ETV Bharat / offbeat

ఆరోగ్యాన్నిచ్చే "అల్లం పెరుగు పచ్చడి" - సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది! - HEALTHY GINGER CURD PACHADI

డైలీ రొటీన్​గా పెరుగును తినాలంటే ఇబ్బందిగా ఫీలవుతున్నారా? - అయితే, మీకోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం.

HEALTHY GINGER CURD PACHADI
Ginger Curd Pachadi in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 8:30 PM IST

Ginger Curd Pachadi in Telugu : చాలా మందికి భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగ వేసుకొని తినే అలవాటు ఉంటుంది. అయితే, ఎప్పుడూ ఒకేలా పెరుగుని తీసుకుంటే బోరింగ్ ఫీల్ కలగొచ్చు. అందుకే.. ఈసారి కాస్త స్పెషల్​గా "అల్లం పెరుగు పచ్చడి"ని ట్రై చేయండి. ఒక్కసారి దీన్ని టేస్ట్ చేశారంటే రోజూ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది! పైగా ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది! మరి, ఆలస్యమెందుకు ఈ సూపర్ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మెంతులు - 1 టీస్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం - అంగుళం ముక్క
  • పచ్చిమిర్చి - 2
  • పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప్పప్పు - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 1
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఇంగువ - కొద్దిగా
  • పెరుగు - 1 కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా అంగుళం పరిమాణంలో ఉండే అల్లం ముక్కను పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి.
  • స్టౌ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మెంతులను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా మెంతులను వేయించుకున్నాక అందులో కరివేపాకు వేసి చెమ్మారి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న మెంతుల మిశ్రమం, పసుపు, ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చికొబ్బరి తురుముతో పాటు కాసిన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆపై మినప్పప్పు, శనగపప్పు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి.
  • పోపు సగం పైగా వేగాక ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకోవడంతో పాటు జీలకర్ర, ఇంగువ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు చక్కగా వేగిందనుకున్నాక మీరు మిక్సీ పట్టుకున్న అల్లంకొబ్బరి పేస్ట్​ని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. జస్ట్ అల్లం, కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేయించుకున్నాక కడాయిని దింపుకొని మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్​లో కమ్మని తాజా పెరుగుని తీసుకొని విస్కర్ సహాయంతో బాగా చిలుక్కోవాలి. ఆపై అందులో ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పెరుగు మిశ్రమంలో పూర్తిగా చల్లార్చుకున్న అల్లంకొబ్బరి పేస్ట్​ను వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇక చివరగా కొతిమీర తరుగు వేసుకొని మరోసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. కమ్మగా, కొద్దిగా ఘాటుగా ఉండే "అల్లం పెరుగు పచ్చడి" రెడీ!

ఇవీ చదవండి :

నోరూరించే "పొట్లకాయ పెరుగు పచ్చడి" - ఇలా చేసి పెట్టారంటే నచ్చని వారూ ఇష్టంగా తినడం పక్కా!

కమ్మని "మసాలా పెరుగు కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.