Decoration Ideas of Diwali 2024 in Telugu: విజయానికి గుర్తుగా, జీవితంలోని చీకట్లను పారదోలుతూ వెలుగులు నింపే పండగగా.. దివాళీని జరుపుకుంటారు. దీపాలు, బాణాసంచా, విద్యుత్ దీపాల అలంకరణలు, పూజలు, ముచ్చటైన రంగవల్లులు.. ఇవన్నీ మనకు ఎంతో ఆహ్లాదాన్ని తెచ్చి పెడతాయి. ఇక ఈ పండగ వేళ పెద్దవాళ్లందరూ కూడా చిన్న పిల్లలుగా మారి సందడి చేస్తుంటారు. మరి ఇంత ప్రత్యేకమైన పండగకు మీ ఇంటిని అంతే స్పెషల్‌గా తీర్చిదిద్దకపోతే ఎలా? అందుకే.. దీపావళి వేళ సూపర్ డెకరేషన్ ఐడియాస్ తీసుకొచ్చాం. వీటిపై ఓ లుక్కేసి.. నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.
ఇంటిని సర్దుకోవాలి: దీపావళి పండగ అంటేనే.. దీపాలతో ఇంటిని అలంకరించుకుంటారు. అందుకు తగినట్లుగా ముందు ఇంటిని సర్దుకోవాలి. అంటే.. కర్టెన్లు, దుప్పట్లు, పిల్లో కవర్స్ వంటివన్నీ గులాబీ, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ.... వంటి కలర్లు, డిజైన్లతో ఉన్నవి ఎంచుకోవాలి. కర్టెన్లకు అద్దాలు, చమ్కీల హ్యాంగింగ్స్ తగిలించండి. ఇవి దీపపు వెలుగుల్లో ఇంటిని సరికొత్తగా మెరిపిస్తాయి.
గుమ్మాల అలంకరణ: పండగకు ఒకరోజు ముందుగానే.. గుమ్మాలు, తలుపులను పూలతో అలకరించుకోవాలి. కేవలం పూలు మాత్రమే కాకుండా.. మామిడాకులతో చిలకలు, రకరకాల డిజైన్స్ చేసి మధ్య మధ్యలో పెడితే ఇంటికి సరికొత్త లుక్ వస్తుంది.
రంగు కాగితాలతో డిజైన్స్: కలర్ పేపర్స్ తెచ్చి.. పువ్వులు, దీపాలుగా కత్తిరించండి. వాటిని తోరణాల మాదిరిగా దారానికి అంటించి వేలాడదీయండి. ఇంకా.. ఈ పేపర్లతో రకరకాల లాంతర్ డిజైన్లు తయారు చేసి.. వాటి లోపల లైట్లు అమర్చితే.. మీ ఇంటి లుక్కే మారిపోయి అందంగా కనపడుతుంది.
దీపాల అలంకరణ: పండగ నాడు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం సాధారణమే. అలా కాకుండా వాటికి కాస్త రంగులు వేసి, అద్దాలు, చమ్కీలు అద్దండి.
ఇలా పెట్టండి: సాధారణంగా చాలా మంది దీపాలను వరుసగా పెడుతుంటారు. అయితే ఈసారి కాస్త కొత్తగా పద్మం, మరేదైనా ముగ్గు డిజైన్‌లో అందంగా సర్దేయండి. ఎంత బాగుంటుందో. ఇక, ఇంటి ముందు ముగ్గులు పెట్టి అందులో రంగుల్ని నింపి దీపాలు పెడితే ఆ కళే వేరు.
ఫ్లోటింగ్ క్యాండిల్స్: ఈ పండగ కోసం ప్రత్యేకంగా ఫ్లోటింగ్ క్యాండిల్స్ అందుబాటులో ఉంటాయి. ఇత్తడి ఉర్లీలో పువ్వులను అందంగా పేర్చి, ఆ మధ్యలో ఫ్లోటింగ్ క్యాండిల్స్‌ను వెలిగించి పెట్టండి. లివింగ్ ఏరియాలో వీటిని పెట్టుకుంటే దీపపు కాంతులతో ఇల్లు దేదీప్యమానంగా వెలిగి పోతుంది. మనసుకూ ఆహ్లాదంగా ఉంటుంది.
దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!
ఇత్తడి కుందులు నల్లగా మారాయా? - ఈ టిప్స్ పాటిస్తే దీపావళి వేళ బంగారంలా మెరుస్తాయి!
అక్టోబర్ 31 లేదా నవంబర్ 1 - ఏ రోజున దీపావళి చేసుకోవాలి? - పండితులు ఏం చెబుతున్నారు?