Car Parking Safety Tips From Crackers : దీపావళి పండగ జరుపుకోవడానికి యావత్ దేశం సిద్ధమైంది. ఈ పండగ సందడి అంతా టపాసులలోనే ఉంటుంది. ఇప్పటికే బాణాసంచా ఇంటింటికీ చేరుతోంది. ఇక, గల్లీ నుంచి దిల్లీ దాకా ఈ టపాసులు మోతెక్కిపోతాయి. అయితే.. ఇలాంటి సమయంలో కేవలం మనుషులు, పెట్స్ విషయంలోనే కాదు.. వాహనదారులు తమ వెహికల్స్ పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే.. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు వాహనాలు కాలి బూడిదైనా ఆశ్చర్యం పోవాల్సిన పని లేదు. అందుకే.. మీ వెహికల్స్ జాగ్రత్తగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
దూరంగా: ఇప్పుడు చాలా మంది టపాసుల షాపులు పెడుతున్నారు. అయితే.. అవి నిర్వహించే ప్రాంతాల పక్కనే మీరు నివసిస్తున్నట్టయితే.. మీ కారును ఆ దుకాణాలకు దగ్గరగా అస్సలే ఉంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ దుకాణాల్లో పొరపాటున అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే.. మీ కారు కూడా బూడిదయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా.. పిల్లలు టపాసులు పేల్చే ప్రాంతానికి కూడా దూరంగా మీ కారును పార్క్ చేయాల్సిందే.
కవర్డ్ పార్కింగ్ : చాలా మంది తమ కార్లను షెడ్డులో పెడితే.. మరికొంతమంది ఓపెన్ ప్లేస్‌లలో పెడుతుంటారు. అయితే కారును పూర్తిగా కవర్ చేసే షెడ్డు లాంటి ప్రాంతంలోనే పార్కింగ్ చేస్తున్నట్టైతే ఇబ్బంది లేదు. అలా కాకుండా.. ఓపెన్ ప్లేస్‌లో పెడుతున్నట్టయితే.. వీధిలో ఉంచకుండా చూసుకోండి. దీపావళి ఒక్క రోజు ఇంటి రూఫ్ కింద పెట్టే అవకాశం ఉంటే.. అక్కడ పార్క్ చేయండి. ఇలా చేస్తే మీ కార్ సేఫ్‌గా ఉంటుంది.
కారు పై కవర్ వేయకండి : కారును పార్క్ చేయగానే.. చాలా మంది దుమ్ము, ధూళి పడకుండా దాని పైన కవర్ కప్పుతారు. సాధారణ రోజుల్లో అది మంచి పద్ధతే. కానీ.. దివాళీ టపాసులు మోగే సమయంలో కవర్ కప్పకపోవడమే మంచిదట. నిప్పు రవ్వలు ఎగిరి వచ్చి కవర్‌పై పడితే మంటలు వ్యాపించి కారు కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కారు కవర్లన్నీ దాదాపుగా మండే లక్షణాలనే కలిగి ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోవాలి.
పెయిడ్ పార్కింగ్ : దీపావళి వేళ రెగ్యులర్ పార్కింగ్ స్థలం రిస్క్ స్పాట్‌గా అనిపిస్తే.. మీ ఇంటి లోపల కావాల్సినంత స్థలం లేకపోతే.. ఈ పండగ రెండు రోజులు మీకు తెలిసిన వారి స్థలం సేఫ్ అనుకుంటే.. అక్కడ పార్క్ చేయడం మంచిది. అలాంటి అవకాశం లేదు అనుకుంటే.. పెయిడ్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేయడం బెస్ట్.
ఫొటోలు తీసుకోండి : మీ కారును బాణాసంచా పేలుస్తున్న ప్రాంతంలో పార్క్ చేయడం తప్ప మరో మార్గం లేకపోతే.. ఎక్కడైతే పార్క్ చేస్తారో ఆ ప్రదేశంలో కారు పార్క్ చేసిన తర్వాత మీ వాహనాన్ని కొన్ని ఫొటోలు తీసి ఉంచుకోండి. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే.. మీరు ఈ ఫొటోల ద్వారా ఎక్కడ కారుకు డ్యామేజ్ జరిగిందో చూసుకొని.. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
చిటికెలో పాత మట్టి ప్రమిదలను శుభ్రం చేయండి - దీపావళి రోజున కొత్త వాటిలా కనిపిస్తాయి!
దీపావళి ఒక్కరోజు కాదు ఐదు రోజుల పండగని మీకు తెలుసా? - ఆ విశేషాలు మీకోసం!
ఇత్తడి కుందులు నల్లగా మారాయా? - ఈ టిప్స్ పాటిస్తే దీపావళి వేళ బంగారంలా మెరుస్తాయి!