ETV Bharat / offbeat

అమ్మాయిలూ ఐ-లైనర్ త్వరగా చెదిరిపోతుందా? - ఇలా చేశారంటే రోజంతా అలాగే నిలిచి ఉంటుందట!

ఐ-లైనర్ ఎక్కువసేపు చెదిరిపోకుండా ఉండాలా? - ఈ టిప్స్ పాటిస్తే చాలు అంటున్న నిపుణులు!

Prevent Eyeliner Smudging Tips
Tips to Prevent Eyeliner Smudging (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Best Tips to Prevent Eyeliner Smudging : అమ్మాయిల అందంలో ముఖ్యపాత్ర పోషించే వాటిలో కళ్లు కూడా ఒకటి. ఈ క్రమంలోనే ముఖ సౌందర్యాన్ని మెరిపించడం కోసం చూడగానే ఆకట్టుకునేలా కళ్లను అందంగా తీర్చిదిద్దుతుంటారు. అందులో భాగంగానే కంటిని ఇంపుగా తీర్చిదిద్దుకోవడానికి కాలేజీ అమ్మాయిల నుంచి ఆఫీస్​కు వెళ్లే యువతుల వరకు చాలా మంది ఎంతో కష్టపడి ఐ-లైనర్ పెట్టుకుంటుంటారు.

అయితే, కొన్నిసార్లు ఎంత చక్కగా కంటికి ఐ-లైనర్ పెట్టుకున్నా ఒక్కోసారి వాతావరణం వల్లో, లేదంటే మహిళలు చేసే కొన్ని పొరపాట్ల వల్లో త్వరగా చెరిగిపోతుంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఒక్కసారి ఐ-లైనర్ పెట్టుకుంటే రోజంతా ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. అలాంటి వారికోసమే కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. అవి పాటించారంటే ఐ-లైనర్ త్వరగా చెదిరిపోకుండా రోజంతా అలాగే నిలిచి ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • చాలా మంది ఫేస్​కి మాయిశ్చరైజర్‌ రాసుకునే క్రమంలో కళ్లు, కనురెప్పల చుట్టూ కూడా అప్లై చేసుకొని, ఆపై ఐ-లైనర్‌ పెట్టుకుంటుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల ఐ-లైనర్‌ త్వరగా చెదిరిపోయే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు కళ్లకు ఐ-లైనర్‌ పెట్టుకోవాలనుకుంటే ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్‌ రాసుకోకపోవడమే బెటర్ అని చెబుతున్నారు.
  • పదే పదే ఫేస్ వాష్ చేసుకోవడం, చెమట పట్టడం వల్ల కూడా ఐ-లైనర్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండదు. అలాంటప్పుడు వాటర్‌ ప్రూఫ్‌ లేదా జెల్‌ తరహా ఐ-లైనర్‌ ఎంచుకోవడం మేలు అంటున్నారు. ఎందుకంటే అలాంటి ఐ-లైనర్​లు ఎక్కువ సమయం చెదిరిపోకుండా ఉంటాయట.
  • అలాగే, అద్దీ అద్దనట్లుగా కొద్దిపాటి పౌడర్‌ని ఉపయోగిస్తే ఐ-లైనర్‌ మెరుపు తగ్గకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా ముందు పౌడర్‌ రాసుకొని ఆపై ఐ-లైనర్‌ అప్లై చేసుకున్నా చక్కటి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.
  • ముఖానికి మేకప్‌ వేసుకునే ముందు ప్రైమర్‌ ఎలాగైతే రాసుకుంటామో, అదేవిధంగా ఐ-లైనర్‌ పెట్టుకోవడానికి ముందు కూడా ఐ ప్రైమర్‌ అప్లై చేసుకోవడం వల్ల గుడ్ రిజల్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, అదీ తక్కువ మొత్తంలో రాసుకుంటే ఐ-లైనర్‌ ఎక్కువ సేపు నిలిచి ఉంటుందంటున్నారు.
  • ఐషాడో కూడా ఐ-లైనర్‌ ఎక్కువ సమయం నిలిచి ఉండేందుకు సహకరిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఐ-లైనర్‌ వేసుకోవడం కంప్లీట్ అయ్యాక, బ్రష్‌ సహాయంతో కనురెప్పలపై షాడోని పైపైన తీర్చిదిద్దితే సరిపోతుందంటున్నారు.
  • అలాగే కంటి మేకప్ కోసం ఐ-లైనర్‌ అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా కన్సీలర్‌తో టచప్‌ ఇచ్చినా మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

మీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నారా? - ఈ హెల్త్ ప్రాబ్లమ్స్​ గ్యారెంటీ!

చీరను ఎలా కడుతున్నారు? - ఇలా కడితే "లుకింగ్​ వెరీ బ్యూటిఫుల్​"!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.