ETV Bharat / offbeat

కరకరలాడే "ఎగ్ కట్​లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్​ అంతే!

అద్దిరిపోయే ఈవెనింగ్ స్నాక్ - ఇలా చేసి పిల్లలకు ఇచ్చారంటే ఎంతో ఇష్టంగా తినడం పక్కా!

How to Make Egg Cutlets
EGG CUTLET RECIPE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 1:23 PM IST

How to Make Egg Cutlets in Telugu : గుడ్డు మంచి సంపూర్ణ పోషకాహారం. దీనితో ఎలాంటి వంటకాలు చేసినా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, ఎప్పుడూ రొటిన్​గా ఎగ్స్​తో కర్రీలు తినాలనంటే బోరింగ్​గా అనిపిస్తుంది. అందుకే ఈసారి కాస్త వెరైటీగా ఎగ్స్​తో అద్దిరిపోయే ఈ స్నాక్ రెసిపీని ప్రయత్నించండి. అదే.. సూపర్ టేస్టీ ఎగ్ కట్​లెట్స్. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు! మరి, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గుడ్లు - 5
  • కారం - తగినంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - అరటీస్పున్
  • గరం మసాలా - అరటీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • ఉల్లిపాయ - 1
  • కొత్తిమీర - కొద్దిగా
  • శనగపిండి/బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు
  • బ్రెడ్ క్రంబ్స్/బొంబాయి రవ్వ - 1 టేబుల్ స్పూన్
  • నూనె - షాలో ఫ్రైకి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా నాలుగు గుడ్లను ఉడికించి పై పొట్టును తొలగించి పక్కన ఉంచుకోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన గుడ్లను కాస్త పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి.
  • ఎగ్ తురుమును ప్రిపేర్ చేసుకున్నాక దానిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, తాజాగా దంచుకున్న అల్లంవెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, శనగపిండి, బ్రెడ్ క్రంబ్స్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ కలిసేలా నెమ్మదిగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అయితే, ఇక్కడ మీరు శనగపిండి వద్దనుకుంటే ఆ ప్లేస్​లో బియ్యప్పిండిని తీసుకోవచ్చు. అలాగే బ్రెడ్ క్రంబ్స్ అందుబాటులో లేకుంటే బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 1 గుడ్డును పగులకొట్టి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దాన్ని కొద్దికొద్దిగా మీరు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అయితే, పిండి మిశ్రమం కేవలం బైండింగ్ వచ్చేంత వరకు మాత్రమే గుడ్డు సొనను యాడ్ చేసుకోవాలి.
  • ఆ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక అందులో నుంచి కొద్దిగా తీసుకొని ముందుగా బాల్​ మాదిరిగా చేసుకోవాలి. ఆపై కట్​లెట్ షేప్ వచ్చేలా చేతితో నెమ్మదిగా వత్తుకోవాలి. అలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న కట్​లెట్స్​ను నెమ్మదిగా వేసుకొని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి ఆపై రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్​ మీద ఎర్రగా వేయించుకోవాలి.
  • ఆపై వాటిని ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, కరకరలాడే "ఎగ్ కట్​లెట్స్" రెడీ!

ఇవీ చదవండి :

బెస్ట్​ టీ టైమ్​ స్నాక్​ "సేమియా పకోడి" - ఇలా చేస్తే క్రిస్పీ అండ్​ టేస్టీ!

అన్నం మిగిలిపోతే ఇలా "మసాలా వడలు" ప్రిపేర్ చేసుకోండి - సూపర్ టేస్టీగా ఉంటాయి గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.