ETV Bharat / offbeat

ఈ పండక్కి మీ ఇంట్లో నేతి బొబ్బట్లు చేస్తారా? - మేం చెప్పినట్టు చేస్తే రుచి అమృతమే!

చాలా మందికి స్వీట్​ రెసిపీస్​ అంటే ఇష్టం. అందులోనూ.. బొబ్బట్లను మరింత ఇష్టంగా తింటుంటారు. మరి.. ఈ దసరా పండక్కి ఇంట్లో నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తారా? ఇదిగో ఇలా చేశారంటే టేస్ట్ అద్దిరిపోతుంది.

author img

By ETV Bharat Lifestyle Team

Published : 2 hours ago

How to Make Nethi Bobbatlu
Nethi Bobbatlu (ETV Bharat)

How to Make Nethi Bobbatlu in Telugu : బొబ్బట్లు.. ఈ పేరు చెబితేనే చాలు చాలా మందికి నోరూరిపోతుంది. కానీ, కొందరు టైమ్ ఎక్కువ పడుతుందని, మరికొందరు వీటిని ఎలా తయారుచేసుకోవాలో తెలియక ఆగిపోతారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, ఈ దసరా పండక్కి ఇంటి వద్ద నేతి బొబ్బట్లను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచికరంగా రావడమే కాదు.. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి! ఇంతకీ.. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శనగపప్పు - 1 కప్పు
  • పసుపు - పావు టీస్పూన్
  • ఉప్పు - చిటికెడు
  • నెయ్యి - తగినంత
  • బెల్లం తురుము - 1 కప్పు
  • యాలకుల పొడి - అరటీస్పూన్

పిండి తయారీ కోసం :

  • మైదాపిండి - ఒకటిన్నర కప్పులు
  • గోధుమపిండి - అరకప్పు
  • నెయ్యి - 2 నుంచి 3 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - చిటికెడు
  • పసుపు - పావు టీస్పూన్

దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్​దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీ​గా చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంటపాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత నానబెట్టిన శనగపప్పును వాటర్ వడకట్టి ప్రెషర్ కుక్కర్​లో వేసుకొని ఒకటిన్నర కప్పుల వాటర్ పోసుకోవాలి. ఆపై అందులో పసుపు, ఉప్పు, 1 టీస్పూన్ నెయ్యి వేసుకొని మూతపెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికేలోపు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లించుకున్న మైదా పిండి, గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, పసుపు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత సరిపడా వాటర్​ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్​గా కలుపుకోవాలి. ఆపై పిండిముద్దపై కొద్దిగా నెయ్యి అప్లై చేసి మూత పెట్టి 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
  • ఇప్పుడు కుక్కర్​లో ఉడికించుకున్న శనగపప్పును వాటర్ లేకుండా వడకట్టుకోవాలి.
  • తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని 1 టీస్పూన్ నెయ్యి వేసుకున్నాక.. బెల్లం తురుము వేసుకొని మంటను అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. అయితే, మీరు కాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే అదనంగా మరో రెండు స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవచ్చు.
  • బెల్లం పూర్తిగా కరిగిందనుకున్నాక.. అందులో ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న శనగపప్పు ముద్దను వేసి కలుపుతూ పాకం పిండి మొత్తానికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ విధంగా మిక్స్ చేసుకున్నాక.. పూర్ణం పాన్ సైడ్స్​కి అంటుకోకుండా 3 టేబుల్​స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అలాగే.. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే.. ఈ పూర్ణం అనేది మరీ మెత్తగా, గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్​గా ఉండేలా చూసుకోవాలి.
  • ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో పెట్టి కలుపుతూ ఎప్పుడైతే పూర్ణం పాన్​ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టౌ ఆఫ్ చేసి.. ఆ పూర్ణాన్ని మరో ప్లేట్​లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • అనంతరం పూర్ణం చల్లారాక.. చేతికి కొంచం నెయ్యి రాసుకుంటూ ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మీరు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిముద్దని తీసుకొని మరోసారి మెత్తగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఆ పిండి ముద్దనూ పూర్ణం ముద్దల సైజ్​లో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు రెండు బటర్ పేపర్లు తీసుకొని రౌండ్​గా షేప్​లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బటర్ పేపర్​పై కొద్దిగా నెయ్యి రాసుకొని ఒక పిండి ముద్దను ఉంచి ముందుగా చిన్న పూరి సైజ్​లా కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి.
  • అనంతరం దానిపై పూర్ణం ముద్దను ఉంచి అంచులను చక్కగా సీల్ చేసుకోవాలి. ఆపై మళ్లీ నెమ్మదిగా ముందుగా చిన్న పూరీ సైజ్​లా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దానిపై కొద్దిగా నెయ్యి వేసి పైన మరో బటర్ పేపర్​ను ఉంచి చపాతీ రోలర్​తో వీలైనంత పలుచగా రోల్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడి అయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టును వేసి ముందుగా 5 నుంచి 10 సెకన్ల పాటు రెండు వైపులా కాల్చుకోవాలి.
  • ఆ తర్వాత నెయ్యి అప్లై చేసుకొని మరోసారి కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే నోట్లే వేసుకుంటే కరిగిపోయే "నేతి బొబ్బట్లు" రెడీ!

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.