ETV Bharat / offbeat

బియ్యంతో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ - ఈ దీపావళికి ఓసారి ట్రై చేయండిలా! - టేస్ట్​కి ఇంట్లో వారందరూ ఫిదా! - DIWALI SPECIAL SWEET RECIPE

దీపావళికి స్పెషల్​గా ఏదైనా స్వీట్​​ చేయాలనుకుంటున్నారా? - అయితే, మీకోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం!

SUPER TASTY SWEET WITH RICE
Diwali Special Sweet Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2024, 7:18 AM IST

Diwali 2024 Special Sweet Recipe : దీపావళి అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి టపాసులు, మిఠాయిలే. అంతేకాదు ఈ పండగ రోజున తీపిని అందరికీ పంచుకునే సాంప్రదాయం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఇప్పటి నుంచే పండగకి ఏ స్వీట్ ప్రిపేర్ చేయాలి అనే ఆలోచనలో ఉంటుంటారు. అలాంటి వారికోసమే ఈ దీపావళి వేళ మీరు ఇప్పటి వరకు ట్రై చేయని ఒక సూపర్ స్వీట్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "బియ్యం మిఠాయి". చాలా తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఒకసారి ఈ మిఠాయిని రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్​! ఇంతకీ, బియ్యం మిఠాయి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - పావు కేజీ
  • నెయ్యి - తగినంత
  • బాదం - 12
  • జీడిపప్పు పలుకులు - 12
  • పంచదార - అర్ధపావు
  • యాలకుల పొడి - పావు చెంచా
  • పాలు - 1 గ్లాసు
  • పిస్తా పలుకులు - కొన్ని(గార్నిష్ కోసం)

నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్​" - ఇలా చేస్తే అచ్చం స్వీట్​ షాప్​ టేస్ట్​!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి కాస్త వేడక్కాక.. బియ్యం వేసి వేయించుకోవాలి. తర్వాత ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచి చల్లార్చుకోవాలి.
  • ఆలోపు అదే పాన్​లో బాదం, జీడిపప్పు పలుకులను వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించి చల్లార్చుకున్న బియ్యం, వేయించుకున్న బాదం, జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని పంచదారను వేసుకొని వేడిచేసి క్యారమెల్(చక్కెర పాకం) తయారు చేసుకోవాలి.
  • ఆవిధంగా క్యారమెల్ ప్రిపేర్ చేసుకున్నాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం, డ్రైఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, పాలు, నెయ్యి వేసుకోవాలి.
  • ఆపై గరిటెతో ఉండలు కట్టకుండా కలియ తిప్పుతుండాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక పల్లెం తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పల్లెంలో సమంగా సర్ది, నచ్చిన షేప్​లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇక చివరగా కట్ చేసుకున్న ఆ ముక్కలపై కొన్ని పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బియ్యం మిఠాయిలు" రెడీ!
  • మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఈ దీపావళి రోజున ఓసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఆస్వాదించండి!

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.