ETV Bharat / offbeat

నవరాత్రి స్పెషల్ : అమ్మవారికి ఎంతో ఇష్టమైన "పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి" - ఈజీగా చేసుకోండిలా! - NAVRATRI PRASADAM RECIPES

దసరా పండగ అంటేనే.. అమ్మవారి నైవేద్యాల వేడుక. అందుకే.. మీకోసం దేవీ శరన్నవరాత్రుల వేళ రెండు స్పెషల్ రెసిపీలు తీసుకొచ్చాం. అవే.. పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి. వీటిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

DUSSEHRA 2024 SPECIAL RECIPES
Navratri 2024 Special Recipes (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 8, 2024, 9:22 AM IST

Navratri 2024 Special Recipes : దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఎంతో నియమ నిష్ఠలతో దుర్గామాతకు పూజలు చేస్తున్నారు. అలాగే ఏరోజుకారోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు సిద్ధం చేసి నివేదిస్తుంటారు. అలాంటి వాటిల్లో అమ్మవారికి ఇష్టమైన.. కొబ్బరి పూర్ణంబూరెలు, చక్కెర పొంగలి అనే రెండు ప్రత్యేకమైన రెసిపీలు తీసుకొచ్చాం. మరి, వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొబ్బరి పూర్ణంబూరెలకు కావాల్సిన పదార్థాలు :

  • కప్పు - బియ్యం
  • అరకప్పు - మినప్పప్పు
  • మూడు కప్పులు - తాజా కొబ్బరి తురుము
  • ఒకటిన్నర కప్పు - బెల్లం తరుగు
  • అరచెంచా - యాలకుల పొడి
  • వేయించేందుకు సరిపడా - నూనె
  • అరచెంచా - ఉప్పు
  • రెండు చెంచాలు - నెయ్యి

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినప్పప్పును తీసుకొని ఆరేడు గంటలు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఈ రెండింటినీ శుభ్రంగా కడిగి మిక్సీ జార్​లోకి తీసుకొని చిక్కని దోశపిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై అందులో ఉప్పు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని బెల్లం తరుగు, కొబ్బరి తురుము వేసుకోవాలి.
  • తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగి ఆ మిశ్రమం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూ వేడి చేసుకోవాలి.
  • ఆ విధంగా అయ్యాక అందులో యాలకుల పొడి వేసి కడాయిని దింపేసుకొని ఆ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని పూర్ణాలు వేయించడానికి సరిపడా వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చిన్న చిన్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకంటూ దోశపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి.

నవరాత్రి స్పెషల్ : అమ్మవారు మెచ్చే "నువ్వులన్నం" - ఇలా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి!

చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు :

  • కప్పు - బియ్యం
  • కప్పు - పెసరపప్పు
  • కప్పు - బెల్లం తురుము
  • కప్పు - పంచదార
  • అరకప్పు - నెయ్యి
  • అరకప్పు - కొబ్బరి ముక్కలు
  • టేబుల్‌స్పూన్‌ చొప్పున - జీడిపప్పు, కిస్‌మిస్‌
  • చిటికెడు - యాలకులపొడి

తయారీ విధానం :

  • ఇందుకోసం గంట ముందే వేరు వేరు బౌల్స్​లో బియ్యం, పెసరపప్పును నానబెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని మూడు కప్పుల నీళ్లు పోసి మరిగించి దాంట్లో నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి వేసుకోవాలి. అవి ఉడుకుతుండగా నానబెట్టుకున్న పెసరపప్పును వడకట్టి ఆ మిశ్రమంలో వేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌, కొబ్బరిముక్కలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే.. స్టౌ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో బెల్లం తురుము, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి.
  • తర్వాత దాన్ని ఉడికిన అన్నంలో పోస్తూ బాగా కలుపుతూ తక్కువ మంట మీద ఉడికించాలి.
  • ఇక చివరగా అందులో నెయ్యి, యాలకులపొడి, వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌, కొబ్బరిముక్కలు వేసుకొని కలిపి దింపుకుంటే చాలు.
  • ఎంతో రుచికరంగా ఉండే 'చక్కెర పొంగలి' రెడీ!
  • తర్వాత దీన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి.

దేవీ శరన్నవరాత్రులు : అమ్మవారు మెచ్చే "శాఖాన్నం, లౌకీ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.