ETV Bharat / offbeat

తెలియక చేసే ఈ పనులతో మీ ఇల్లు కాలుష్యంతో నిండిపోతోందట! - ఈ జాగ్రత్తలు మస్ట్! - AVOID THESE HABITS TO CLEAN HOME

-ఇంటి క్లీనింగ్​ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు - ఈ టిప్స్ పాటించాలని సూచన

Avoid these Habits to Clean Home
Avoid these Habits to Clean Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2024, 11:36 AM IST

Avoid these Habits to Clean Home : ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ క్రమంలోనే ఇంటిని శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు వస్తువుల దుమ్ము దులపడం.. వంటివి తరచూ చేస్తుంటారు మహిళలు. అయితే మనం చేసే కొన్ని రోజువారీ పనులు.. మనకు తెలియకుండానే మన ఇంటిని కలుషితం చేస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా మన ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశాలు ఎక్కువంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా పనులు? వాటి వల్ల ఇల్లు ఎలా కలుషితమవుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కార్పెట్లు-రగ్గులు: ఎట్రాక్ట్​ చేసే రంగులు, డిఫరెంట్​ డిజైన్లతో కూడిన కార్పెట్లు-రగ్గులు లివింగ్‌ రూమ్‌, హాల్‌కు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. అందుకే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ వీటి వినియోదం పెరిగిపోయింది. అయితే.. ఈ అందం, ఆకర్షణ వెనుక ఇంటిని కలుషితం చేసే ప్రమాదకర వాయువులు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొన్ని రకాల కార్పెట్లు, రగ్గులు హానికరమైన సమ్మేళనాలతో తయారవుతాయని..అవి విడుదల చేసే ఘాటైన వాసనలు, రసాయనాలు.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే వీటిని శుభ్రం చేయకుండా ఎక్కువ రోజులు అలాగే వాడడం వల్ల వాటిపై చేరిన దుమ్ము-ధూళి మన శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తాయని చెబుతున్నారు. కాబట్టి రగ్గులు వాడేవారు.. ఇలాంటి రసాయనపూరిత రగ్గులకు బదులుగా జ్యూట్‌, ర్యాగ్‌ రగ్స్‌, చేత్తో నేసిన రగ్గులు-కార్పెట్లను ఉపయోగిస్తే మంచిదని.. ఏ ప్రమాదమూ ఉండదంటున్నారు. అలాగే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం కూడా సులభమే అని వివరిస్తున్నారు.

విష వాయువులు: ఇంట్లోని ఘాటైన, దుర్వాసనల్ని పోగొట్టడానికి ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌, సెంటెడ్‌ క్యాండిల్స్‌.. వంటివి ఉపయోగించడం కామన్​. అయితే వీటి నుంచి రిలీజ్​ అయ్యే సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని పంచినా.. వాటి తయారీలో వాడే రసాయనాలు ఆస్తమా సహా ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని తెచ్చి పెట్టే ప్రమాదం ఎక్కువంటున్నారు. అందుకే వీటికి బదులు నాఫ్తలీన్‌ బాల్స్‌ని అక్కడక్కడా పెట్టడం, అత్యవసర నూనెల్ని ఉపయోగించడం, అత్యవసర నూనెలతో తయారైన క్యాండిల్స్‌ని వెలిగించడం, చెడు వాసనలు వచ్చే చోట బేకింగ్‌సోడా-వెనిగర్‌ వంటివి చల్లడం, మల్లె-లావెండర్‌-పుదీనా-రోజ్‌మేరీ వంటి సువాసనలు వెదజల్లే మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడం.. లాంటివి చేయవచ్చని చెబుతున్నారు.

హీటర్లకు బదులుగా: చలికాలంలో గదిలో వెచ్చదనం కోసం చాలా మంది ఎలక్ట్రిక్‌ హీటర్లు, ఫైర్‌ ప్లేస్‌.. వంటివి ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే ఇవి కూడా ఇంటిని కలుషితం చేసి.. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని.. వీటి నుంచి వెలువడే వాయువులు, పొగ.. శ్వాస సంబంధిత సమస్యల్ని తెచ్చిపెడతాయంటున్నారు. అలాగే ఈ వేడి గదిలోని తేమను తొలగించి.. వాతావరణాన్ని మరింత పొడిగా మారుస్తుందని.. తద్వారా చర్మ సంబంధిత అలర్జీలు, కంటి ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు. కాబట్టి ఇంట్లో వెచ్చదనం నింపుకోవడానికి సహజసిద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించడం మేలంటున్నారు. ఈ క్రమంలో సోఫా-మంచంపై వెల్వెట్‌ కవర్లు-బెడ్‌షీట్స్‌ పరచడం, మందపాటి కర్టెన్లను వేలాడదీయడం, ఉదయాన్నే కిటికీలు తెరిచి ఇంట్లోకి ఎండ పడేలా చేయడం.. వంటివి చేయచ్చని సలహా ఇస్తున్నారు.

పెర్‌ఫ్యూమ్‌ వాడుతున్నారా: చాలామంది బ్యూటీ కేర్​లో మేకప్‌, లోషన్లు, పెర్‌ఫ్యూమ్‌, హెయిర్‌ స్ప్రే.. వంటివి కచ్చితంగా ఉండాల్సిందే. అయితే వీటి తయారీలో వాడే రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా.. ఇంటి వాతావరణాన్నీ కలుషితం చేస్తాయంటున్నారు. కాబట్టి ఈ పొరపాటు చేయకుండా.. ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకునే స్క్రబ్‌, ఫేస్‌మాస్క్‌లు, శీకాకాయ షాంపూ, పెర్‌ఫ్యూమ్‌ కోసం అత్యవసర నూనెలు.. వాడటం మంచిదని.. వాటితో అందం, ఆరోగ్యంతో పాటు ఇల్లూ పరిశుభ్రంగా ఉంటుందని చెబుతున్నారు.

పెట్స్‌ పరిశుభ్రంగా: ఇష్టంతోనో, రిలాక్సేషన్​ కోసమనో.. ఈ రోజుల్లో చాలామంది పెంపుడు జంతువుల్ని తమ కుటుంబంలో భాగం చేసుకుంటున్నారు. అయితే వీటిని పెంచుకోవడమే కాదు.. పరిశుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. లేదంటే వాటి వల్ల ఇంట్లో నేల, సోఫా కవర్లు, బెడ్‌షీట్లపై.. దుమ్ము, క్రిములు చేరతాయి. అవి ఇంటిని అపరిశుభ్రంగా మార్చుతాయని.. తద్వారా మన ఆరోగ్యానికీ హానీ కలిగిస్తాయని అంటున్నారు. కాబట్టి మనం ఎలాగైతే రోజూ స్నానం చేస్తామో.. అలాగే పెంపుడు జంతువులకు కూడా తరచూ స్నానం చేయించాలని చెబుతున్నారు.

సూపర్ టిప్స్ : అద్దాలు, గాజు వస్తువులపై మరకలు ఎంతకీ పోవట్లేదా? - చిటికెలో కొత్తవాటిలా మెరిపించండి!

డోర్ మ్యాట్స్ ఇలా క్లీన్ చేయండి - ఎంతటి మురికివైనా నిమిషాల్లో కొత్తవాటిలా మారుతాయి!

దుస్తులు ఉతకడానికి, గిన్నెల క్లీనింగ్​ కోసం సబ్బులు వాడుతున్నారా? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.