ETV Bharat / offbeat

బూడిద గుమ్మడిని దిష్టికే వాడుతున్నారా? - ఇలా ఉపయోగిస్తే ఊహించని అద్భుతాలు! ఓ సారి ట్రై చేయండి! - Ash Gourd Juice Uses - ASH GOURD JUICE USES

Benefits Of Ash Gourd: బూడిద గుమ్మడికాయ పేరు వింటే చాలు.. చాలా మందికి దిష్టి తీయడానికి లేదంటే గుమ్మంలో వేలాడదీయడానికి మాత్రమే ఉపయోగిస్తారని తెలుసు. కానీ, ఈ గుమ్మడికాయను ఇలా తీసుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూడండి..

Ash Gourd Juice
Benefits Of Ash Gourd Juice (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 5:33 PM IST

Ash Gourd Juice Health Benefits: చాలా మందికి క్యారెట్​, బీట్​రూట్​, కీరదోస వంటి వివిధ రకాల జ్యూస్​లు తాగడం అలవాటుగా ఉంటుంది. ఈ జ్యూస్​లలో క్యాలరీలు తక్కువగా ఉండడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్​, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులంటున్నారు. అయితే, మెజార్టీ జనాలకు ఈ జ్యూస్​లు మాత్రమే బాగా తెలుసు. కానీ, వీటితో పాటు రోజూ బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకున్నా ఎన్నో హెల్త్​ బెని​ఫిట్స్​ పొందవచ్చని మీకు తెలుసా ? ఏంటి నమ్మలేకున్నారా?.. మీరు విన్నది నిజమే. కేవలం మనం దిష్టి తీయడానికి.. ఇంటి ముందు వేలాడదీయడానికి వాడే బూడిద గుమ్మడికాయను డైలీ జ్యూస్​ చేసుకుని తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్​ తాగడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

బూడిద గుమ్మడికాయల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. ఇవి సాధారణంగా రెండు నుంచి మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి.

వెయిట్​ లాస్​ : ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అయితే, ఊబకాయం ఉన్న వారు డైలీ ఒక్క గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల త్వరగా కొవ్వు కరిగిపోతుందని నిపుణులు అంటున్నారు.

2018లో "Journal of the American Dietetic Association"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బూడిద గుమ్మడి జ్యూస్​ తాగిన వారు తక్కువ ఆహారం తీసుకున్నారని.. అలాగే వెయిట్ లాస్​ అయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ రీసెర్చ్​లో టెక్సాస్ A&M యూనివర్సిటికీ చెందిన న్యూట్రిషన్ ప్రొఫెసర్ 'డాక్టర్ సాలాస్-సలజార్' పాల్గొన్నారు.

మలబద్ధకం సమస్య తగ్గుతుంది : చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వివిధ మందులను వాడుతుంటారు. అయితే, ఈ సమస్య ఉన్న వారు బూడిద గుమ్మడి కాయ జ్యూస్​ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని.. అంతే కాకుండా గ్యాస్​, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయని సూచిస్తున్నారు.

ఆందోళన తగ్గుతుంది : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న విషయాలకే ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇలా తరచూ ఆందోళన చెందేవారు గుమ్మడికాయ జ్యూస్​ తాగడం వల్ల టెన్షన్​ని తగ్గించుకుని మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎనర్జీ పెంచుతుంది : కొంతమంది ఏ పని చేసినా నీరసం రావడంతో త్వరగా అలసిపోతుంటారు. ఇలాంటి వారు డైలీ గుమ్మడికాయ జ్యూస్​ తాగడం వల్ల ఎనర్జీ పెరుగుతుందని.. ఇందులోని విటమిన్​ బి3 తక్షణ శక్తిని అందిస్తుందంటున్నారు.

అల్సర్ మాయం : ప్రతిరోజు ఒక గ్లాసు గుమ్మడికాయ జ్యూస్​ తాగడం వల్ల కడుపులో ఏర్పడే అల్సర్లు తగ్గిపోతాయని.. అందుకే అల్సర్​తో బాధపడే వారు ఈ జ్యూస్​ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈ జ్యూస్​ తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని.. అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

గుమ్మడికాయ ఫేస్ మాస్క్​తో మీ ఫేస్​లో ఫుల్ గ్లో- ఎలా తయారు చేయాలో తెలుసా?

బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా? అయితే ఈ లాభాలు మిస్ అయినట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.