ETV Bharat / offbeat

వెడ్డింగ్​ స్టైల్​​ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్​ క్రిస్పీ అండ్​ టేస్ట్​ గ్యారెంటీ!​ - Cabbage 65 Recipe Easily at Home

Cabbage 65 : ఎక్కువ మంది ఇష్టపడని కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. ముఖ్యంగా కొంతమంది పిల్లలు దీన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. మరి ఈ లిస్ట్​లో మీ పిల్లలు కూడా ఉన్నారా? అయితే వారి కోసం సూపర్ టేస్టీగా ఉండే వెడ్డింగ్​ స్టైల్​ క్యాబేజీ పకోడా(క్యాబేజీ 65) చేసి పెట్టండి. మళ్లీ మళ్లీ అడుగుతారు.

Cabbage 65
Cabbage 65 Recipe Easily at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 3:00 PM IST

Cabbage 65 Recipe Easily at Home: క్యాబేజీ అంటే మొహం చిట్లించుకునేవారు చాలా మందే ఉన్నారు. ఇక పిల్లలైతే దాని వాసన కారణంగా దగ్గరకి కూడా పోరు. అంతేకాదు.. దీంతో ఎంతటి రుచికరమైన కూరలు, ఫ్రైలు చేసిన కూడా తినడానికి ఇష్టపడరు. అయితే క్యాబేజీని ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా ఇష్టంగా తినేలా దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ 65 చేసుకోవచ్చు. మ‌న‌కు క‌ర్రీ పాయింట్​ల‌లో, వెడ్డింగ్స్​లలో ఎక్కువ‌గా దీనిని వ‌డిస్తూ ఉంటారు. ఇది రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటుంది. దీనిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. పప్పు, సాంబార్​లోకి నంజుకుని తినడమే కాకుండా.. సాయంత్రం స్నాక్స్​లాగా కూడా ఇది బాగుంటుంది. మరి రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా క్యాబేజీ 65 ని ఎలా త‌యారు చేసుకోవాలి? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • క్యాబేజీ - 1(సుమారు 900 గ్రాములు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 2 టీ స్పూన్లు
  • వేయించిన జీలకర్ర పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • పసుపు - పావు టీ స్పూన్​
  • గ్రీన్​ చిల్లీ సాస్​ - 1 టేబుల్​ స్పూన్​
  • సోయా సాస్​ - అర టీ స్పూన్​
  • అజినమోటో - 1 టీ స్పూన్​
  • టమాట కెచప్​ - 2 టేబుల్​ స్పూన్లు
  • రెడ్​ చిల్లీ సాస్​ - 1 టేబుల్​ స్పూన్​
  • బియ్యప్పిండి - పావు కప్పు
  • మైదా - పావు కప్పు
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • రెడ్​ ఫుడ్​ కలర్​ - 1 టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 2 టీస్పూన్లు
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా
  • జీడిపప్పు - పావు కప్పు
  • చీలిన పచ్చిమిర్చి - 8
  • కరివేపాకు - 2 రెబ్బలు

తయారీ విధానం:

  • ముందుగా క్యాబేజీ తురుముకోవాలి. తర్వాత దాన్ని ఓ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, గ్రీన్​ చిల్లీ సాస్​, సోయా సాస్​, అజినమోటో, టమాట కెచప్​, రెడ్​ చిల్లీ సాస్​ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి బియ్యప్పిండి, మైదా, కరివేపాకు వేసి కలుపుకోవాలి. అయితే 65 మంచిగా రావాలంటే పిండి ముద్ద కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఒకవేళ క్యాబేజీ మిశ్రమం కలిపినప్పుడు నీరు ఉన్నట్టు అనిపిస్తే మరికొంచెం మైదా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత రెడ్​ ఫుడ్​ కలర్​ వేసుకుని మరోమారు కలుపుకుని చివరగా అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి క్యాబేజీ మిశ్రమాన్ని పకోడిల మాదిరిగా వేసుకోవాలి.
  • నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఓ నాలుగు నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్​లో అలానే ఉంచాలి. ఇలా చేయడం వల్ల పిండి మధ్యలో కూడా కాలుతుంది.
  • ఆ తర్వాత మంటను హై ఫ్లేమ్​లో పెంచి క్రిస్పీగా వేయించుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్యాబేజీలను మరీ క్రిస్పిగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా క్రిస్పీగా వేగాయనుకుంటే వెంటనే ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే చల్లారిన తర్వాత మరింత క్రిస్పీగా అవుతాయి.
  • ఇప్పుడు అదే నూనెలో జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించుకుని.. ఈ మిశ్రమాన్ని, జీడిపప్పును వేయించిన క్యాబేజీ ముక్కలలో వేసి కలుపుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే వెడ్డింగ్​ స్టైల్​ క్యాబేజీ 65 రెడీ!

రోడ్​సైడ్​ ఫాస్ట్​ఫుడ్​తో ఆరోగ్యానికి ముప్పు - ఇంట్లోనే మమ్మీని "గోధుమపిండి మంచూరియా" చేయమనండి! - ఇలా చేస్తే అదుర్స్

పిల్లలు రోజూ వైట్​ రైస్​ ఎలా తింటారు మమ్మీ? - ఈ కలర్​ ఫుల్​ 'గార్లిక్ రైస్' పెట్టండి - మెతుకు మిగలదు!

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.