ETV Bharat / offbeat

బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!

- ఈవెనింగ్ టైమ్​ సూపర్ స్నాక్ రెసిపీ -ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఫుల్ ఖుష్!

author img

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Street Style Batani Chaat
Batani Chaat (ETV Bharat)

How to Make Street Style Batani Chaat: చాలా మందికి సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్ తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో ఎలాంటి స్నాక్ ఐటమ్స్ లేకపోతే అలా బయటకి వెళ్లి సమోసా, పునుగులు, చాట్ వంటిని లాగించేస్తుంటారు. ముఖ్యంగా పిల్లలకైతే బడి నుంచి రాగానే తినడానికి ఏదో ఒకటి ఉండాల్సిందే. అలాంటి వారికోసమే ఒక సూపర్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. స్ట్రీట్ స్టైల్ బఠాణీ చాట్. నిమిషాల్లోనే చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఆలస్యమెందుకు సాయంత్రం పూట మీకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ స్నాక్ రెసిపీని ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • తెల్ల బఠాణీలు - 1 కప్పు
  • పసుపు - 1 టీస్పూన్
  • ఉప్పు - సరిపడా
  • నూనె - తగినంత
  • బంగాళదుంపలు - 3(మీడియం సైజ్​వి)
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ఇంగువ - పావు టీస్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయలు - 2(మీడియ సైజ్​వి)
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • టమాటాలు - 2
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 2 టీస్పూన్లు
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • పావ్ బాజీ మసాలా - 1 టీస్పూన్
  • చాట్ మసాలా - 1 టీస్పూన్
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బఠాణీలను శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. లేదంటే.. మీరు సాయంత్రం చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకున్నా సరిపోతుంది.
  • అనంతరం నానబెట్టుకున్న బఠాణీలను కుక్కర్​లో వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే.. అందులో పావు టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ చొప్పు ఉప్పు, ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ఈలోపు మరో కుక్కర్ లేదా బౌల్​లో బంగాళదుంపలను నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్​లో వేసుకుంటే 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆలూ ఉడికించుకున్నాక.. వాటి తొక్క తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న బఠాణీలను సగం వేసుకొని.. అవి ఉడికించిన వాటర్​నే తగినన్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు.. స్టౌపై కడాయి పెట్టుకొని 2 టేబుల్​స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. జీలకర్ర, ఇంగువ, సన్నగా తరుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయంత వరకు వేయించుకోవాలి. ఆపై.. అందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్​లో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • టమాటాలు సాఫ్ట్​గా ఉడికాయనుకున్నాక.. వాటిని ఒకసారి గరిటెతో మెత్తగా అయ్యేలా మాష్ చేసుకోవాలి. తర్వాత కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పావ్ బాజీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై మూతపెట్టి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న బఠాణీల పేస్ట్, మిగిలిన ఉడికించిన బఠాణీలను వాటర్​తో సహా వేసుకోవాలి. అలాగే.. పొట్టు తీసి పెట్టుకున్న ఉడికించిన ఆలూ ముక్కలను వేసుకొని స్టౌను లో ఫ్లేమ్​లో ఉంచి అన్నీ కలిసేలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉడికించిన ఆలూ ముక్కలను గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా మాష్ చేసుకోవాలి. అనంతరం చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూతపెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక.. మూతతీసి ఒకసారి కలిపి గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై అరచెక్క నిమ్మరసం పిండుకొని కలిపి సర్వ్ చేసుకోవాలి.
  • అయితే, సర్వ్ చేసుకునే ముందు దాన్ని ఒక బౌల్​లోకి తీసుకొని పైన కొన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకోవాలి.
  • అన్నింటికంటే ముఖ్యంగా కొద్దిగా కారపూస వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "స్ట్రీట్ స్టైల్ బఠాణీ చాట్" రెడీ!

ఇవీ చదవండి :

యమ్మీ యమ్మీగా బేకరీ స్టైల్ "వెజ్ బర్గర్" - ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!

టేస్టీ అండ్​ స్పైసీ "ఉల్లి మిక్చర్​" - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - రుచి​ మస్త్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.