడి అద్దిరిపోతుంది బాసూ! - Green Chilli Chutney - GREEN CHILLI CHUTNEY

Green Chilli Chutney Recipe : చాలా మంది పచ్చిమిర్చిని కూరల్లో ఒక భాగంగా​ మాత్రమే వాడుతుంటారు. కానీ, వాటితోనే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిడి ప్రిపేర్ చేసుకోవచ్చని తెలుసా? దీన్ని అన్నంతోపాటు టిఫెన్స్​లోకి తీసుకున్నా రుచి అద్భుతంగా ఉంటుంది! మరి.. ఈ పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Green Chilli Chutney
Green Chilli Chutney Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 19, 2024, 4:01 PM IST

How to Make Green Chilli Chutney : మనం కూర, చారు, రోటిపచ్చడి.. ఇలా దేన్ని ప్రిపేర్ చేసుకున్నా అందులో పచ్చిమిర్చి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎందుకంటే.. ఇవి వంటలకు మంచి ఫ్లేవర్, కమ్మదనాన్ని ఇస్తాయి. అయితే, అలా వివిధ వంటలలో వేసుకోవడం మాత్రమే కాదు.. ఇలా పచ్చిమిర్చితో పచ్చడి చేసుకుని తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడితోపాటు కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది! పైగా దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్​తో చాలా తక్కువ టైమ్​లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ.. ఈ సూపర్ టేస్టీ పచ్చిమిర్చి చట్నీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చిమిర్చి - 150 గ్రాములు
  • చింతపండు - నిమ్మకాయ సైజంత
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మెంతులు - అర టీస్పూన్
  • ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్​లో ఉన్నది)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 3 టీస్పూన్లు

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం మరీ సన్నవి కాకుండా కాస్త మీడియం సైజ్​లో ఉన్న పచ్చిమిర్చిని ఎంచుకోవాలి. ఆపై వాటిని తొడిమెలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే.. చింతపండును శుభ్రంగా కడిగి ఒక చిన్న బౌల్​లో నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయను కాస్త పెద్ద ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి మొత్తాన్ని మధ్యలోకి తుంచుతూ వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బాగా వేయించుకోవాలి.
  • అవసరమైతే కాసేపు మూతపెట్టి మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి ఎంత వేగితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
  • ఇక పచ్చిమిర్చి బాగా వేగి సాఫ్ట్​గా మారాయనుకున్నాక స్టౌఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని.. అందులో వేయించుకున్న పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని జస్ట్ అలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంటే.. పచ్చడి వేసుకుని తింటుంటే ఉల్లిపాయ పంటికి తగలాలి.
  • ఆ విధంగా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాక.. చివరగా ఓసారి కారం, ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "పచ్చిమిర్చి పచ్చడి" మీ ముందు ఉంటుంది.!
  • ఈ పచ్చడిని అన్నంతో పాటు బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటిలోకి వేసుకుని తిన్నా రుచి అద్భుతంగా ఉంటుందంటున్నారు వంట నిపుణులు.

ఇవీ చదవండి :

నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు!

ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు - 10 నిమిషాల్లోనే అద్దిరిపోయే "ఉల్లిపాయ పచ్చడి" ఇలా చేసేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.