ETV Bharat / offbeat

రాజస్థాన్‌ స్పెషల్ "ఎండుమిర్చి ఉల్లిపాయ చట్నీ"- ఇలా సింపుల్​గా చేస్తే టేస్ట్​ అదుర్స్​ అంతే!!

-ఎప్పుడూ అవే కూరలు, పచ్చళ్లే కాదు - ఓసారి ఈ రాజస్థాన్‌ చట్నీ ట్రై చేయండి!

Chilli Onion Chutney Recipe
Chilli Onion Chutney Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 9:46 AM IST

Chilli Onion Chutney Recipe : లంచ్​లో ఎన్ని కూరలున్నా కూడా ఒక రెండు ముద్దలు పచ్చడితో తింటేనే మనసు తృప్తిగా ఉంటుందని అంటుంటారు చాలా మంది. అందుకే ఇంట్లోని మహిళలు సీజన్​కి అనుగుణంగా ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరి పచ్చళ్లు ప్రిపేర్​ చేసి పెడుతుంటారు. ఇవి ఉన్నా కూడా కొంత మంది దోశ, ఉప్మా, ఇడ్లీల్లోకి రకరకాల చట్నీలు తయారు చేస్తుంటారు. అయితే, ఈ స్టోరీలో మనం అన్నంలోకి, అలాగే ఏ బ్రేక్​ఫాస్ట్​లోకైనా సూపర్​గా ఉండే ఒక చట్నీ ప్రిపేర్​ చేద్దాం. అదే రుచికరమైన 'ఎండుమిర్చి ఉల్లిపాయ చట్నీ'. ఈ విధంగా చేసుకుంటే నిమిషాల్లోనే చట్నీ తయారైపోతుంది. మరి ఈ చట్నీ ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు ? తయారీ విధానం ఏంటో మీరు ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • కశ్మీరీ ఎండుమిర్చి -20
  • ఉల్లిపాయలు - ఎనిమిది
  • చింతపండు - నిమ్మకాయంత
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • సోంపు- టేబుల్‌స్పూన్‌
  • జీలకర్ర - టేబుల్‌స్పూన్‌
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - ముప్పావు కప్పు
  • సన్నగా తరిగిన అల్లం ముక్కలు - చెంచా
  • నూనె - కప్పు

తాలింపు కోసం..

  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • మినప్పప్పు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • చిటికెడు - ఇంగువ
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 6
  • కరివేపాకు - రెండు రెబ్బలు

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత ఎండుమిర్చి తొడిమెలు తీసి రెండు మూడు ముక్కలుగా కత్తిరించాలి. ఇప్పుడు వాటిలో గ్లాసు వేడినీళ్లు పోసి పక్కనుంచాలి.
  • అలాగే చింతపండును ఒకసారి కడిగి, వేడినీళ్లతో నానబెట్టాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసిన పాన్​ పెట్టండి. ఇందులో ధనియాలు, సోంపు, జీలకర్ర వేయండి. వీటిని సన్నని సెగ మీద వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్​లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, నానిన ఎండుమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టడం కోసం.. స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో నూనె వేయండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేయాలి.
  • తాలింపు గింజలు వేగాక.. దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ, గ్రైండ్​ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమం వేసి బాగా కలపాలి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి చట్నీ ఐదారు నిమిషాలు ఉడికించుకుని దింపేసుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎర్రెర్రగా నోరూరించే ఎండుమిర్చి ఉల్లి చట్నీ తయారైపోతుంది.
  • నచ్చితే మీరు కూడా ఇలా ఓ సారి చట్నీ ట్రై చేయండి. టిఫెన్స్​, అన్నం.. ఎందులోకి తిన్నా టేస్ట్​ అద్దిరిపోతుంది.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్​ సూపరంతే!

కాకరకాయ చేదని తినట్లేదా? - ఈ కొలతలతో పచ్చడి చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.