ETV Bharat / offbeat

మీ బాత్​టబ్​ను ఇలా శుభ్రం చేశారంటే - ఎలాంటి మొండి మరకలైనా ఇట్టే తొలగిపోతాయి! - Bathtub Cleaning Tips

Bathtub Cleaning Tips: మీ ఇంట్లో బాత్​టబ్ ఉందా? అయితే దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే ఎంతటి మొండి మరకలైనా వదిలిపోతాయని నిపుణులు అంటున్నారు.

Cleaning Tips for Bathtub
Bathtub Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 5, 2024, 12:12 PM IST

Best Cleaning Tips for Bathtub: ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బాత్​రూమ్ క్లీనింగ్ విషయంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. అందులోనూ బాత్​టబ్​ను వాడేవారు.. దాన్ని శుభ్రం చేయాలన్న విషయాన్నే మరచిపోతుంటారు. అయితే, బాత్‌టబ్‌లో సేదదీరే క్రమంలో మన బాడీలోని మురికికి తోడు బాత్‌రూమ్‌లోని తేమ కారణంగా.. దాని గోడలపై ఫంగస్‌ ఫామ్ అవుతుంది.

అప్పుడు అదే బాత్‌టబ్‌ని.. తిరిగి యూజ్ చేస్తే మన ఆరోగ్యానికే నష్టం. మరోవైపు.. దాని డ్రెయిన్‌ కూడా మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది! కాబట్టి.. అలా జరగకుండా ఉండాలంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుకుందాం.

వెనిగర్, బేకింగ్ సోడా : ఈ రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్​లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై ఒక స్పాంజి సహాయంతో ఆ మిశ్రమాన్ని టబ్ మొత్తం పూయాలి. గంటసేపు అలా ఉంచి తర్వాత రుద్ది కడుక్కుంటే చాలు. దానిపై ఉన్న ఎలాంటి మొండి మరకలైనా ఇట్టే తొలగిపోయి బాత్​టబ్ కొత్తదానిలా మెరుస్తుందంటున్నారు నిపుణులు.

వైట్ వెనిగర్ : ఇదీ బాత్​టబ్​పై మరకలను పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం వేడి నీళ్లలో కొద్దిగా వైట్ వెనిగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని బాత్​టబ్​పై చల్లి 30 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత బ్రష్‌తో టబ్‌, డ్రెయినర్‌ని రుద్ది.. శుభ్రమైన నీటితో క్లీన్ చేసుకోవాలి.

డిటర్జెంట్‌ పౌడర్‌ : బాత్​టబ్​పై మలినాలను తొలగించి కొత్తదానిలా మెరిపించడంలో లిక్విడ్‌ డిటర్జెంట్‌/డిటర్జెంట్‌ పౌడర్‌ కూడా చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. బాత్‌టబ్‌ను వేడి వాటర్​తో నింపి అందులో 2 టేబుల్‌స్పూన్ల లిక్విడ్‌ డిటర్జెంట్‌/డిటర్జెంట్‌ పౌడర్‌ వేయాలి. ఆపై అరగంట ఆగి బ్రష్‌తో రుద్దుతూ.. క్లీన్‌ చేస్తే టబ్‌లో పేరుకున్న మురికి, మలినాలు ఇట్టే వదిలిపోతాయి.

నిమ్మరసం : దీనితో ఆరోగ్యప్రయోజనాలే కాదు బాత్​టబ్ క్లీనింగ్​కి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని బాత్​టబ్​లో చల్లడం లేదంటే వేడి వాటర్ నింపిన టబ్​లో దాన్ని పోయాలి. పావుగంట ఆగి టబ్​ను స్క్రబ్బర్‌తో రుద్దుతూ క్లీన్ చేసుకుంటే.. దాని మురికి ఇట్టే వదిలిపోతుంది.

కాస్టిక్ సోడా : బాత్‌టబ్‌లో వేడి నీటిని నింపి.. అందులో టీస్పూన్‌ చొప్పున కాస్టిక్‌ సోడా, లిక్విడ్‌ డిటర్జెంట్‌ వేయాలి. 15 నిమిషాలయ్యాక టబ్‌ను ఖాళీ చేసి.. బ్రష్/స్క్రబ్బర్‌తో చుట్టూ రుద్దుతూ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆపై మరోసారి శుభ్రమైన నీటితో కడిగేస్తే బాత్‌టబ్‌ తళతళ మెరిసిపోతుందంటున్నారు నిపుణులు.

బాత్‌టబ్‌లోనే కాదు.. దాని జాయింట్స్‌ దగ్గర ఎక్కువ మురికి జామ్ అవుతుంది. ఇందుకోసం.. బేకింగ్‌సోడా, నీళ్లు కలిపి ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని ఆ ప్రదేశంలో పూసి.. కాసేపు ఆగి బ్రష్‌తో రుద్ది శుభ్రం చేసుకుంటే సరిపోతుందంటున్నారు.

బాత్‌టబ్‌లో స్నానం చేసే క్రమంలో మన స్కిన్​పై ఉండే మురికి, జిడ్డుదనం, సబ్బు నీరు, ఇతర అవశేషాలు.. దాని డ్రెయిన్‌ను బ్లాక్‌ చేస్తుంటాయి. అలాంటి టైమ్​లో అరకప్పు చొప్పున బేకింగ్‌ సోడా, వైట్‌ వెనిగర్‌ను మిశ్రమంలా చేసి డ్రెయిన్‌పై పోయాలి. కొన్ని నిమిషాలు ఆగి వేడి నీళ్లు పోస్తే.. అక్కడ పేరుకున్న మురికి ఈజీగా తొలగిపోతుంది.

నోట్ : బాత్‌టబ్‌ను ఒక్కరు వాడినా.. ఇంట్లో వాళ్లందరూ వాడినా.. తరచుగా క్లీన్ చేయాలంటున్నారు నిపుణులు. అలాగే.. అవసరం ఉన్నప్పుడే అందులో వాటర్ నింపడం, ఆపై పని పూర్తయ్యాక దాన్ని ఖాళీ చేసేయడం వల్ల.. అందులో మురికి పేరుకుపోకుండా, ఫంగస్‌ వృద్ధి చెందకుండా జాగ్రత్తపడవచ్చని సూచిస్తున్నారు. అదేవిధంగా టబ్‌ను క్లీన్ చేసే ప్రతిసారీ చేతులకు గ్లౌజులు, ముక్కు-నోరు కవరయ్యేలా మాస్క్‌ ధరించడం మర్చిపోవద్దని చెబుతున్నారు.

ఇవీ చదవండి :

ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!

కిచెన్​, బాత్​రూమ్​లోని ట్యాప్స్​ జిడ్డుగా మారాయా ? ఇలా క్లీన్​ చేస్తే అప్పుడే కొన్న వాటిలా మెరుస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.