ETV Bharat / offbeat

ఈ విషయాలు తెలియక మిగిలిన సబ్బు ముక్కలను పడేస్తున్నారు - ఉపయోగాలు తెలిస్తే ఇకపై అలా చేయరు! - Leftover Soap Shards Uses

Leftover Soap Shards Uses : సబ్బు అరిగిపోయి సన్నగా మారిన తర్వాత ఆ ముక్కలను పడేస్తుంటారు. మీరు కూడా అలాగే చేస్తున్నారా? అయితే.. వాటితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇకపై పడేయరని అంటున్నారు నిపుణులు. ఇంతకీ.. మిగిలిన సబ్బు ముక్కలతో కలిగే ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Benefits of Leftover Soap Shards
Leftover Soap Shards Uses (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 27, 2024, 1:44 PM IST

Amazing Benefits of Leftover Soap Shards : ప్రస్తుతం మార్కెట్​లోకి రకరకాల లిక్విడ్ సబ్బులు వచ్చాయి. అయినప్పటికీ మనలో మెజార్టీ పీపుల్ స్నానం చేయడానికి సాధారణ సబ్బులనే వాడుతుంటారు. అయితే..అవి కాస్త అరిగి చేతికి అందకపోయే సరికి వాటిని పక్కన పెట్టేయడమో.. డస్ట్​ బిన్​లో వేయడమో చేస్తుంటారు. మీరు కూడా చిన్న ముక్కలను బయట పడేస్తున్నారా? వాటి ద్వారా పొందే ఈ ప్రయోజనాలు తెలిస్తే ఇకపై అలా చేయరని అంటున్నారు నిపుణులు. మరి.. ఆ సబ్బు ముక్కలతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వార్డ్ రోబ్ ఫ్రెషనర్​గా.. : మిగిలిన సబ్బు ముక్కలను డస్ట్​బిన్​లో వేసే బదులు ఇలా చేస్తే.. మంచి వార్డ్​ రోబ్ ఫ్రెషనర్ లేదా క్లాసెట్ ఫ్రెషనర్​గా యూజ్ అవుతాయంటున్నారు. ఇందుకోసం.. ఒక టిష్యూ పేపర్​ లేదా క్లాత్​ తీసుకొని మంచి సువాసనను వెదజవల్లే సబ్బు ముక్కలను అందులో చుట్టి వార్ట్​ రోబ్​ లేదా క్లాసెట్ లోపల పెట్టండి. ఫలితంగా.. అందులో ఉన్న చెడు వాసన పోయి మంచి వాసన వచ్చేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

పిల్లల స్కూల్ షూస్​లో : పిల్లల స్కూల్ సాక్సులు చాలా సార్లు దుర్వాసన వస్తుంటాయి. రోజూ క్లీన్ చేసినప్పటికీ.. వాళ్ల పొద్దంతా వాటిని ధరించి ఉండడంతో సహజంగానే చెమట దుర్వాసన వస్తాయి. సాక్సులతోపాటు బూట్లు కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి. ఇలాంటప్పుడు.. సబ్బు ముక్కలను ఓ కాగితంతో చుట్టి, రాత్రిపూట చిన్నారుల బూట్లలో పెడితే.. మర్నాటి కల్లా దుర్వాసన దూరమవుతుందని చెబుతున్నారు.

డోర్ సమస్యకు.. : ఇళ్లలో చెక్క తలుపులు ఉన్నప్పుడు కొన్నిసార్లు అవి జామ్ అయిపోయి ఓపెన్, క్లోజ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. తెరిచినప్పుడు ఒక్కోసారి కిర్రుమనే శబ్ధం వస్తుంటుంది. అలాంటి టైమ్​లో చిన్న సబ్బు ముక్క చాలా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంటే.. స్టక్ అయిన తలుపులు లేదా స్లైడర్లకు సబ్బును రాయండి. ఇలా చేయడం ద్వారా డోర్లు లేదా స్లైడర్లు బాగా తిరుగుతాయి. ఫలితంగా ఎలాంటి శబ్ధాలూ రావని చెబుతున్నారు.

జిప్​లను తేలిగ్గా తీయడానికి.. : కొన్నికొన్నిసార్లు జాకెట్, ప్యాంటు, బ్యాగ్​ జిప్​లు సరిగా పనిచేయవు. దాంతో స్టక్ అవుతుంటాయి. ఫలితంగా జిప్ క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఎక్కువ బలాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ, అలాంటి టైమ్​లో చిన్న సబ్బు ముక్కను తీసుకొని జిప్ మీద రుద్దండి. ఆపై జిప్ ఓపెన్, క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా జిప్ ఫిక్స్ అవుతుందంటున్నారు నిపుణులు.

తాళం ఓపెన్ చేయడానికి.. : తాళాలు పాతగా అయినప్పుడు చాలా సార్లు తాళం వేయడం, తీయడం కొంచం కష్టంగా మారుతుంది. అలాంటి సమయాల్లో మిగిలిన సబ్బు ముక్కలతో ఇలా చేశారంటే తాళం వేయడం, తీయడం సులువవుతుందంటున్నారు నిపుణులు. అదేంటంటే.. మిగిలిన సబ్బు ముక్కను తీసుకొని దానిపై కొద్దిసేపు తాళం చెవిని రుద్దాలి. ఆపై ఈ సబ్బు కోటెడ్ కీని తాళం కప్పలో పెట్టి ఓపెన్ చేస్తే తాళం ఈజీగా వచ్చేస్తుందంటున్నారు. అదేవిధంగా.. సబ్బు ముక్కలను స్క్రూలు, బ్లేడ్స్‌ను వదులుగా చేసేందుకూ వాడొచ్చు.

ఇవీ చదవండి :

కిచెన్​, బాత్​రూమ్​లోని ట్యాప్స్​ జిడ్డుగా మారాయా ? ఇలా క్లీన్​ చేస్తే అప్పుడే కొన్న వాటిలా మెరుస్తాయి!

అలర్ట్ : పెద్దవాళ్ల సబ్బులు పిల్లలకు ఉపయోగిస్తున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.